ఉత్తరాయణం

నదుల ప్రక్షాళన కలేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూసీ నది కాలుష్యంపై నమోదైన ప్రజాప్రయోజనం వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టు వెంటనే స్పందించి, తక్షణం నదీ కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం ముదావహం. 40 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన జలాలతో తెలంగాణలో పది లక్షల జనాభాకు ప్రాణాధారంగా నిలిచిన మూసీ నది నేడు మురుగునీటి కంటే అధ్వానంగా మారడం అత్యంత దురదృష్టకరం. మూసీ మాత్రమే కాకుండా దేశంలో ప్రధాన నదులన్నింటిదీ ఇదే వ్యథ. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన జలవనరులైన కృష్ణా, గోదావరి నదులలో కాలుష్యం స్థాయి పెరుగుతూ, ఆక్సిజన్ స్థాయి క్షీణిస్తూ కోట్లాది జలచరాలకు ముప్పుగా పరిణమిస్తోందన్న ‘సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్’ వారి తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. భారీఎత్తున జనవాసాల నుంచి, పరిశ్రమల నుంచి మురుగునీరు, వ్యర్ధాలు వచ్చి నదీ జలాలను కలుషితం చేస్తుంటే నిలువరించే చైతన్యం సమాజంలో లోపించింది. నదుల ప్రక్షాళనకు ప్రభుత్వం ఏటా వందల కోట్లు ఖర్చుచేస్తుంటే మరొక పక్క మురుగు నీరు, వ్యర్థాలు యధేచ్ఛగా చేరుతుండడంతో కాలుష్య నివారణ పథకాలు సత్ఫలితాలనివ్వడం లేదు. దేశంలో 14 పెద్ద, 55 చిన్న నదులలో 70శాతం జలాలు కనీస అవసరాలకు పనికిరాని స్థాయిలో కలుషితం అయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
గురజాడ ‘జాడ’లో..

‘దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా’ అంటూ
యువతలో దేశభక్తి రగిలించిన
నవయుగ కవితా వైతాళికుడు

వందేళ్ల క్రితమే..
సామాజిక రుగ్మతల రక్కసిపై
యుద్ధం ప్రకటించిన కలం యోధుడు

అతనో సంస్కరణల శిఖరం
బాల్య వివాహాలపై
నిరసన గళం వినిపించినవాడు

వరకట్న దురాచారాలపై
నిప్పుల వర్షం కురిపించినవాడు

ఆంక్షల చెరలో మగ్గే స్ర్తిజాతి
విముక్తికై ‘అక్షర’పోరు సాగించినవాడు

అతనో నవచైతన్య కిరణం
వితంతు పునర్వివాహాలను
యథేచ్ఛగా జరిపించినవాడు

ఆధునిక కవిత్వానికి
నూతన ‘ఒరవడి’ దిద్దినవాడు

వ్యవహారిక భాషోద్యమానికి
జవసత్వాలు అద్దినవాడు

‘కన్యాశుల్కం’ నాటకంతో
దాష్టీకాలను ప్రశ్నించినవాడు

ఆ మహానీయుడే..
గురజాడ అప్పారావు

ఆ వ్యక్తిత్వపు అడుగుజాడ
యావత్ జాతి వెలుగు కాగడ
ఆ దార్శనికుని స్వప్నాల తోటలో
విరిసే పువ్వులమై పరిమళిద్దాం

ఆ ఆశయ బాటలో
జాతిజాతి ఏకమై సాగుదాం
(నేడు ‘గురజాడ’ వర్ధంతి)
-కోడిగూటి తిరుపతి
95739 29493