ఉత్తరాయణం

రక్షణ లేని వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌లో రాజధాని నడిబొడ్డున ఉన్న వైద్య కళాశాలలో ఇద్దరు జూనియర్ వైద్యులపై రోగి బంధువులు దాడి జరపడం అమానుషం. ఒక వృద్ధుడైన రోగి మరణానికి వైద్యుల్ని బాధ్యుల్ని చేస్తూ రోగి బంధువులు భౌతిక దాడికి, ఆస్పత్రిలో హింసకు పాల్పడడం ఒక ఎత్తయితే, దెబ్బలు తిన్న వైద్యుల పైనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడడం మరింత ఆందోళనకరం. రక్షణ కల్పించగలమని భరోసా కల్పించాల్సిన ముఖ్యమంత్రి ఆ పనికి బదులు వైద్యులను సస్పెండ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడడం అరాచకం. వైద్యులపై దాడులు పశ్చిమ బెంగాల్‌కే పరిమితం కావు. దేశవ్యాప్తంగా పొడచూపుతున్న విపరీత పోకడలు. అవి రానురాను ఎక్కువ కావడం ఆందోళనకరం. అందుకు ఎన్నో కారణాలు. ముఖ్యంగా వైద్యులు ఎన్నో పరిమితుల మధ్య పనిచేయాల్సిన పరిస్థితులు. వైద్యం, ఆరోగ్యంపై ప్రభుత్వం ఖర్చు చాలా తక్కువ కారణంగా అరకొర సదుపాయాలు, వైద్యుల, రోగుల నిష్పత్తిలో, రోగులు వైద్యశాలలు నిష్పత్తిలో మన దేశం పేద దేశాలకన్నా తీసికట్టుగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పనిచేస్తున్న వైద్యులపై, వైద్య సిబ్బందిపై అపరిమితమైన పనిభారం. మరోవైపు వైద్య ఖర్చులు భారీగా పెరిగి ప్రజల్లో పేరుకుపోతున్న అసంతృప్తి. వైద్యం వ్యాపారంగా మారిన నేపథ్యంలో, కొన్ని ప్రయివేట్ ఆసుపత్రుల, కొందరి వైద్యుల నిర్వాకంతో రోగులకు, వైద్యులకు మధ్య చెడిన నమ్మకం. ఇన్ని అననుకూలతల నడుమ ఆరోగ్య రక్షకులైన వైద్యులు హాయిగా పనిచెయ్యగలరంటే, ఆ వాతావరణం ఉంటుందంటే కష్టమే. అయితే అలాంటి వాతావరణం లేకుంటే మరింత నష్టం సమాజానికే. తప్పుచేసిన వైద్యుణ్ణి తప్పుకు బాధ్యుణ్ని చెయ్యడం ఎంత అవసరమో తన బాధ్యత నిర్వహిస్తున్న వైద్యుణ్ణి దాడుల నుండి కాపాడుకోడం అంతే అవసరం. దాడికి పాల్పడినవారిని వెంటనే శిక్షించేలా చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలి. మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డా.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైద్యులపై దాడుల్ని నిరోధించేలా చట్టం తీసుకువచ్చారు. దాడుల్ని నాన్ బెయిలబుల్ కేసులుగా గుర్తించే ఆ తరహా చట్టాలు ఉన్నట్టు అందరికీ తెలియాలి. ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు, అలెర్ట్ వ్యవస్థలు నెలకొల్పాలి. అలా దాడులు చెయ్యడం వీరోచితం కాదు.. నేరం అన్నది ప్రభుత్వపు సందేశం కావాలి. ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మమత సర్కారు ధోరణి ఆక్షేపణీయం.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
భారత జట్టుకు జేజేలు
ప్రపంచ కప్ పోటీలో ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మన ఆటగాళ్లు కోట్లాది మంది అభిమానుల హృదయాలు ఉప్పొంగేలా చారిత్రాత్మక ఘన విజయం నమోదు చేయడం సంతోషదాయకం. విజయంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ అభినందనీయులు. భారత జట్టు సభ్యులంతా కలిసికట్టుగా ఆడి మ్యాచ్‌లో ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో ప్రతిభ చూపారు. విజయ్ శంకర్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తీరు ప్రశంసనీయం. మన దేశం పేరును నిలబెట్టిన ప్రతి క్రీడాకారుడికి, జట్టును విజయంపథంలో నడిపిన విరాట్ కోహ్లీకి అభిమానులు జేజేలు పలుకుతున్నారు. భారత్‌కు మరోసారి ప్రపంచ కప్‌ను సాధించి కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీ సరసన విరాట్ కోహ్లీ పేరు నిలవాలి.
-బలపాల సుధాకర్, పెబ్బేరు
నిందితులకు సత్వర శిక్షలు
దేశం యావత్తూ సిగ్గుతో తలదించుకునే రీతిలో జరిగిన జమ్మూ కశ్మీర్‌లోని కతువాలో ఎనిమిదేండ్ల పసి బాలికపై సామూహిక అత్యాచారం, హత్యకేసులో నిందితులకు ఏడాదిన్నర కాలంలోనే శిక్షపడడం హర్షణీయం. మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల్లో కతువా ఘటన అత్యంత అమానుషమైనది. ఇది దేశంలోనే అరుదైన దుర్ఘటనగా నిలువటం గమనార్హం. కొన్ని ప్రధాన రాజకీయ పక్షాలు అతి నీచమైన ఈ నేరానికి మతం రంగు పులిమి దోషులకు మద్దతుగా నిలువటం సమాజ విచ్ఛిన్నానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో న్యాయవాదులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా నిందితుల పక్షాన నిలిచి ఊరేగింపులు తీయటం న్యాయవ్యవస్థ పనితీరుపై పలు అనుమానాలను రేకెత్తించింది. ఏదేమైనా సామాజిక ఒత్తిళ్లు, ఇతర పర్యవసానాల నేపథ్యంలో ఏడాదిన్నర కాలంలోనే కోర్టుతీర్పు వెలువరించడం, దోషులకు కఠిన శిక్షలు విధించటం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చేదిగా ఉన్నది. ఇటువంటి అతిహేయమైన పైశాచిక దుర్ఘటనలలో నిందితులకు సత్వరమే కఠిన శిక్షలు పడడం వలన నేరగాళ్లకు చట్టం పట్ల భయం కలగడమేకాకుండా న్యాయవ్యవస్థపై సామాన్యులకు నమ్మకం కలుగుతుంది. నిర్భయ, పోక్సో వంటి కఠినమైన చట్టాలను తెచ్చినా దేశంలో అత్యాచార ఘటనలు యథేచ్ఛగా కొనసాగుతుండడం ఆందోళన కలిగించే అంశం.
- సి.సాయిప్రతాప్, హైదరాబాద్
‘పదవీ విరమణ’ సమస్యపై తేల్చండి
ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏభై ఎనిమిది నుండి అరవై ఏళ్ళకు (జూన్ 2014లో) పెంచింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసేవారికి సదరు ఉత్తర్వు అమలుచేయాలని అభ్యర్థించగా అంచెలంచెలుగా రెండేళ్ళ అనంతరం పెంచింది. ఆమధ్య కాలంలో పదవీ విరమణ చేసిన విద్యుత్, ఎయిడెట్, రవాణా, గిరిజన కార్పొరేషన్ వంటి పలు సంస్థల్లో పనిచేసినవారు అరవై ఏళ్ళు వర్తింపచేయాలని కోరగా ప్రభుత్వం నుండి స్పందన లేనందున న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఇప్పటికీ లక్షలాది రూపాయలు వెచ్చించినా సమస్య పరిష్కారం కానందున ఆందోళన చెందుతున్నారు. పాదయాత్ర సందర్భంగా వైకాపా అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. అన్యాయం జరిగిందని గ్రహించిన నేపథ్యంలో ప్రతి సమస్యను అధికారం చేపట్టిన వెంటనే జగన్ ఒక్కొక్కటి కొలిక్కి తీసుకువస్తున్నారు. పదవీ విరమణ పెంచినా నష్టపోయిన వారు వందల సంఖ్యలో ఉన్నారు. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా వీరికి జూన్ పధ్నాలుగునుండి అరవై ఏళ్ళు వర్తించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వు అమలుచేయాలని మనవి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం