ఉత్తరాయణం

ప్రజాగ్రహ జ్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో సుమారు నూట ముప్పై కోట్ల మంది భారతీయుల్లో కోట్లాది మందికి నివాసానికి స్థలాలు, ఇళ్ళు లేక అనేక అవస్థలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు, పంట భూములు, అటవీ భూములు, చెరువులు విస్తీర్ణం కుదించి (ఆక్రమణలకు గురై) బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినా కోట్లాది మందికి గూడు లేక అలమటిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతీ కుటుంబానికి అవసరమగు స్థలంకంటే తక్కువగా ఉందని భారతీయులు ముప్పైశాతం మంది దుర్భర జీవనం సాగిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పౌరసత్వ చట్టసవరణ తీసుకువచ్చి కోట్లాది మంది పొరుగు దేశీయులను మన దేశంలో రప్పించడానికి పచ్చజెండా ఊపడం సమంజసమా? దేశంలోగల ఉన్న రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నందున పౌరసత్వ చట్టం సవరణ రద్దుచేయాలి. ప్రస్తుతం ఉన్న భారతీయ యువతకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతుండటం, ధరల పెరుగుదల, చేనేత కార్మికులు, పండిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆత్మహత్యలు, తాగునీరు సాగునీరు లేక ఇబ్బందులు, మురుగునీటిని, సముద్ర జలాలను శుద్ధిచేసి అందించడం, వాయుకాలుష్యంతో అనేక రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
ఇటువంటి పరిస్థితుల్లో కోట్లాది మంది పొరుగు దేశీయులను మనపై రుద్దితే అంతంతమాత్రంగా ఉన్న కనీస వసతులు వారి రాకతో మంది ఎక్కువై మజ్జిగ పలచనగా మారే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోకుండా యావత్ దేశమంతా జరుగుతున్న ఆగ్రహ జ్వాలల్లో అనేక బస్సులు, రైళ్ళు, వాహనాలు ప్రజాసంపద ఆహుతి అవుతున్నాయి. అలాగే టెలిఫోన్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, మెట్రోస్టేషన్లు మూసివేయడం, విమాన సర్వీసులు రద్దుచేయడం వంటివి ప్రజల గళాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇటువంటి చర్యలు పరిష్కారం మార్గంకాదని గమనించాలి. యువత, విద్యార్థులు, వయోవృద్ధులతోపాటు దేశంలోగల అన్ని రాజకీయ పార్టీలు మతాలకతీతంగా స్వచ్ఛందంగా వ్యతిరేకించటం మోదీ సారథ్యం వహించిన గత ఆరేళ్లలో ఇదే తొలిసారి కావటం గమనార్హం. పెద్ద నోట్లరద్దు, వస్తుసేవల పన్ను, ముమ్మారు తలాక్, ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్ వంటి పలు కీలక సమస్యలపై ప్రతిపక్షాలు విభేదించినా దేశ ప్రజలు మద్దతుగా నిలిచిన విషయం మరువరాదు. ప్రస్తుత పౌర చట్టసవరణపై ప్రజాగ్రహాన్ని గ్రహించి ప్రతిష్టకు పోకుండా పౌరసత్వ చట్టాన్ని రద్దుచేసి ఆగ్రహజ్వాలకు అడ్డుకట్ట వేయాలి.

- యర్రమోతు ధర్మరాజు