ఉత్తరాయణం

పౌరసత్వ చట్టంపై అనవసరపు రాజకీయ రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రం తాజాగా తెచ్చిన పౌరసత్వ చట్టంతో భారతీయ పౌరులెవరికీ నష్టం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినా ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో హింసాకాండ కొనసాగుతోంది. పాక్, బంగ్లా, అఫ్ఘన్ దేశాల్లో బలవంతపు మత మార్పిడిలు, కిడ్నాపుల వంటి వేధింపులు తట్టుకోలేక డిసెంబర్ 2014 లోపు వచ్చిన కొన్ని వేల మంది ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటంతో స్థానిక ప్రజల్లో అభద్రతాభావం ఇంకా పెరిగిపోయింది. కొందరు నేతలు మైన్మార్ నుండి వచ్చిన రోహింగ్యాలకు, చిదంబరం వంటి నేతలు నేపాల్, శ్రీలంక వంటి దేశాలనుండి వచ్చే వారందరికీ పౌరసత్వం సాధించాలంటారు. కాని ఆ దేశాల్లో మత వివక్ష, బలవంతపు మత మార్పిడీల వంటి వేధింపులు లేవు. స్థానిక ప్రజానీకంతో ఘర్షణల కారణంగా ఇటు అక్రమంగా చొరబడుతున్నారు. బంగ్లాదేశ్ ఆవిర్భావంనుండి నేటివరకు 2 కోట్ల మంది శరణార్థులు మన దేశానికి వచ్చారు. అందరికీ గేట్లు తెరవడానికి ఇక్కడ ప్రజానీకం స్థితి కూడ ఆలోచించాలి కదా! అక్రమ వలసల విషయంలో విపక్షాలు కూడ ప్రభుత్వానికి మద్దతునిస్తే మన దేశం బంగ్లా ప్రభుత్వంతో చర్చించి పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు మన మిత్రదేశం బంగ్లాదేశ్ కూడ మత ఛాందసవాదం వీడి అభివృద్ధిపథంలో మనకంటే బాగా దూసుకుపోతుంది. తాజాగా తమ పౌరులను తీసుకోవటానికి సిద్ధంగా వుంది. దేశ భద్రత విషయంలో కూడ ఏకాభిప్రాయం లేక బయటవారికి చులకనవుతున్నాము. విదేశీ శరణార్థుల కంటే ముందు స్వదేశ శరణార్థులు (కాశ్మీర్ పండిట్ల వంటివారు) స్వదేశ ప్రజానీకం బాగోగులు పట్టించుకోవాలి. మన రాజకీయ పక్షాలు, ప్రభుత్వాలు. ఇక్కడ మన యువతకే ఉపాధి లేదు. మనకు ఉచిత సలహాలిచ్చే అమెరికా అక్రమ వలసల కట్టడికి మెక్సికో సరిహద్దుల్లో వేల కోట్ల రూపాయల ఖర్చుతో చైనావాల్ వంటి భారీ గోడ నిర్మిస్తోంది. తక్కువ జనాభా, సిరిసంపదలతో తులతూగే అమెరికా గాని, గల్ఫ్ దేశాలు గానీ తమకు అవసరమైన విదేశీ వృత్తినిపుణులనేగాక నిలువ నీడలేని రోహింగ్యాలను ఆదుకుంటే బాగుండేది. మనది వారివలె ధనిక దేశం కాదు. అధిక జనాభాగల దేశం. ఇకనైనా సరిహద్దులవద్ద చొరబాట్లు నిరోధించాలి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లకు కారణం ఇప్పటికే అక్రమ వలసలతో ఇబ్బందిపడుతున్న స్థానిక ప్రజానీకం, పులిమీద పుట్రలా ఈ కొత్త శరణార్థులతో తమ సంస్కృతికి ప్రమాదమని భావించటమే. కనుక ఈ శరణార్థులకు తక్కువ జన సంఖ్యగల హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడ పునరావాసం కల్పించి, ఆ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక నిధులివ్వటం వంటి చర్యలతో ఉద్రిక్తతలు తగ్గించవచ్చు.
- తిరుమలశెట్టి సాంబశివరావు,
నర్సరావుపేట