ఉత్తరాయణం

రెంటికీ చెడ్డ రేవడిలా పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పెద్దలు సెలవిచ్చిన ‘చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు’- అనే నీతివాక్యం మన పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు అతికినట్లు సరిపోతుంది. ఎందుకంటే ఇన్ని రోజులూ చెడుదారిలో పయనించి తాలిబన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించి, వారి అండతో భారత్‌లో అంతర్భాగమైన జమ్మూ కశ్మీర్‌పై పెత్తనం చెలాయించి ఆ సుందరమైన రాష్ట్రాన్ని తమ స్వాధీనం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించి పాకిస్తాన్ చేతులు కాల్చుకున్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినప్పటికీ భారతదేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో ఉగ్రవాదుల అండతో పాక్ పాలకులు కయ్యానికి కాలుదువ్వుతూనే వున్నారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడం పాక్‌కు మింగుడు పడడం లేదు. చాలా ఏళ్ళుగా జమ్మూ కశ్మీర్‌ని స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ చేస్తున్న దుష్టపన్నాగాలకు ‘370 రద్దు’తో చెక్ పడినట్లే. పాక్ వాదనకు ఏ దేశం కూడా మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకిగా మారింది. 72 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాన్ని మన ప్రధాని మోదీ తీసుకొని, జమ్మూ కశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించడంతో పాకిస్తాన్ దేశానికి దిమ్మ తిరిగినంత పని అయింది. ఇన్ని రోజులు ఆర్టికల్ 370, 35(ఏ)లను అడ్డం పెట్టుకొని ఆటలు సాగించిన పాక్‌కు మోదీ చాణక్య నీతితో గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనే మాట సత్యదూరం కాదు. ఇప్పుడు పాక్ పరిస్థితి ముందు నుయ్యి- వెనుక గొయ్యిలా తయారైంది. పాకిస్తాన్ ఇటు భారతదేశంతో విభేదించలేదు, అటు తాను పెంచిపోషించిన టెర్రరిస్ట్ సంస్థలతో విభేదించలేదు. అలా పాక్ తాను తీసిన బురద గుంటలో తానే పడింది. ఒక విధంగా ఇప్పుడు పాక్ పరిస్థితి రెండింటికి చెడిన రేవడిలా తయారైందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోదీ తీసుకున్న స్ఫూర్తిదాయకమైన నిర్ణయంతో ఇంత కాలానికి పాకిస్తాన్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించే సువర్ణ అవకాశం మన ముంగిట నిలిచింది. ఇన్ని రోజులూ చైనా, అమెరికా వంటి దేశాల అండతో కొంతవరకు పాక్ తన ఆధిపత్యాన్ని భారత్‌పై చెలాయించినప్పటికీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పాక్‌కు సహాయం చేసే విషయంలో మిగతా దేశాలు ముఖం చాటేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే అలనాడు శ్రీకృష్ణ భగవానుడు మహాభారత యుద్ధంలో ధర్మరాజుతో సెలివిచ్చినట్లు ఎల్లప్పుడూ అధర్మంపై, అన్యాయంపై ధర్మం, న్యాయమే విజయం సాధిస్తాయని మరోసారి పాకిస్తాన్ విషయంతో నిరూపితం అయింది. ఈ విజయోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడు భారత్‌మాతాకి జై అని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా అరవాల్సిన ఆనందకర క్షణాలు ఇవి అనడంలో సందేహం లేదు.
- బుగ్గన మధుసూదనరెడ్డి, బేతంచెర్ల (కర్నూలు జిల్లా)
భూముల సర్వే ఎన్నాళ్లు?
పనె్నండో పంచవర్ష ప్రణాళిక కాలానికే మన దేశంలో భూముల పునఃసర్వే, రికార్డుల ప్రక్షాళన, కంప్యూటరీకరణ కార్యక్రమం పూర్తయి ఉండాల్సింది. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ నిర్దేశిత లక్ష్యాలకు ఈ కార్యక్రమం ఆమడ దూరంలో నిలిచిపోయింది. దేశంలో 75 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కంప్యూటరీకరణ పూర్తయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు సంబంధించి 58 శాతం మాత్రమే డిజిటలీకరణ పూర్తయింది. మరొకపక్క దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలుంటే భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.1,900 కోట్లు మాత్రమే విడుదల చేసింది, దేశంలోని 25 శాతం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఇప్పటికీ కనీసం అంతర్జాల సౌకర్యం లేదు. ఇప్పటివరకూ కేవలం 12 శాతం గ్రామాల్లో మాత్రమే భూముల సర్వే, రీ సర్వే జరిగింది. 2020 నాటికి ఈ మొత్తం కార్యక్రమం పూర్తవుతుందన్న లక్ష్యం అనుమానస్పదంగా వుంది. నకిలీ ధ్రువపత్రాలతో ఒకే భూమిని పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసే మోసాలను అరికట్టేందుకు సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన తీర్పు అనుసరించి ఒక్క రాష్ట్రం కూడా రిజిస్ట్రేషన్ సమాచారాన్ని న్యాయస్థానాలతో అనుసంధానించక పోవడం బాధాకరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి ఈ కార్యక్రమాన్ని సత్వరం పూర్తిచేయాలి.
- సిహెచ్.సాయిప్రతాప్, హైదరాబాద్