ఉత్తరాయణం

2019 ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు విజేత భారతీయ ఓటరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సంవత్సరం ఆద్యంతం భారతీయ ఓటరు ఇచ్చిన ప్రతి తీర్పులోను ఓ ప్రజాస్వామ్య పాఠం వుంది. అలాగే అప్రజాస్వామ్య శక్తులకు ఒక మంచి గుణపాఠమే చెప్పి ఓటరా మజాకా అనేలా చేసారు. అయిటే ఓటరు దేవుడు ఒక మంచి సందేశాన్ని ఈ సందర్భంగా ఇచ్చాడు. ‘పదవులు శాశ్వతం కాదు, ప్రోటోకాల్ భాజాభజంత్రీలు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు శాశ్వతం కాదు, కాని మన దేశం శాశ్వతం, ఓటరుగా నేను శాశ్వతం’. సరిగ్గా ఈ స్థాయిలో ఓటరు దేశవ్యాప్తంగా తన సత్తాను బలంగా చాటి తాము మనసారా వాచకర్మణా నమ్మినవారికి ఓటు అనే తన బలమైన ఆయుధంతో బ్యాలెట్ పేపర్‌పై నొక్కిమరీ తమ తీర్పును చాలా అట్టహాసంగా చాటాడు. అంతేగాకుండా దేశవ్యాప్తంగా కమలం పార్టీకి అత్యంత భారీ ఆధిక్యాన్ని కట్టబెట్టడం, మరోవైపు ముఖ్యంగా మన రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పార్టీకి అఖండ మెజారిటీని సమకూర్చి ఎవరూ కలలోకూడా ఊహించని చాలా వివేకవంతమైన తీర్పునే చెప్పాడు ఓటరు దేవుడు. మరీ కొన్ని రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీకి సైతం అంతుపట్టని చాలా దిమ్మతిరిగే షాక్‌నే ఇచ్చి ఓటరు అంటే శాసించేవాడు, ఎవరి ప్రలోభాలకు లోంగేవాడు కాదు అని చాలా బలంగా చాటిచెప్పడం నిజంగా అభినందనీయం. హర్షించదగ్గ విషయం.
- బుగ్గన మధుసూదనరెడ్డి,
బేతంచెర్ల, కర్నూలు జిల్లా