ఉత్తరాయణం

గోదావరిలో లంకలు తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సముద్ర గర్భంలో కలిసే గోదావరి నది గత రెండు దశాబ్దాలుగా ఉనికిని కోల్పోతోంది. నూట అరవై ఏళ్ల క్రితం సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం వద్ద మూడు అడుగుల నీటి సామర్థ్యంతో డ్యామ్‌ను నిర్మించారు. అయితే, గత కొన్ని దశాబ్దాలుగా నది అంతర్భాగంలో సంరక్షణ లేక మట్టి ఇసుక మేటలను తలపిస్తోంది. ఆనకట్ట నిర్మించకముందు మండు వేసవిలోనూ ధవళేశ్వరం నుండి భద్రాచలం వరకు లాంచీలలో ప్రయాణించేవారు. ప్రస్తుతం పోలవరం దాటితేనే గాని లాంచీలు తిరగని పరిస్థితి ఉంది. ఇసుక మేటలపై ముళ్లపొదలు మహావృక్షాలయినాయి. కొన్ని చోట్ల పసుపు, మిరప, పొగాకు, మొక్కజొన్నలు పండించే భూమిగా నదీ గర్భం రూపాంతరం చెందింది. అక్కడక్కడా నాటుసారా తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయి. నదీగర్భం నానాటికీ తగ్గిపోతున్నా అధికారులు దృష్టిసారించిన జాడలేదు. లంకలు, ఇసుక మేటలను తొలగిస్తే నేటి తరానికి లాంచీ ప్రయాణం, గోదావరి అందాలు ఆస్వాదించే అనుభూతి కలుగుతుంది. తద్వారా పర్యాటక శాఖ వృద్ధి చెంది ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. నదీ పరివాహక ప్రాంతంలో నీటి నిల్వలతో బావులు, కుంటలు కళకళలాడుతూ పశువులు, పంట భూములు మెండుగా ఉండి పల్లెలు సుభిక్షంగా ఉంటాయి. ధవళేశ్వరం వద్ద నదిలో ఇసుక మేటలు తొలగిస్తే, ఆనకట్ట కింద భూములకు నీరు లభించి, కాటన్ మహాశయుని ఆశయం నెరవేరుతుంది.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం