ఉత్తరాయణం

లంచం మహమ్మారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలకోసం ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, ఎం.ఎల్.ఏ.లు (వీరందరు పబ్లిక్ సర్వెంట్స్‌గా పిలువబడుతారు) ఎన్నో చట్టాలు చేసారు. చేస్తున్నారు. ఆ చట్టాలలో ఉన్న సెక్షన్లు, జివోలు ప్రజల పాలిట యమపాశాలుగా, ఉరితాళ్ళు అవుతున్నాయి. ఈ చట్టాల ఉరితాళ్ళు పబ్లిక్ సర్వెంట్సు చేతుల్లో పగ్గాలుగా ఉన్నాయి. వీటితో ప్రజలను బెదిరించి లంచాలు పిండుతున్నారు. తనకు న్యాయం ప్రకారం రావలసిన దానికోసం ఏ ఒక్కరు లంచం ఇవ్వరు. కాని ఉరితాడును చూసి బానిసగా మొక్కి లంచం సమర్పిస్తున్నారు. ఈ చట్టాలన్నీ పబ్లిక్ సర్వెంట్స్ లంచాలు పట్టడానికి చేసినట్టుగానే ఉంది. ఏ చట్టంలోను ప్రజల సంక్షేమం ఉన్నా అది పేరుకే మిగిలిపోయంది. ఈ చట్టాల వెనుకనున్న ఆలోచన ఎంతమేర లంచం పట్టవచ్చన్నదే. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొన్న వీరు ప్రజల పాలిటి శనిగా దాపురించారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్యూనునుండి కలెక్టరు వరకు ప్రజలను బెదిరిస్తారు. ప్రజాప్రతినిధులు కూడ వీరిని అడుక్కోవలసిందే. వీరి దయకోసం ప్రాకులాడ వలసిందే. దీనికి అంతం ఎప్పుడు, ఎక్కడ ఎలా?
- ఎం.ఎస్.రఘు, నూజివీడు
పెరుగుతున్న ప్రమాదాలు
కోల్‌కతా- చెన్నయ్ జాతీయ రహదారి నెం.5 నిత్యం అనేక ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. అన్ని నిబంధనలకు నీళ్లొదిలి భారీ వాహనాలు, అతి భారీ వాహనాలు, బస్సులు, ద్విచక్ర వాహనాలు 60-90 కి.మి స్పీడుతో నడుపుతుండగా స్వంత వాహనదారులు కార్లు, జీపులను 120 కి.మీ. స్పీడుతో పోనిస్తున్నారు. వేగంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్న తాపత్రయంలో ఇష్టారాజ్యంగా వాహనాలను నడుపుతూ అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యులౌతున్నారు. ట్రాఫిక్ నియంత్రణకోసం డివైడర్లు నిర్మిస్తే వాహనదారులు వాటిని గుద్దేస్తున్నారు. వాహనదారులకు అవగాహనా సదస్సుల నిర్వహణ, పలు కూడళ్ళలో స్పీడు రికార్డర్లు, రాత్రిళ్లు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నా ఫలితం స్వల్పం. ఆటోలలో పది మందిని ఎక్కించుకొని ఓవర్‌స్పీడులో వెళ్తున్న క్రమశిక్షణా చర్యలు శూన్యం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
పారమార్థిక చింతన అవసరం
సమకాలీన సమాజంలో స్వార్థం విపరీతంగా పెరిగిపోయింది. అస్తమానం చదువు, గ్రేడ్లు, డిగ్రీ పట్టాలు, విదేశీ ఉద్యోగం, యూరోలు, డాలర్లు, ఆస్తులు కొనడం, ఉన్నవాటిని అభివృద్ధిపరచడం కనబడుతుంది. కాని నలుగురికి సహాయం చెయ్యడం, దైవ చింతన, పాపభీతి అసలు లేవు. ఇలాంటి పోకడలవల్ల పంచభూతాలు కనె్నర్రచేసే ప్రమాదం వుంది. కనుక ప్రతీ విద్యార్థి, ప్రతి ఉద్యోగి నలుగురికి సహాయ సహకారాలు అందించాలి. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు నలుగురికి ఉచితంగా విద్యను నేర్పాలి.
- వి.వివేక్, విశాఖపట్నం
చట్టం
నిలువదు నిర్భయ చట్టము
కలవారే తప్పు జేయ! కలుషితమతితో
విలవిలలాడుచు వెళ్లుచు
అలిగెడి ఇంటల్లుడట్లు! అందరి నెదుటే!
వ్యసనములెన్నోవిధములు
పసలేదని తెలిసి మనిషి పలు విధములుగా
మసలెడి మానవ తత్వము
రసహీనత రంగరించ? రక్షణకరువే!
శిక్షకు రక్షణలేదిల
నిక్షిప్తపు నిధులులాగ నిందలయందున్
దక్షత లేకను బ్రతుకే
లక్షణములు వీడుటాయె! లాభముకొరకై!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి
ప్రభుత్వ అధికారులు ఏవైనా విధి విధానాలు ప్రకటించేముందు సాధ్యాసాధ్యాలు, చట్టబద్ధత గురించి ఆలోచించరా? ఆధార్ చట్టబద్ధంకాదని సుప్రీంకోర్టు తీర్పుచెప్పిం ది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్ తప్పనిసరి కాదని అది ఉన్నవారు ఉపయోగించవచ్చు. లేని వారిని బలవంతం చేయరాదని వారికి ప్రత్యామ్నాయాలు సూచించాలని వివరణ ఇచ్చింది.