ఉత్తరాయణం

వెంకన్నబాబు కొందరివాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య బెంగుళూరులో ఉన్న మా అమ్మాయి తన కొడుకుతో కలిసి రు.10వేల టిక్కెట్లు కొని దర్శనమునకు తిరుమల వెడితే, రూపాయి ఖర్చు పెట్టని ఒక నేత మరియు 10 మందిని వీరితో పంపించారు. వీరికి సరిఅయిన దర్శనము లభించలేదు. 10వేల రూపాయలు పోసి కొన్నవారికి అల్పదర్శనం, ఫ్రీగా వచ్చిన వారికి పెద్దపీటా? ఇదెక్కడి న్యాయం. అసలు ఈ ప్రముఖులు అన్నవాళ్ళు తిరుమల వస్తే పేపరువారు, టీ.వీల వారు ఎందుకింత ప్రాముఖ్యం ఇస్తారు. దేశంలోగల కోట్లాది మంది లాగే వీరుకూడా వీరి స్వంత కార్యక్రమముగా తిరుమల వస్తారు. దానికి ఇంత హంగు, ఆర్భాటం, గొల్లచావిడి దగ్గర మైకులో ఉపన్యాసములు అవసరమా?
- శిష్టా లక్ష్మీనరసింహమూర్తి, హైదరాబాద్
‘జయహో హంపి’
మాస్కో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ బరిలోకి దిగిన తెలుగు అమ్మాయి, భారత చెస్ క్వీన్ హంపి ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేసి ఫైనల్‌కి చేరి, ప్రత్యర్థి లీటెంగ్‌జీ (చైనా)తో తుదివరకు పోరాడి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గిన రెండవ భారతీయురాలిగా, తొలి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా హంపి చరిత్ర సృష్టించం ప్రతీ భారతీయునికి గర్వంలా నిలిచింది. చెస్ పేరు వినగానే విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి పేర్లు వినబడతాయి. హంపి పాపకు జన్మనిచ్చి కుటుంబ బాధ్యతలు మోస్తూనే మరోవైపు పట్టువదలకుండా చెస్ కదనరంగంలో మెళకువలకు పదునుబెట్టి నెంబర్‌వన్‌గా నిలవడం గొప్ప విషయం. - కామిడి సతీష్‌రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.