ఉత్తరాయణం

కొలువుల భర్తీ జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను 6 నెలల్లోగా భర్తీ చేయాలని యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ) ఆదేశాలు జారీచేసింది. వివిధ రాష్ట్రాల్లో ఖాళీలను గుర్తించడానికి 15 రోజులు, భర్తీ నిమిత్తం ఆయా ప్రభుత్వాలతో అనుమతి పొందడానికి నెల రోజులు, నియామక ప్రకటనల జారీకి 15 రోజులు గడువుగా నిర్ణయించి మొత్తం ప్రక్రియను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలంటూ యూజీసీ మార్గదర్శకాలు జారీ చేసింది. తెలంగాణలోని 11 విశ్వవిద్యాలయాలలో మొత్తం 1,061 ఖాళీలున్నట్లు గుర్తించారు. వీటిలో ప్రొఫెసర్ ఉద్యోగాలు, అసోసియేట్ ప్రొఫెసర్లు 270, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 692 ఉన్నాయని లెక్కలు తేల్చారు. అనేక కారణాల వల్ల పుష్కర కాలంగా ఈ ఉద్యోగ నియామకాలు జరగలేదు. విశ్వవిద్యాలయాల్లో తగినంతమంది శాశ్వత ఉద్యోగులు లేకపోవడంతో విద్యావ్యవస్థలో ప్రమాణాలు దిగజారుతున్నాయి. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులను నియమించుకొని కాలం గడుపుతూ వస్తున్నారు.
2017 నవంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం 11 విశ్వవిద్యాలయాలలో కొలువులను భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. అదే సంవత్సరం జూలై 24న అన్ని విశ్వవిద్యాలయలకు వైస్ చాన్సలర్లను నియమించి, ఖాళీల భర్తీకి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ఎన్నో ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినా అవి కార్యరూపం దాల్చలేదు. ఈ ఆలస్యానికి కారకులెవరన్న ప్రశ్నలకు సమాధానం లేదు. ఈ విషయమై విపక్షాలు, నిరుద్యోగ యువత నిలదీస్తే- యూజీసీ నూతన మార్గనిర్దేశకాలు రూపొందిస్తుందని, నియామకాల బాధ్యత వైస్ చాన్సలర్లదే అని పాలకులు ఇనే్నళ్ళుగా కాలయాపన చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్సిటీల్లో ఖాళీల భర్తీకి మార్గదర్శకాలు రూపొందించి, విస్పష్ట ప్రకటన జారీ చేయడంతో- తెలంగాణలో ఈసారి మరెన్ని అవాంతరాలు ఉంటాయోనన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొంది. వచ్చే నెల 24వ తేదీతో వైస్ చాన్సలర్ల పదవీ కాలం ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యామండలి సహకారంతో నియామకాల ప్రక్రియను చేపట్టడానికి ఎంత సమయం తీసుకుంటుందో తెలియడం లేదు. నియామకాల్లో జాప్యానికి యూజీసీ, కేంద్రం, రాష్ట్రం, ఉన్నత విద్యామండలిలో ఎవరిని నిందించాలని యువత ఆందోళన చెందుతోంది.
తగిన అర్హతలు సంపాదించి, నియామకాల కోసం ఎదురుచూస్తూ, పదవీ విరమణ వయసొచ్చినా ఉద్యోగాలకు కొందరు నోచుకోలేని పరిస్థితులు కనబడుతున్నాయి. నాలుగు పదుల వయసొచ్చినా ‘డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ’ (పీహెచ్‌డీ) పూర్తికాదు. పుష్కర కాలంగా నియామకాలు లేనపుడు అర్హతలున్న వారి వయసు ఏభై ఏళ్లకు పైబడుతోంది. తగిన నైపుణ్యం లేకనే నిరుద్యోగులు కొలువులు సాధించలేకపోతున్నారనడం ఎంతవరకు సమంజసం? కమిటీలు, చర్చలు, నూతన మార్గదర్శకాల పేరిట కాలయాపన చేస్తున్నారే తప్ప మొదటి ప్రాధాన్యత దేనికివ్వాలో పాలకులకు తెలియడం లేదు. వైస్ చాన్సలర్ల పదవీ కాలం ముగుస్తోందన్న సాకుతో నియామకాలను వాయిదా వేయకుండా తెలంగాణ ప్రభుత్వం నిజాయితీతో నిర్ణయం తీసుకోవాలి.
-డా. పోలం సైదులు
అశాంతికి అంతం ఎపుడు?
కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని తరిమికొట్టడంలో, అక్కడి పరిస్థితులను చక్కదిద్దడంలో అనాదిగా కేంద్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయి. చైనాతో మెక్‌మోహన్‌రేఖ వల్ల, ద్యూరాండ్ రేఖతో ఆఫ్గాన్, పాకిస్తాన్ వల్ల మన దేశానికి ఇబ్బందులు తప్పడం లేదు. భూతల స్వర్గమైన కశ్మీర్ 72 ఏళ్లుగా ఉగ్రవాదంతో అట్టుడుకిపోతున్నా, పరిస్థితులను చక్కదిద్దడంలో పాలకులు విఫలమయ్యారు. 1972లో సిమ్లా ఒడంబడిక జరిగినా- అది కశ్మీర్‌లో ఉగ్రవాద మూకలు చొరబడడాన్ని, ఉగ్రవాద మారణహోమాన్ని అదుపుచేయడంలో ఘోరంగా విఫలమైంది. కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ పాలన విధించడం రివాజుగా మారడం అక్కడ శాంతి స్థాపనలో ప్రభుత్వాల చేతగానితనాన్ని ప్రతిబింబిస్తోంది. మత వ్ఢ్యౌన్ని ప్రజల రక్తాలలో జీర్ణింపజేసి, ఉగ్రవాద కోరల్లో ఎంతోమంది యువత, ప్రజలు నలిగిపోతుంటే పాలకులు స్వప్రయోజనాలకోసం ఇంకా మత వ్ఢ్యౌన్ని ప్రేరేపించడం దురదృష్టకరం. పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులకు పునరావాసం, కశ్మీర్ పండిట్లను వెనక్కి తీసుకురావడం, 371, 35-ఏ అధికరణలు, కల్లోలిత ప్రాంతాల చట్టం ఎత్తివేత, కశ్మీరుకు ఆర్థిక స్వావలంబన వంటి సమస్యలతో పాటు తీవ్రవాదం పెచ్చుమీరడంతో గవర్నర్ పాలన విధించక తప్పలేదు. కశ్మీరీ యువతను పట్టిపీడిస్తున్న పెద్ద సమస్య నిరుద్యోగం. ఉద్యోగాలు లేక ఉగ్రవాద సంస్థలలో శిక్షణ పొంది మారణహోమాన్ని, అసాంఘిక కార్యక్రమాలను యువత సృష్టిస్తోంది. ప్రజలకు జీవనోపాధి లేక ఆదాయ మార్గాలు సన్నగిల్లిపోయి, తరచూ కర్ఫ్యూలు, బాంబుల మోతతో కశ్మీర్ ఇపుడు కల్లోలానికి చిరునామాగా మారింది. పాలకుల నిష్క్రియాపరత్వానికి ఈ దుస్థితి అద్దం పడుతోంది.
-సి.కనకదుర్గ, హైదరాబాద్
విద్యావ్యవస్థలో ప్రక్షాళన
విద్యావ్యవస్థలో ప్రక్షాళన, పరీక్షల విధానంలో మార్పులు అవసరం అని అటల్ బిహారీ వాజపేయి, అబ్దుల్ కలాం వంటి మేధావులు దశాబ్ద కాలం కిందటే సెలవిచ్చినా ఆ సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్టదాఖలు చేస్తున్నాయి. సుబ్రహ్మణ్యం, కస్తూరి రంగన్, నిషాంక్ వంటి కమిటీలు ఎన్నో విలువైన సూచనలు చేసినా వాటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం. లోపభూయిష్టంగా ఉన్న విద్యా విధానంతో, పరీక్షల నిర్వహణ తీరుతో విద్యార్థుల బాల్యం మసకబారిపోతున్నది. ఈ లోపాల వల్ల విద్యార్థుల్లో ఆత్మగౌరవం స్థానంలో ఆత్మన్యూనతా భావం, ఆత్మవిశ్వాసానికి బదులు ఆత్మహత్యలు, ఆత్మసంయమనం స్థానంలో క్షణికావేశాలు పెరుగుతున్నాయి. విద్యార్థులను నైతికంగా ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన విద్యావ్యవస్థ కేవలం మార్కులు తెచ్చుకునే రోబోలను తయారుచేస్తుండడం మిక్కిలి బాధాకరం. విద్యార్థుల్లో నైతికత, సానుకూల దృక్పథం, నాయకత్వ లక్షణాలు, విభిన్న ఆలోచనా ధోరణులు నశించిపోవడం చూస్తున్నాం. వారిలో మానవతా విలువలు, మానవ సంబంధాల పట్ల ఆదరాభిమానాలు తగ్గుముఖం పట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఈ తరుణంలో విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది.
-సాయిప్రతాప్, హైదరాబాద్