ఉత్తరాయణం

ఇంటర్ బోర్డుకు వంద మార్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరీక్షా ఫలితాల్ని కంగాళీ చేసి, ఇంటర్ విద్యార్థుల జీవితాలతో ఆటాడుకున్న విద్యాశాఖ, సంబంధిత బోర్డు, తెలంగాణ ప్రభుత్వం తమ బాధ్యతల్లో తీవ్ర వైఫల్యం చెందాయి. పదవుల్లో ఉన్నవాళ్లు ఒక బాధ్యతని ఎలా నిర్వహించకూడదో, తేలిగ్గా తీసుకోకూడదో చెప్పడానికి పాఠంలా పనికొస్తుంది వీటి నిర్వాకం. పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే తీవ్ర లోపాలు బయటపడ్డాయి. మొదటి సంవత్సరం 99 మార్కులు తెచ్చుకొన్నవాళ్ళు, రెండో సంవత్సరం సున్నా మార్కులు ఎలా తెచ్చుకుంటారు? ఏ మాత్రం చదవకపోయినా పది మార్కులైనా వస్తాయి కదా! అన్ని సబ్జెక్టుల్లో రాణించిన వాళ్ళు ఒక దానిలో అత్తెసరు మార్కులు తెచ్చుకుంటారా? అధిక సంఖ్యలో పొరపాట్లు జరిగాక బోర్డు ఏం చెయ్యాలి? ఆ ఫలితాల్ని నిలుపుదల చేసి, తప్పు సరిదిద్దడానికి ఉపక్రమించాలి. ఈలోగా పిల్లలకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. ఆ పని మాని రోజుల తరబడి అధికారులు తమ తప్పుని సమర్ధించుకున్నారు. పందొమ్మిది మంది చిన్నారులు ఉసురు తీసుకోడానికి కారణంగా నిలిచారు. తమకు న్యాయం చెయ్యమంటూ విద్యార్థులు రోడ్డెక్కితే వారిపై బలప్రయోగం చెయ్యడమెంత అసహ్యకరమైన స్పందన? న్యాయస్థానం మొట్టికాయలు పెడితే తప్ప ప్రభుత్వానికి బాధ్యత గుర్తుకురాదా? సహజంగా స్పందించాల్సిన విషయాల్లోనూ నిర్లక్ష్యమేనా? ఫెయిల్ అయిన 3లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చెయ్యనవసరం లేకుండా పునర్ముల్యాంకనం చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పాస్ అయినవాళ్లు కూడా తమ మార్కుల పట్ల సందేహంతోనే ఉంటారు. వారిపట్ల కూడా సానుకూలతతో స్పందించాలి. అన్ని స్థాయిల్లో జరిగిన లోపాల్ని బహిర్గతం చెయ్యడమే కాకుండా బాధ్యుల్ని శిక్షించాలి.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం