ఉత్తరాయణం

అమరావతిలోనే రాజధాని నిర్మించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి ప్రాంతం వరదలు వచ్చినపుడు మునిగిపోతుంది, నిర్మాణ వ్యయం ఇతర చోట్లకంటే రెట్టింపు అవుతుంది, శివరామకృష్ణయ్య కమిటీ రాజధానికి అనువుకాదని నివేదిక ఇచ్చింది కావున మరో ప్రాంతానికి మార్పుచేయాలని రాష్ట్ర మంత్రి బహిరంగంగా ప్రకటించడం, అందుకు కొందరు మంత్రులు మద్దతు పలకడం, ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం, అసలు రాజధాని అమరావతిలో ఉంటుందా? మరోచోటికి తరలిస్తారా అనే ఆందోళన రాష్ట్ర ప్రజలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు వారంతా ఆందోళన చెందుతున్నారు. రైతులు తమ విలువైన పంట భూములను త్యాగం చేయగా గత ప్రభుత్వం ప్రపంచంలో అత్యంత గొప్ప రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. కొత్త ప్రభుత్వం మరింత ఆకర్షణీయంగా అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
నాణాలు ముద్రించవద్దు
2019 కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంలో ఆర్థికమంత్రిణి ఒకటి, రెండు, అయిదు, పది, ఇరవై నాణేలను ముద్రించి వాడుకలోకి తెస్తామన్నారు. ఈ నాణేల ప్రస్తావన ఎక్కువగా వార్తల్లోకి ఎక్కలేదు. ప్రస్తుతం ఒకటి, రెండు, అయిదు నాణేలు చెల్లుబడి అవుతుండగా, ఎవరో కొందరు కొంటెమనుషులు పది రూపాయల నాణేలు చెల్లవని స్మార్ట్ఫోన్లలో ప్రచారంచేయడం వలన వీటిని ఎవరూ తీసుకోవడం లేదు. వందలకొలది రుూ నాణేలు వ్యాపారస్తులవద్ద మారకం లేక నిలువ ఉండిపోయాయి. బ్యాంకుల వారు కూడా రుూ నాణేలను తీసుకోకపోవడం విచారకరం. రిజర్వు బ్యాంకువారు పేపర్లలో పది నాణేలు చెల్లుబాటు అవుతాయని ప్రకటించినా పరిస్థితిలో మార్పురాలేదు. అందువల్ల ఇరవై రూపాయల నాణేలు ముద్రించడంవల్ల ప్రయోజనం కనిపించక పోవచ్చు. పది నాణేలను అన్ని బ్యాంకు బ్రాంచిలవారు తిరస్కరించకూడదని రిజర్వు బ్యాంకువారు తాఖీదునివ్వాలి.
- ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్