ఉత్తరాయణం

వోటుకు నోటు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వోటర్లు డబ్బులివ్వాలని డిమాండ్ చేశారని, కొన్ని చోట్ల అభ్యర్థులు రూ. ఏభై కోట్ల వరకూ ఖర్చు చేశారని మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డి ఆందోళన చెందారు. కానీ, తప్పంతా వోటర్లదే కాదు. రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’ పేరిట సంపన్నులకే టిక్కెట్లు ఇస్తున్నందున వారు పోటాపోటీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. వీధి పెద్దలు, కులసంఘాల నేతలు, మధ్యవర్తులు తమ ప్రాంతంలో వోటర్ల సంఖ్య మేరకు అభ్యర్థుల నుంచి డబ్బు తీసుకొంటున్నారు. నిజాయితీపరులైన వోటర్ల తరఫున కూడా డబ్బు తీసుకొని ఈ దళారులు తమ జేబుల్లో వేసుకొంటున్నారు. వోటర్లందరికీ ఒకేలా డబ్బు పంచకపోవడంతో కీచులాటలు మొదలవుతున్నాయి. కొందరు దళారులైతే ఇరు పార్టీల నుంచీ వోటర్ల పేరిట డబ్బు గుంజుకుంటున్నారు. డబ్బు తీసుకున్నా వోటర్లు తమకు నచ్చిన అభ్యర్థికే వోట్లు వేస్తున్నారు. భారీగా డబ్బు పంపిణీ చేసినవారు గెలుస్తారన్న గ్యారంటీ లేదు. డబ్బు పంచకుంటే ఎలాంటి పేచీ లేదు. కోట్లు కుమ్మరించినా ఒక్కోసారి భంగపాటు తప్పదు. జనసేన, భాజపా, వామపక్షాలు డబ్బు పంచిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వోటర్లు ఆ పార్టీల వైపు మొగ్గు చూపరని భావించరాదు. సంక్షేమ పథకాలు, రాయితీలు, నగదు నజరానాల పేరిట నాయకులే వోటర్లను ప్రలోభపెడుతున్నారు. డబ్బు ఖర్చు పెట్టకుండానే గతంలో ఎంతోమంది ప్రముఖులు చట్టసభలకు ఎన్నికయ్యారు. భారీగా డబ్బు ఖర్చు చేస్తూ వోటర్లను నిందించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట