ఉత్తరాయణం

మోడల్ స్కూల్స్‌కు ఇక మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న డిఎస్సీ-2018 పోస్టులకు అభ్యర్థుల ఎంపికకు ఏపీ ప్రభుత్వం షెడ్యూల్‌ను విడుదల చేసి, ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేస్తుండడం ఆహ్వానించదగ్గ విషయం. అయితే, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ పోస్టులకు సంబంధించి విద్యార్హతల ధ్రువపతాల పరిశీలనతోపాటు పూర్వపు సర్వీసు అర్హతలు కూడా నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు ప్రకారమే ప్రిన్సిపాల్స్ పోస్టులు భర్తీచేయాలి. మోడల్ స్కూల్స్‌లో 909 పోస్టులు భర్తీకానున్నాయి. ఇందులో 77 రాష్టస్థ్రాయి కేడర్ ప్రిన్సిపాల్స్ పోస్టులు, 463 టిజిటి, 369 పిజిటి పోస్టులు జోనల్ పరిధిలో భర్తీకానుండడం మోడల్ స్కూల్స్ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో ఆరు నుండి ఇంటర్ వరకు విద్యార్థులకు ఉచితంగా మోడల్ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుంది. ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో మోడల్ స్కూల్స్‌లో నూతనంగా భర్తీఅవుతున్న సిబ్బంది జీతభత్యాలు, ఇతర అలవెన్సులకు పూర్తిస్థాయిలో గ్రాంట్లు ఇవ్వాలి. సర్వీసు పరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పోస్టులను భర్తీచేయాలి. చిరకాలంగా ఒకేచోట పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్‌ను, సిబ్బందిని బదిలీచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర కార్యాలయంలో మోడల్ స్కూల్స్‌కు సంబంధించి అర్హులైనవారినే మానిటరింగ్ అధికారులుగా నియమించి పారదర్శకంగా మోడల్ స్కూల్స్ నిర్వహణ జరిగితే ఈ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయి.
- బి.సురేష్, శ్రీకాకుళం