ఉత్తరాయణం

బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడికి ఘన నివాళులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ నటుడు, ప్రముఖ సాహిత్యవేత్త, రచయిత, కాలమిస్ట్, వక్త గొల్లపూడి మారుతీరావు అస్తమయం అటు సినిమా, టీవీ ఇటు నాటక, పత్రికా ప్రపంచానికి ఎనలేని తీరని లోటు. ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన గొల్లపూడి డాక్టర్ చక్రవర్తి (1969) సినిమాతో రచయితగా సినిమా పరిశ్రమకు పరిచయమై తదనంతరకాలంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ, ఎక్కుతూ అనేక పేరుమోసిన నవలలు, రచనలకు అంకురార్పణ గావించిన మేధో సంపన్నుడు. అంతేకాకుండా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ సినీ వినీలాకాశంలో ఏర్పరచుకున్నాడు అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగే ఆయన సంసారం ఒక చదరంగం, తరంగిణి, త్రిశూలం, స్వాతిముత్యం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో తన నటనాకౌశలాన్ని, విశ్వరూపాన్ని ప్రదర్శించి అశేష సినిమా ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్న గొప్ప చరిత్ర గొల్లపూడిది. విభిన్న రంగాలలో తనకున్న అనంత, వెలకట్టలేని ప్రతిభా సామర్థ్యాలతో తన అమూల్య విలువైన జీవితంలో లెక్కకుమించి ఎన్నో అవార్డులను, రివార్డులను స్వంతం చేసుకున్న గొల్లపూడి మారుతీరావు స్వతహాగా ఒక అజాత శత్రువు. మానవత్వం మూర్త్భీవించిన మహోన్నతుడు. చీమకు కూడా హాని తలపెట్టని విశాల, ఉన్నత స్వభావం ఆయనకు పెట్టని ఆభరణం. ఏది ఏమైనా పుట్టినవాడు గిట్టక మానడు. జాతస్య మరణం ధృవం అన్న చందాన ఎంతటి గొప్ప వ్యక్తులు, చరిత్ర సృష్టికర్తలు అయినా మరణం అనేది అనివార్యం. అలాగ తాను ఇష్టపడిన రంగాలలో తననుకున్న లక్ష్యాలను, ఆశయాలను అన్నింటినీ ఏ లోటు లేకుండా సాధించుకొని మరీ కానరాని లోకాలకు తరలివెళ్లిన బహుముఖ ప్రతిభాశాలి, కళామతల్లి పదికాలాలపాటు గుర్తుంచుకొనే ఓ అపురూప ముద్దుబిడ్డ గొల్లపూడి మారుతీరావు అనడంలో ఎలాంటి అవాస్తవానికి తావులేదు. ఆయన సినిమా, టీవీ, నాటక, పత్రిక, సాహిత్య రంగానికి అందించిన అజరామరమైన, మహత్తర సేవలకుగాను ఆయన పేరిట ఏదైనా ఒక చిరస్మరణీయమైన కార్యక్రమానికి రూపకల్పన చేయాల్సిన గురుతర మాధ్యత, కర్తవ్యం అటు రాష్ట్ర ప్రభుత్వంపైన, ఇటు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపై ఎంతైనా వుంది. ఈ ప్రత్యేక సందర్భాన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలుగు సినిమా అభిమానులం అయిన మనందరం ఆత్మీయపూర్వకంగా, మనస్ఫూర్తిగా కోరుకుందాం.
-బుగ్గన మధుసూదన్‌రెడ్డి, బేతంచర్ల

సరైన దిశ
చూపుతూన్న చట్టం
మహిళలు, పిల్లలపై అత్యాచారాల్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువస్తున్న దిశ చట్టం అభినందనీయమైనది. హైదరాబాద్‌లో దిశ హత్యోదంతం పిమ్మట కఠిన చట్టాల అవసరంపై దేశంలో చర్చ విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు, కేంద్రానికి మార్గదర్శనం చేసేవిధంగా కఠిన చట్టాన్ని రూపొందించడం, వెనువెంటనే శాసనసభలో చర్చించి పట్టాలెక్కించడం హర్షణీయం. ఈ విషయంలో చొరవ చూపిన ముఖ్యమంత్రికి అభినందనలు దక్కాలి.
చట్టాల్లో లొసుగులు నేరస్తులకు చావు ధైర్యాన్ని కలిగిస్తున్నాయి. చట్టం కఠినంగా వుండి, వెంటనే శిక్ష అమలుచెయ్యగల పరిస్థితి వుంటే కొంత భయం వుండి నేరాలు తగ్గుముఖం పడతాయి. అత్యాచార కేసులు నాలుగు నెలల్లో తీర్పు దశకు చేరాల్సి ఉండగా నేడు ఈ చట్టం మూడు వారాల్లో పూర్తికావాలి అని చెప్తోంది. అపీల్ అవకాశాల్ని ఆరుమాసాల నుండి మూడు మాసాలకు కుదించింది. పిల్లలపై నేరాల దర్యాప్తు, కోర్టులో వాదనలు, తీర్పులకు సంవత్సరం గడువును మూడు వారాలకు తగ్గించడం జరిగింది. మరణశిక్ష, జీవితఖైదు లాంటి కఠిన చర్యలకు అవకాశం కలిగింది. పైగా వీటన్నింటికీ అవసరమైన ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు ప్రతీ జిల్లాలో చేస్తామనడం మంచి ఆలోచన. ఇప్పుడు కఠిన చట్టం, సత్వర న్యాయప్రక్రియకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లైంది. ఇక కార్యాచరణకు నడుం బిగించాలి. కేసుల నమోదులో అలసత్వం కనబడితే సంబంధిత అధికారులపై చర్యలుండాలి. జీరో ఎఫ్‌ఐఆర్ సాధారణం కావాలి. సోషల్ పోలీసింగ్ పటిష్టపర్చాలి. దర్యాప్తులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడాలి. పోలీసు, న్యాయవ్యవస్థలో ఉన్న ఖాళీలు భర్తీచెయ్యడమేకాకుండా, అవసరంమేరకు సిబ్బందిని పెంచాలి. పాఠశాల విద్యలో జెండర్ సెన్సిటివిటీ, చట్టాలపై అవగాహన, ఎథిక్స్ ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా చట్టం స్ఫూర్తి సమాజంలో అందరికీ చేరాలి. బాధితులకు సహాయం దిశగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తుది తీర్పు దశకు చేరడానికి ఇరవయ్యేసి సంవత్సరాలు పడుతున్న పరిస్థితుల్లో, ఇరవై ఒక్క రోజుల్లోనే చట్టబద్ధంగా న్యాయం అందిస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావడం ఆచరణలో కష్టసాధ్యమైనా, ఆదర్శం వైపు వేస్తోన్న ముందడుగే.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం