ఉత్తరాయణం

గోదారీ.. నీకిది తగదు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపికొండల నడుమ
పారేటి నిండు గోదారమ్మా!

నీ చుట్టూ అల్లుకున్న
ప్రకృతి అందాలు తిలకించి
మురిసిపోవాలని
వాళ్లెంత ముచ్చట పడ్డారో...

నీ అలల హొయలపై తేలిపోతూ
తన్మయత్వం పొందాలని
ఎంత తపన చెందారో...

ఆశలు తీర్చుకొన నీ చెంత వాలితే...
‘మృత్యుసుడు’లు ముంచేస్తుంటే
పట్టనట్లు పరవళ్లు తొక్కుతావా?
ఎరగనట్లు నీ దారిన నువ్వెళ్లుతావా?

నువ్వు తల్లి ‘గోదావరి’వా?
గుండె తడారిన ‘ఎడారి’వా?
ఏదైతేనేమి?
జరగకూడని ఘోరం జరిగింది
కన్నీటి శోకమే ఇక మిగిలింది

ఉగ్రగోదారీ..!
కాలం చెల్లిన కొయ్య పేటికను
పూలతేరులా పేర్చి.. ఏమార్చి..
పర్యటకుల జల (మృత్యు)యాత్రకు
సాగనంపుతున్న
ఆ ‘ఆర్థిక’ పిశాచాల మీద
నీ ప్రకోపాన్ని ప్రదర్శించు

అందుకు అనుమతిస్తున్న
ఆ అవినీతి తిమింగలాల మీద
నీ ప్రళయాగ్నులు కురిపించు

అంతేకాని
పాలబుగ్గల పసిపాపల మీద
ప్రకృతి సౌందర్య పిపాసుల మీద తగదమ్మా!
-కోడిగూటి తిరుపతి 95739 29493
సంస్కరణలకు రాజస్థాన్ స్పూర్తి
సంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకునేలా అధికారులు, పౌర హక్కుల సంఘం వారు ప్రభుత్వానికి సిఫార్సులు చేయడం ప్రశంసనీయం. రాజస్థాన్ మానవ హక్కుల కమిషన్ ఇటీవల ‘సహజీవనానికి వ్యతిరేకం’గా చట్టం తేవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సహజీవనం సాగించే మహిళలకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసులు, పౌర సమాజం తమ సూచనలు పాటించాలని ఆ కమిషన్ పేర్కొంది. ప్రాథమిక హక్కులను హరించివేస్తున్న సహజీవనాలను నిరోధించేందుకు చట్టం చేయాలని సంబంధిత అధికారులను కోరడం హర్షణీయం. ఈ విషయంలోనే గాక, వాహనాలపై దేవుళ్ళ బొమ్మలు, ప్రేమకు సంబంధించిన కొటేషన్స్, ‘ గిఫ్ట్ బై మదర్, ఫాదర్’ అని రాయకూడదని, కులాన్ని తెలిపే విధంగా ఎలాంటి ప్రచారం ఉండకూడదని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా రాజస్థాన్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా సంస్కరణలు చేపట్టాలి. ఇటీవల వాహనాలపై కులాన్ని తెలిపే విధంగా, మతాన్ని తెలిపే విధంగా గుర్తులు ఉంచుతున్నారు. ఇలాంటి ధోరణులను నిరోధించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం
వృద్ధులకు పెనాల్టీలు వద్దు
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా, మూడు నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామనే కఠిన నిర్ణయం సరైనది కాదు. ఇవి గాక భారీ మొత్తాల్లో రకరకాల పెనాల్టీలు వసూలు చేస్తారట. ఎన్నో ఏళ్ల నుండి హెల్మెట్ వాడడం వల్ల, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు మెడనొప్పితో బాధపడుతున్నారు. వీరు తమ ద్విచక్ర వాహనాలను అతితక్కువ దూరానికి అదీ అత్యవసర సమయంలోనే వాడుతున్నారు. సీనియర్ సిటిజన్లంటూ డాక్టర్ సర్ట్ఫికెట్ కలిగిన వారికి హెల్మెట్ నిబంధనను తొలగించాలి. సిక్కు మతస్తులు తలపై పగిడి (తలపాగ ) ధరించడంవలన వారు హెల్మెట్ వాడనవసరం లేదు. ఇలాగే వత్తుగా తలపాగా ధరించితే ఇతరులకు కూడా హెల్మెట్ నిబంధనను తొలగించాలి.
-ఎన్.ఎస్.ఆర్.మూర్తి, సికిందరాబాద్