ఉత్తరాయణం

పాలన-ప్రజాస్వామ్య స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులు. ప్రజల తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులతో చట్టసభలేర్పడినాక ప్రజల తరఫున పనిచేస్తారు. ప్రజల మద్దతు పొందిన పక్షాలు ఐదేళ్లపాటు ప్రభుత్వం ఏర్పరిచి పాలన సాగిస్తాయి- ఆ చట్టసభల పర్యవేక్షణలోనే. ఆ పాలన అమలు చెయ్యడానికి అధికార యంత్రాం గం ఉంటుంది. ఈ వౌలిక సూత్రం గుర్తుంచుకుంటే ఎలాంటి తగాదా లేదు. ‘నేను గొప్ప, నువ్వు తప్పు’ అనే నిరర్ధక చర్చలుండవు. అయితే ఈ సంగతి గుర్తున్నా ఎదుటివాళ్ళని చికాకు పెట్టాలన్న ఉద్దేశమో లేదా పాలకులకన్నా మేము మెరుగన్న భావనో ఉంటే నిత్య వివాదం-పాలనకు ఆటంకంగా మిగులుతుంది. పుదుచ్చేరి పాలనా విషయాల్లో ప్రజాప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ రోజువారీ పాలనా వ్యవహారాల్లో వేలుపెట్టడం తప్పంటూ మద్రాసు హైకోర్టు విస్పష్టంగా చెప్పడం మంచి పరిణామం. రాజ్యాంగ విధులపై స్పష్టమైన అవగాహన ఉన్న అక్కడి గవర్నర్ కిరణ్ బేడీకి ఈ విషయం తెలియదని అనుకోం. కేంద్ర ప్రభుత్వ నామినీగా రాష్టప్రతి ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన ఆమెకు, అక్కడ ప్రజలెన్నుకొన్న ముఖ్యమంత్రిపై, అదీ విపక్షానికి చెందిన ప్రభుత్వం తీరుపై అసంతృప్తి. కాబట్టి అవసరం లేకపోయినా రోజువారీ పాలనపై తన ప్రభావం చూపించాలన్న రాజ్యాంగ వ్యితిరేక సంకల్పం. ఇలాంటి విషయాలు కూడా న్యాయపాలిక చెప్పాల్సి రావడమే బాధాకరం. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న వివాదాలు ఇలాంటి చర్చకు దారితీస్తున్నాయి. పోలింగ్ జరిగి, ఫలితాలు వెలువడాల్సిన రోజుల్లో మంత్రు లు పాలనాపరమైన సమీక్షలు జరపడంపై, రాజకీయ ఆలోచనల మేరకు రెండు విభిన్న వాదనలు జరుగుతున్నాయి తప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తికోణంలో చర్చలేమీ లేవు. మంత్రివర్యుడు సమీక్షకు పిలిస్తే అధికారులు రారు. ముఖ్యమంత్రికి సమీక్ష చేసే అధికారం లేదంటారు. తదుపరి శాసనసభ ఏర్పడేవరకూ ఇప్పుడున్న ప్రభుత్వం నడుస్తున్నట్టే కదా. అమాత్య పదవులు రద్దు అయిపోలేదు కదా. ఆ ప్రభుత్వం తరఫున పాలనా వ్యవహారాలు చూసే బాధ్యత, హక్కు వారికుంది కదా. విధానపరమైన నిర్ణయాలు, ఆర్థికంగా పెద్ద నిర్ణయాలు తీసుకోవడం లాంటివి తదుపరి రాబోయే ప్రభుత్వానికి వదిలేయాల్సిందే కానీ అత్యవసరమైన కార్యక్రమాలు, రోజువారీ పాలనకు సంబంధించిన సమీక్షలు చెయ్యడంలో తప్పేమిటి? ఒకవేళ ఎన్నికల నిబంధనావళిలో అలాంటి షరతులుంటే వాటిని మార్చాలి. ఎన్నికల ప్రక్రియ నెలల తరబడి సాగుతున్నప్పుడు ఇలాంటి నిబంధనలు వ్యతిరేక ఫలితాలనిస్తాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడకుండా ప్రజల అవసరాల దృష్ట్యా చూస్తే ఇలాంటి విషయాలు అసలు వివాదాలే కావు. ఇక, పోలింగ్ ముగిసి వారాలైనా వీధుల్లో విగ్రహాలకు ఇంకా ముసుగులు వేసి ఉన్నాయి. ఏ ముసుగు వెనుక విగ్రహమెవరిదో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. ఆ విగ్రహాల్ని అలా ముసుగువెయ్యకుండా వదిలేస్తే మాత్రం అవి ఎవరిని ప్రలోభపెడ్తాయి? ఎవరిని ప్రభావితం చేస్తాయి? ఎన్నికల కోడ్ అన్నది అసలు విషయాల్ని వదిలేసి, కొసరు విషయాలకి పరిమితమైందేమో!

-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం