ఉత్తరాయణం

రాజధాని విలాసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విలాసం అనగా చిరునామా. ఆంధ్రుల రాజధాని విలాసమేమిటో ఇంకా సందిగ్ధంలోనే ఉంది. రాజధాని స్థానంలో బహువచనం వాడాల్సి రావొచ్చు.. రాజధానులంటూ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సూచనలకై ఏర్పాటుచేసిన జీ.ఎన్.రావు కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికలో అంశాలు, వివిధ పత్రికలు రిపోర్ట్ చేసినవి. స్థూలంగా చూస్తే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్‌ని పోలి వున్నాయి. శ్రీకృష్ణ కమిటీ సూచనల్ని బలపర్చేవిగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాజధాని విషయం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాజధాని కూడా వివిధ పట్టణాల్లో నెలకొల్పడం మంచిదని ఇరువురూ తేల్చారు. తద్వారా వివిధ ప్రాంతాలు అభివృద్ధి చెంది ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని చెప్పారు. ఒకేచోట పెద్ద రాజధాని నగరం ఆలోచన పట్ల, కేంద్రీకృత అభివృద్ధి, ఇతర ప్రాంతాల విస్మరణ దృష్ట్యా ఇరువురూ అయిష్టత వ్యక్తపర్చారు. ప్రాంతాల అభివృద్ధి పట్ల రెండు నివేదికలూ జోన్ల వారీ బోర్డుల్ని ప్రతిపాదించారు. అయితే శ్రీకృష్ణ నివేదికను గత ముఖ్యమంత్రి విస్మరించడం జరిగింది. ఏకైక పెద్ద రాజధాని నిర్మాణం పట్ల మొగ్గుచూపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారిక నివేదికల పట్ల సానుకూలంగా ఉన్నట్లు వార్తలవల్ల తెలుస్తోంది. అమరావతి నగర నిర్మాణానికి చెయ్యాల్సిన అప్పులు, పడాల్సిన కష్టనష్టాలు, ప్రత్యామ్నాయంగా వివిధ రాజధానులు అభివృద్ధి పరచడంవల్ల ఒనగూరే ప్రయోజనాలు బేరీజు వేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయాల్ని, అంగీకారాన్ని పొందాల్సి ఉంది. అపోహల్ని పోగొట్టి అందరి కార్యక్రమంగా ప్రజా రాజధాని నిర్మాణం జరగాలి.
- డా. డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం