ఉత్తరాయణం

సుప్రీం తీర్పు.. శుభపరిణామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై దేశ ప్రజలంతా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక తీర్పును సర్వోన్నత న్యాయస్థానం ఏకగ్రీవంగా వెలువరించడం శుభపరిణామంగా భావించాలి. సుప్రీం తీర్పును అన్ని వర్గాల వారూ గౌరవించాలి. మతం పేరిట విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరూ శాంతియుతంగా సంయమనంతో ఉండాల్సిన తరుణం ఇది. అన్ని వర్గాల వారూ సామరస్యంగా ఉంటూ మనది గొప్ప ప్రజాస్వామ్య దేశం అని మరోసారి నిరూపించాలి. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేయగలదని ప్రజలు విశ్వసించాలి. అయోధ్య కేసుకు సంబంధించి గత విషయాలను పక్కనపెట్టి, జాతియావత్తూ తాము ఒకటేనన్న భావంతో ముందుకు సాగాలి. నవ భారత నిర్మాణంలో కులమతాలకు అతీతంగా దేశ ప్రజలంతా భాగస్వామ్యం కావాలి. సర్వ మానవ సౌభ్రాతృత్వ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మన సంస్కృతిని, ఘనమైన వారసత్వాన్ని కాపాడుకోవాలి. సుప్రీం ఇచ్చిన తీర్పును సకాలంలో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ తీర్పు ఏ ఒక్క వర్గానికో అనుకూలంగా ఉందన్న వాదనలను ఖండించాలి. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. విధ్వంసం సృష్టించాలని ఏ మతం వారూ కోరుకోరు. రాజకీయ మనుగడ కోసం కొద్ది మంది నాయకులు ప్రజలను ఉసికొల్పేందుకు ప్రయత్నిస్తారు. గనుక ఇలాంటి మతోన్మాద పార్టీలు, సంస్థలు చేసే విష ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరాదు.
-కొయ్యాన వౌనిక, శివాజీపాలెం (విశాఖ)