ఉత్తరాయణం

పెత్తనానికి ముందు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రరాజ్యం అమెరికా తాజాగా తాఖీదు ఇచ్చింది. ఇరాన్ నుండి ముడి చమురు దిగుమతుల్ని భారత్ పూర్తిగా రద్దుచేసుకోవాలని లేదంటే తాము విధించే ఆంక్షలకు సిద్ధపడాలన్నది ఆ తాఖీదు సారాంశం. ఇరాన్‌తో అణుఒప్పందం విషయంలో ఏకపక్షంగా వైదొలిగిన తర్వాత అమెరికా ఆ దేశంతో అన్ని దేశాలూ వ్యాపార లావాదేవీలు మానుకోవాలని గతంలోనే హుకుం జారీచేసింది. మన దేశం సహా ఎనిమిది దేశాలకు ఆ హుకుం నుండి ఆరు మాసాల మినహాయింపు వచ్చింది. ఆ గడువు మే 2 నాటికి పూర్తయ్యాక- మరి మినహాయింపు ఉండబోదంటూ తాజాగా సెలవిచ్చింది. అంటే మన దేశం ఇరాన్ నుండి పూర్తిగా చమురు దిగుమతుల్ని రద్దుచేసుకోవాలని భావం. అయితే, అలాంటి ఏకపక్ష బెదిరింపుల పప్పులేవీ తమ దగ్గర ఉడకవంటూ ఇన్నాళ్లూ బీరాలు పలికిన మన ప్రభుత్వం ఇప్పుడు మెత్తబడుతూ సరేనంటూ సన్నాయి నొక్కులు నొక్కడం ఆక్షేపణీయం. భారత్ తన చమురు దిగుమతుల్లో పది శాతం మేరకు ఇరాన్ నుండి తెచ్చుకుంటోంది. ఆ దేశం కూడా ఉచిత రవాణా, ఉచిత భీమా, అరవై రోజుల క్రెడిట్, డాలర్ కాకుండా రూపాయిల ద్వారా వ్యాపారం తరహా సానుకూల సహకారాన్ని మన దేశానికి అందిస్తోంది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో దిగుమతుల్ని తగ్గించుకున్నా, ఇప్పుడు జరుగుతున్న దిగుమతుల పరిమాణం ఎక్కువే. ఇలాంటి మంచి సరఫరాదారుని వదులుకొంటే వ్యూహాత్మకంగా, వ్యాపారపరంగా నష్టమే. పైగా చాబహర్ పోర్టు నిర్మాణం లాంటి ఉభయులకూ లాభమైన ఆర్థిక బంధాలున్నాయి. అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. పోనీ అందుకుతగ్గ ప్రత్యామ్నాయం అమెరికా చూపిస్తుందా? అంటే అదీ లేదు. కేవలం హామీయే. వాస్తవానికి స్వలాభం తప్ప భారత్ లాభనష్టాల పట్ల అమెరికాకు పెద్ద పట్టింపులేదు. హార్లే డేవిడ్సన్ బైకుల దిగుమతిలో భారత్ ఏభై శాతం పన్నులు తగ్గించినా, అమెరికా అధ్యక్షుడు ‘గొప్పగా తగ్గించావులే’ అంటూ మన ప్రధానిని వేళాకోళమాడి డెబ్భై శాతం తగ్గించాలంటూ డిమాండు చేశాడు తప్ప ధన్యవాదాలు చెప్పింది లేదు. పైగా భారత్ నుండి అమెరికాకు వచ్చే దిగుమతులకు ‘జనరల్ సిస్టం ఆఫ్ ప్రిఫెరెన్స్’ పేరుతో కొన్ని దశాబ్దాలుగా ఇస్తున్న రాయితీల్ని ఎత్తేస్తానంటూ చెబుతూ వస్తున్నారు. స్వంత లాభం చూసుకొనే అమెరికాను నమ్మి మిగతా దేశాల్ని దూరం చేసుకోవడం భారత్‌కి అన్నివిధాలా చేటు. దేశ సార్వభౌమత్వానికి, దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ అమెరికా వత్తిళ్లకు తలొంచకపోవడమే సబబు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
విద్యార్థుల పాలిట శాపం
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. పాస్ అవుతాం అనుకున్న విద్యార్థులు ఫెయిల్ కావడం, తప్పుల తడకగా మార్కులు ముద్రించడంతో మనస్తాపానికి గురైన కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి అందరిలోనూ విషాదాన్ని నింపారు. తమ పిల్లలు ప్రయోజకులవుతారనుకుని కలలుకన్న తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇంటర్ బోర్డ్ తప్పిదానికి ఏమీ తెలియని విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందా? గుడ్డిగా మార్కులు వేశారా? కంప్యూటర్‌లో మార్కులను నమోదు చేసినపుడు తప్పులు దొర్లాయా? అనే విషయాలు అంతుచిక్కడం లేదు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్ కాలేజీలోని సీనియర్ ఇంటర్ విద్యార్థిని జి.నవ్యకి ముందుగా తెలుగులో ‘సున్నా’ మార్కులు వచ్చినట్లు, మర్నాడు 99 మార్కులు వచ్చినట్లు జాబితాలో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులలో అధిక శాతం మార్కులు వచ్చి, తెలుగులో ‘సున్నా’ వచ్చినట్లు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులు కలవరానికి గురయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ర్యాంకర్లు ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్ కావడం ఎవరి నిర్లక్ష్యం? ఫలితాలు రాగానే క్షణికావేశంలో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి మరణాలకు కారణం ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం కాదా? అసలు ఇంటర్మీడియట్ బోర్డ్‌లో ఏం జరుగుతోంది? ఫలితాలు ఇంతలా తారుమారు కావడం ఇంటర్ బోర్డ్ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు. ఇంటర్ బోర్డ్ తప్పిదాలపై న్యాయ విచారణ జరిపించాలి. బోర్డ్ చేసిన తప్పిదాల దృష్ట్యా విద్యార్థులకు ఉచితంగా జవాబు పత్రాలు అందజేయాలి. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, వారి కుటుంబాలను ఆదుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
పారదర్శకత అవసరం
‘డీఎస్సీ 2018-19’లో భర్తీచేసేందుకు సిద్ధంగా ఉన్న మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోస్టులకు ఎంపిక పారదర్శకంగా, అవినీతి లేకుండా జరగాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. మోడల్ స్కూల్ రెగ్యులర్ ప్రిన్సిపాల్ పోస్టులకు రాత పరీక్షల అర్హతతోపాటు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్‌లో సర్వీసు ఆధారంగా, ప్రభుత్వం నిర్ణయించిన మూల వేతనం (బేసిక్ పే) పొంది ఉండాలని నిబంధనలు తెలుపుతున్నాయి. గత ఏడాది దరఖాస్తులు స్వీకరించినప్పటికీ అంతర్జాలంలో వేతన స్లేళ్లకు, సర్వీసు అర్హతలకు సంబంధించి స్పష్టత లోపించడం వల్ల అర్హత గల సర్వీసు, మూల వేతనం లేనప్పటికీ కొంతమంది దరఖాస్తులను ఆమోదించారు. ఈ విధంగా జరగడంతో నిజమైన అర్హతలు ఉండి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కనుక ఈసారి అయినా మోడల్ స్కూల్స్‌లో రాష్టస్థ్రాయి ప్రిన్సిపాల్ పోస్టులకు సంబంధించి అందరి అభ్యర్థుల పూర్వపు సర్వీసును, వేతనాలను, సర్వీసులో ఉన్నప్పుడు ఐ.టి.్ఫరాలు, ఇతర సర్వీసు డాక్యుమెంట్స్‌ను జిల్లాస్థాయిలో పరిశీలించి నియామకాలకు ఎంపిక చేయాలి. 2013లో జరిగిన మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ పోస్టులకు ఎంపిక జరిగినప్పుడు నకిలీ సర్వీసు, వేతనాలు సమర్పించిన వారిపై విద్యాశాఖ ఇప్పటికీ స్పందించలేదు. ఈసారైనా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పోస్టులలో అర్హులైన వారికి మాత్రమే పోస్టులు ఇవ్వాలి.
- బి.సురేష్, శ్రీకాకుళం