ఉత్తరాయణం

సంక్షోభంలో దేశీయ విమానయాన రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విమానయాన రంగం అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నవేళ విమానయాన సంస్థలు ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తేవాలని పోటీపడడం హర్షణీయం. కానీ, ఈ పరుగులో ఒక్కప్పుడు మార్కెట్‌లో 22.5 శాతం వాటాతో 195 రోజువారీ సర్వీసులు, 37 గమ్యస్థానాలతో ఒక వెలుగు వెలిగిన జెట్ ఎయిర్‌వేస్ సంస్థ ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుల్లో చిక్కుకొని కష్టాలను ఎదుర్కొంటోంది. మరోవైపు స్పైస్‌జెట్ దేశీయ విమానయానంలో 13.6 శాతం వాటా కలిగి, రెండవ పెద్ద విమానయాన సంస్థగా దూసుకుపోతోంది. 1993లో ప్రారంభమైన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్థానం నాలుగు బోయింగ్ విమానాలను లీజుకు తీసుకొని అంచెలంచెలుగా ఎదిగి, గత 27 సంవత్సరాల్లో ఒక్క ప్రమాదం కూడా లేకుండా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేయడంలో సఫలీకృతమయ్యింది. 2017 దాకా రెండవ స్థానంలోవున్న జెట్ ఎయిర్‌వేస్ ఇపుడు ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుర్భర పరిస్థితిలో చతికిలపడిపోవడం సంస్థలో విధానపరమైన లోపాలను ఎత్తిచూపిస్తోంది. ఇతర విమానయాన సంస్థలతో దీటుగా నిలబడడానికి ప్రయాణ చార్జీలను బాగా తగ్గించేయడం, నష్టాలను అంచనావెయ్యడంలో ముందుచూపు లేకపోవడం, నిధులను వేరే సంస్థలకు బదలాయించడం వంటి తప్పిదాలతో జెట్ ఎయిర్‌వేస్ దివాలా స్థాయికి దిగజారిపోవడం స్వయంకృతాపరాధం.. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఆపన్నహస్తం అందించేందుకు ముందుకువస్తాయని అనుకున్నా చివరిక్షణంలో ఆ ఆశకూడా నీరుకారిపోవడంతో ఈ సంస్థ కోలుకోలేని స్థితికి చేరింది. స్పైస్‌జెట్ సంస్థ కూడా తొలుత ఇటువంటి ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి అప్పుల ఊబిలో కూరుకున్నాక, యాజమాన్యం తెలివిగా కోలుకుంది. ఇండిగో సంస్థ కూడా నష్టాల తాకిడి ప్రారంభం అయ్యాక, యాజమాన్యం సమయస్ఫూర్తితో వెంటనే కోలుకుంది. ఎయిర్ ఇండియా ఇంకా నష్టాల్లో కొట్టుమిట్టాడుతునే వుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎయిర్ ఇండియాను అమ్మేయడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. మొత్తానికి దేశీయంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. ధరలకు విపరీతంగా రెక్కలొచ్చి ప్రయాణికులకు ఊపిరి సలపడం లేదు. ప్రభుత్వం తక్షణం స్పందించి విధానపర నిర్ణయాలు, సంస్థాగత మార్పులతో దేశీయ విమాన రంగాన్ని గట్టెక్కించాల్సి ఉంది.
-సి.కనకదుర్గ, హైదరాబాద్
చిత్తశుద్ధితో త్రిభాషా విధానం
దేశవ్యాప్తంగా త్రిభాషా సూత్రాన్ని అమలు పరచాలని కస్తూరి రంగన్ కమిటీ సూచించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సమంజసంగా వుంది. రెండు నుండి ఎనిమిదేళ్ళ వయసులో పిల్లలు సహజసిద్ధంగా బహుభాషలను నేర్చుకునే ప్రజ్ఞ కలిగి వుంటారు కనుక త్రిభాషాసూత్రం మంచి ఫలితాలను ఇస్తుందన్న సదరు నివేదిక సహేతుకంగా వుంది. అయితే ఈ నివేదికలోని అంశాలపై విపక్షాలు, దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్దఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థం కాని విషయం. దేశంలో ఆంగ్లం కార్యభాషగా, హిందీ వాడుక భాషగా చెలామణి అవుతోంది. మంచి ఉద్యోగాల కోసం ఈ రెండు భాషలపై పట్టు సాధించడం ఎంతో అవసరం. వీటికి అదనంగా కమిటీ నివేదిక మాతృభాషను నేర్చుకోమని చెప్పడం సహేతుకంగా వుంది. 1968లోనే ఇటువంటి విధానాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా అది ఎక్కడా సంతృప్తికరంగా అమలు కాలేదన్న అనుభవాన్ని దృష్టిలో వుంచుకొని వర్తమానంలో మరింత కట్టుదిట్టంగా ప్రణాళికలు అమలుచేయడం ఎంతో అవసరం. కేంద్రీయ విద్యాసంస్థలలో తప్పిస్తే మాతృభాష, ఆంగ్లానికితోడు మరొక భాషను నేర్పించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఇతర విద్యాసంస్థల్లో లేరు. పాఠ్యపుస్తకాలు కూడా సమగ్రంగా, శాస్ర్తియ విధానంలో రూపొందించినవి లేవు. పైగా మాతృభాషను నేర్చుకోవడమే శుద్ధదండుగ అని నూరిపోస్తున్న కార్పొరేట్ సంస్కృతిలో మూడు భాషలను తమ పిల్లలు నేర్చుకునేందుకు ముందుగా తల్లిదండ్రులను మానసికంగా సిద్ధం చేయవలసి వుంటుంది. కమిటీ నివేదికను నూతన జాతీయ విద్యావిధానం అమలు నేపథ్యంలో పార్లమెంటులో సమగ్రంగా చర్చించి, అనంతరం అమలు చేయడం సబబుగా వుంటుంది. త్రిభాషాసూత్రం అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమ స్ఫూర్తితో కష్టపడితేగానీ ఫలితం వుండదు.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం