ఉత్తరాయణం

మోదీ విదేశాంగ విధానం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2014లో ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో ప్రధాని మోదీ సార్క్ దేశాధినేతలను ఆహ్వానించారు. తాజాగా బింస్‌టెక్ కూటమి నేతలను ఆహ్వానించడం ఆయన వ్యూహాత్మక వైఖరి, ముందుచూపు, సువిశాల విదేశాంగ విధానాన్ని సూచిస్తోంది. సార్క్ కూటమిలో సభ్యత్వం ఉన్న పాకిస్తాన్‌ను ఏకాకిని చేయడానికి మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పటిష్ట వ్యూహం ఇప్పటికే సత్ఫలితాలనిచ్చింది. చైనా సహా పలు దేశాలు ఉగ్రవాదాన్ని సమర్ధిస్తున్న పాకిస్తాన్ వైఖరిని తప్పపడుతున్నాయి. బింస్‌టెక్ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 22 శాతం, వాటి స్థూల జాతీయోత్పత్తి సంయుక్తంగా 2.7 ట్రిలియన్ డాలర్లు వుంది. ఆర్థికంగా ఈ దేశాలు గడచిన దశాబ్దంలో బాగా పుంజుకున్నాయి. ఈ దేశాలతో స్నేహం భారత్‌కు వాణిజ్య, ఆర్థిక రంగాల్లో ఎంతగానో కలిసివస్తుంది. బంగళాఖాతం తీరంలో ఆగ్నేయాసియా ప్రాంతంలో పట్టుకోసం పాకిస్తాన్, చైనాలు ఎంతగానో ప్రయత్నిస్తున్నవేళ బింస్‌టెక్ కూటమి బలోపేడం అవడం భద్రతాపరంగా ఎంతగానో లాభిస్తుంది. తీర ప్రాంతాల దేశాల మధ్య వాణిజ్యంతోపాటు, వ్యవసాయం, రవాణా, టెలీ కమ్యూనికేషన్, సాంకేతిక, ప్రజారోగ్య రంగాలలో విస్తృత సహకారం ఇచ్చి పుచ్చుకునేందుకు, వాణిజ్యంలో అభివృద్ధి చెందిన దేశాల గుత్త్ధాపత్యాన్ని ఎదుర్కొనేందుకు బింస్‌టెక్ దేశాల మధ్య మైత్రీ బంధం పటిష్టమయ్యేందుకు కూటమి దేశాల మధ్య సఖ్యతకు గత అయిదేళ్ళ కాలంలో భారత ప్రధాని చేసిన కృషి మరువలేనిది. తీర ప్రాంత దేశాలలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, ఉగ్రవాదులు చొచ్చుకువచ్చే ప్రమాదాన్ని నివారించేందుకు కూడా బింస్‌టెక్ కూటమి చేస్తున్న ప్రయత్నం వెనుక మోదీ కృషి ఎంతో వుంది. మొదటి ఇన్నింగ్స్‌లో పొరుగు దేశాలతోపాటు అగ్ర దేశాలతో మెరుగైన సంబంధాల కోసం కృషిచేసిన మోదీ తాజాగా ప్రాంతీయ కూటములతో సంబంధాలకు ప్రాధాన్యతనివ్వడం శుభ పరిణామం.
- సిహెచ్.ప్రతాప్, శ్రీకాకుళం
కొత్త జాతీయ విద్యా విధానం అవసరం
నూతన జాతీయ విద్యావిధానం పట్టాలెక్కాల్సి ఉంది. మోదీ ప్రభుత్వం విడుదల చేసిన కస్తూరి రంగన్ కమిటీ ముసాయిదా స్థూలంగా చూస్తే ఆదర్శనీయంగా కనపడుతున్నా నిధులు, ప్రక్షాళనలు పరంగా ఎంతమేరకు ఆచరణీయమో ఆలోచించాలి. విద్యావ్యవస్థను సంస్కరించాల్సిన విషయంలో భేదాభిప్రాయం అక్కరలేదు. ముసాయిదాలో మూడు భాషల అంశం వివాదం కాకముందే తొలగించాల్సింది. హిందీ భాషను బలవంతంగా రుద్దే కార్యక్రమంలో- దక్షిణాది ప్రాంతం భావించిన పిమ్మట కేంద్రం సదరు సూచనను తొలగించడంవల్ల మొత్తం వ్యవహారం పలుచనయ్యింది. ముసాయిదాలో మిగిలిన అంశాలపై రాష్ట్రాలతో చర్చించాలి. దేశవ్యాప్తంగా విద్యపై ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధులు తక్కువ. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలు ప్రయివేట్ పరం అవుతున్నాయి. ప్రజలపై ఫీజుల భారం పెరుగుతూ పోతోంది. మరోవైపు నాణ్యమైన విద్య అందడం లేదు. 14 ఏళ్ల వరకూ బాలబాలికలకు నిర్బంధ ఉచిత విద్య అన్న రాజ్యాంగ హక్కు పరిహాసమైంది. సహజ అవసరాలకు తగిన పరిజ్ఞానం అందక చదువుకున్న నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ పోతోంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన, సామాజిక బాధ్యత, చదువులో నాణ్యత కొరవడుతున్నాయి. జనాభాలో యువత అధికంగా ఉన్న దేశం అన్నివిధాలా లాభపడాల్సి ఉండగా పలు లోపాలతో నిర్వీర్యవౌతోంది. ప్రభుత్వం తాను విద్యపై చేసే ఖర్చు భావితరాలకు పెట్టుబడి అన్న ధోరణి అలవర్చుకొని బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచాలి. నిపుణుల సూచనల మేరకు ప్రాథమిక స్థాయి మొదలు ఉన్నత స్థాయి దాకా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా పేదలకు అందుబాటులో ఉండేలా కృషిచెయ్యాలి. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకొంటూ నిర్వర్తించాల్సిన గురుతర బాధ్యత కేంద్రానిదే.
-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం
పరిశోధన రంగంలో వెనుకబాటు
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేస్తూ, పలు విప్లవాత్మక మార్పులకు తెర తీస్తోంది. విజ్ఞాన శాస్త్ర ఫలాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు. మన దేశాభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్న శాస్త్ర సాంకేతిక విజ్ఞాన రంగం అనుకున్నంత పరిధిలో ముందుకు సాగకపోవడం ప్రభుత్వాలలో దూరదృష్టి లోపించిందనడానికి ఒక మచ్చు తునక. ఆర్భాటంగా 108వ వైజ్ఞానిక మహాసభలు ఆరంభమయ్యాయే కానీ అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో అనుకున్నంత పురోభివృద్ధి సాధించలేదన్నది పలువురి శాస్తవ్రేత్తల అభిప్రాయం. శాస్త్ర సాంకేతిక రంగాలలో చోటుచేసుకున్న పలు విప్లవాత్మక మార్పులు, నూతన ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపడమే కాకుండా మానవ జీవితాన్ని కొంతమేర సుఖమయం చేసాయని చెప్పవచ్చు. శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిశోధనలతోనే దేశాభివృద్ధి సాధ్యమన్న దూరదృష్టితో 1958వ సంవత్సరంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన విధాన తీర్మానం (సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్) ద్వారా జాతీయ స్థాయి ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలు, సాంకేతిక విద్యా సంస్థలను ఏర్పాటుచేసి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి అప్పటి పాలకులు పునాది చేసారు. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే మన దేశంలో వివిధ పరిశోధనా సంస్థలలో జరుగుతున్న పరిశోధనలలో వెనుకబాటుతనం స్పష్టంగా గోచరించడం పాలకుల అలక్ష్యానికి ఒక మచ్చుతునక. ప్రపంచవ్యాప్తంగా పరిశోధనాభివృద్ధి (ఆర్ అండ్ డి)పై 1.14 లక్షల కోట్ల డాలర్లు ఖర్చుపెడుతుంటే అందులో 53.6 శాతం అమెరికా ఖర్చుపెడుతూ శాస్త్ర సాంకేతికాభివృద్ధిలో దూసుకుపోతూ ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా నిలబడడం ముదావహం. కానీ మన దేశం వాటా అతి తక్కువగా 2.1 శాతమే కావడం, ప్రతి లక్ష జనాభాకు 156 మంది మాత్రమే పరిశోధకులు వుండడం, నిధుల కేటాయింపులు అరకొరగా వుండడం, పరిశోధకులకు ప్రోత్సాహం లేకపోవడం, విద్యార్థులకు అవగాహన కల్పించడంలో సదరు మంత్రిత్వశాఖ వైఫల్యం, ఈ విశిష్ట రంగంలో మన దేశం వెనుకబడిపోయిందని చెప్పకనే చెబుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనా ఫలాలు గ్రామీణ స్థాయికి చేరగలిగితేనే సమగ్ర దేశాభివృద్ధి సాధ్యమని దివంగత శాస్తవ్రేత్త అబ్దుల్ కలాం ఏనాడో సెలవిచ్చారు. కానీ ఆయన ఆశయాలకు గండికొడుతూ, కేవలం పదోన్నతులు పొందేందుకు, తమ పేరు మందు డాక్టర్ అన్న బిరుదు తగిలించుకునేందుకు మాత్రమే అన్నట్లుగా నేటి పరిశోధకులు అక్కడా ఇక్కడా కొంత సమాచారం సేకరించి పరిశోధనా పత్రాలను సమర్పించడం ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర. కొంతమంది ఘరానా పరిశోధకులు విదేశాలలో చేసిన పరిశోధనలను కాస్త అటు ఇటుగా మార్చి, కొత్త పరిశోధనా పత్రాలను సృష్టిస్తున్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలైతే నకిలీ డాక్టరేట్లను సైతం ప్రదానం చేస్తున్నాయి. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దేశవ్యాప్తంగా చేసిన సోదాలలో దాదాపుగా రెండు వేల నకిలీ డాక్టరేట్ డిగ్రీలు బయటపడి ఆయా యూనివర్సిటీలపై చర్యలకూ సిఫార్సులు సూచించాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇచ్చే నోబెల్ మేధావులు ఒక్కరూ గత 25 ఏళ్ళుగా భారతదేశంలో పుట్టకపోవడం మన దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో నాణ్యమైన పరిశోధనలకు ఎలాంటి గుర్తింపు వుందో ఇట్టే అర్థం అవుతోంది.
- సి.కనకదుర్గ, హైదరాబాద్