ఉత్తరాయణం

అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్దలు, రాబందులు
ఒకే గూటికి చేరుకున్నాయి
ఒకే నినాదం ఎంచుకున్నాయి

జెండాలు, ఎజెండాలు విడిచి
ఒకే వేదిక పంచుకున్నాయి
ఒకే రాగం గొంతుకెత్తుకున్నాయి
ఒకే వ్యూహరచన చేస్తున్నాయి

మునుపటిలా కళేబరాలను గాక
బతికున్న జీవుల కుళ్లబొడిచి
రక్తమాంసాలు పీక్కు తిన
సామూహికంగా సంసిద్ధమయ్యాయి

తమ పన్నాగం ఫలించ
చెంత చేరి వింతచేష్టలు చేస్తాయి
కొంగల్లా కొత్త జపం ఆచరిస్తాయి
పావురాల్లా శాంతి మంత్రం వల్లిస్తాయి
చిలుక పలుకులు ఇంపుగా పలుకుతాయి
కట్టుకథలు చిత్ర విచిత్రంగా అల్లుతాయి

అవి ఆషామాషీ కాదు
రంకు నేర్చిన రాజకీయ పక్షులు
కండువాలు మార్చిన పదవీ కాంక్షులు

స్వార్థం వీటి పరమార్థం
నయ వంచన వీటి నైజం

అవసరాల కోసం
ఎంతకైనా తెగబడతాయి
కంట విషం చిమ్ముతాయి
రెక్కల కత్తులు దూస్తాయి
బతుకులు ఛిద్రం చేస్తాయి
మొత్తంగా
జాతి సంపద భక్షిస్తాయి

అందుకే
అమాయక జీవుల్లారా!
కాస్త అప్రమత్తం సుమీ...
(పార్టీలు మారే నేతల తీరుకు నిరసనగా)

-కోడిగూటి తిరుపతి 95739 29493

పాక్ విష ప్రచారం
370, 35ఏ ఆర్టికల్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దుచేయగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రజలకు అండగా ఉంటామని చెప్పడం ఆ దేశ దుష్ట, దుర్మార్గ దురహంకారానికి ప్రబల నిదర్శనం. మన దేశ సార్వభౌమత్వాల్ని ప్రశ్నించే హక్కు ఉగ్రవాదాన్ని పెంచిపోషించే పాకిస్తాన్‌కి ఏ మాత్రం లేదు. హద్దులు మీరితే ఆ దేశానికి గుణపాఠం తప్పదు! మన దేశ ప్రజలంతా ఒక్కమాట మీద నిలబడి, ఈ ‘రద్దు’ను ముక్తకంఠంతో పార్లమెంట్ సాక్షిగా ‘శభాష్’అని అభినందిస్తుంటే కొన్ని పార్టీలు ఇది ఏకపక్షమైన అప్రజాస్వామిక చర్య అంటూ అర్థం లేకుండా మాట్లాడడం చూస్తుంటే వారి దేశభక్తిని శంకించక తప్పదు. పాక్‌ను బూచిగా చూపించి మోదీ ఇదంతా చేస్తున్నారనడం కొన్ని పార్టీల అజ్ఞానానికి పరాకాష్ఠ! దాయాది దేశం చేస్తున్న దారుణాలు, బుకాయింపులు కొందరు నేతలకింకా అర్థం కాకపోవడం వెర్రితనం! ఉగ్రవాదులు, వేర్పాటువాదులు పాకిస్తాన్ అండ చూసుకుని రెచ్చిపోతుంటే, మన సైనికుల తలలు నరికి ఎత్తుకుపోతుంటే, ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తుంటే- కొన్ని పార్టీల నేతలకు ఇవేమీ కనబడకపోవడం కడు శోచనీయం. కశ్మీర్ కోసం వెయ్యేళ్ళైనా ఇండియాతో పోరాటం చేస్తామని పాక్ హూంకరిస్తుంటే, కొన్ని కుహనా లౌకిక పార్టీలకు వినిపించడం లేదా? ఇప్పటికైనా ఈ దేశంలో అన్ని పార్టీలు ఒక్కమాట మీద పోరాడకపోతే, ఆనాడు బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించినట్లు, పాకిస్తాన్ కశ్మీర్ కోసం వెయ్యేళ్ళు మాత్రమే కాదు లక్ష ఏళ్ళవరకు పోరాటం చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త! మన నేతలందరూ పఠించవలసిన తారక మంత్రం ఐకమత్యమే మహాబలం అనే సూక్తి. అన్నివిధాల అప్రమత్తంగా వుండి, దుష్టశక్తుల భరతం పట్టాలి.

- ఎస్.్భదేవి, నిజామాబాద్
ఆ నాణాలు ముద్రించవద్దు
ఇటీవల కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ- ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై రూపాయల నాణాలను ముద్రించి వాడుకలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఒకటి, రెండు, అయిదు రూపాయల చెల్లుబడి అవుతుండగా, ఎవరో కొందరు ఆకతాయలు పది రూపాయల నాణాలు చెల్లవని స్మార్ట్ఫోన్లలో ప్రచారం చేయడం వలన వీటిని ఎవరూ తీసుకోవడం లేదు. వందలకొలదీ పది రూపాయల నాణాలు వ్యాపారస్తులవద్ద మారకం లేక నిలువ ఉండిపోయాయి. బ్యాంకుల వారు కూడా ఈ నాణాలను తీసుకోకపోవడం గమనార్హం. రిజర్వు బ్యాంకు వారు పది రూపాయల నాణాలు చెల్లుబాటు అవుతాయని మీడియా ద్వారా ప్రకటించినా పరిస్థితిలో మార్పురాలేదు. అందువల్ల ఇరవై రూపాయల నాణాలు ముద్రించడం వల్ల ప్రయోజనం కనిపించక పోవచ్చు. పది రూపాయల నాణాలను అన్ని బ్యాంకు శాఖలలో తిరస్కరించకూడదని రిజర్వు బ్యాంకు వారు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలి.
- ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్