ఉత్తరాయణం

అహేతుక జాప్యం అనర్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశాన్ని పారిశ్రామికాభివృద్ధి పధంలో పరుగులెత్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన పారిశ్రామిక విధానం అద్భుతంగా వుంది. పరిశ్రమల స్థాపన అనేది వివిధ రకాల అనుమతులతో కూడిన ఒక సంక్లిష్ట ప్రక్రియ. దేశం ఆర్థిక పుష్టి గడించాలంటే పారిశ్రామిక సరళీకృత విధానాలు తక్షణం అమలుచేయాలని రతన్‌టాటా 2010లోనే సమర్పించిన నివేదికను గత పాలకులు బుట్టదాఖలు చేసారు. ప్రస్తుతం సరికొత్తగా దేశంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు 60 రోజులు పడుతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఇరవై లేదా తక్కువ రోజులు పట్టే దేశాలు 130దాకా వున్నాయంటే పారిశ్రామికాభివృద్ధికి ఎన్ని అవరోధాలు మనకు వున్నాయో ఇట్టే అర్థవౌతోంది. అనుమతుల ప్రక్రియను వేగవంతం చెయ్య డం, 14 రకాల సేవల్ని ఈ బిగ్ గొడుగు కిందకు తీసుకురావడం, సరళీకృత విధానాలకోసం ఎన్.కె.సింగ్, గోవిందరాజన్ కమిటీల సిఫార్సులను అమలుచేయడం వంటి చర్యలు సత్వరమే సత్ఫలితాలనిస్తాయి. అహేతుక జాప్యం, బ్యూరోక్రసీ, అవినీతి, రెడ్‌టేపిజం, నిర్ణయాలను తీసుకోవడంలో అలక్ష్యం వంటి జాడ్యాలను తుదముట్టించేందుకు మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేయాలి!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఈ అప్పులు వసూలయ్యేదెట్లా?
ప్రభుత్వరంగ బ్యాంకులలో దాదాపు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులు పేరుకుపోయాయని వార్త. ఇది చాలా కలవరపరచే విషయం. బ్యాంకులో అప్పు తీసుకోవాలంటే దానికి నాలుగు రెట్లు ఆస్తి చూపించి, దాని తాలూకూ పత్రాలను బ్యాంకుకు సమర్పించాలి కదా! అప్పు తీర్చకపోతే వేలం ద్వారా తిరిగి తెచ్చుకోవాలనే రూలుంది కదా? ఇలా ఎందుకు జరగడం లేదు? అంటే దొంగ ఆస్తులు, పేపర్ల మీద చూపించిన కంపెనీల మీద బ్యాంకు ఉద్యోగులు కూడా లాభాపేక్షతో శాంక్షను చేసి ప్రభుత్వాన్ని ప్రజలను, దేశాన్ని మోసంచేసారనేగా అర్ధం. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప మేలుకోని బ్యాంకులు, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటే ఈ అప్పులు వసూలుఅవుతాయి? దేశ ఆర్థిక వ్యవస్థను కుంటుపడేసేంత ఈ నిరర్ధక ఆస్తుల విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం తగదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
తిరుగులేని నాయకుడు కెసిఆర్
సమైక్య రాష్ట్రంలో తెదే పార్టీ శాసనసభ్యునిగా, మంత్రిగా తదుపరి డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసి తదుపరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు టి.ఆర్.ఎస్. పార్టీ స్థాపించి, దాదాపు దశాబ్దకాలం కేంద్రంతో పోరాడి విజయం సాధించి ప్రత్యేక రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పాలనాపగ్గాలు చేపట్టి అధిక శాతం ప్రజల మద్దతును పొంది, తిరుగులేని నాయకుడుగా దేశంలోనే గుర్తింపు తెచ్చుకోవడం మనం గమనించవచ్చు. ఆయన వ్యతిరేకులు కుటుంబ పాలనని కొందరు ఏదో కువిమర్శ చేస్తుంటారు. ఇక ఆ విషయం పరిశీలిస్తే కె.టి.ఆర్, హరీష్‌రావు గారలు కష్టపడి పనిచేస్తూ అత్యంత సమర్ధులైన మంత్రులుగా వారి శాఖలు నిర్వహిస్తున్నారు. అలాగే కుమార్తె కవిత రాష్ట్ర సమస్యలపై పార్లమెంట్‌లో తన వాగ్ధాటితో ఆశ్చర్యపరుస్తున్నారు. కెసిఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధించడం తథ్యం.
- గర్నెపూడి వెంకట రత్నాకర్‌రావు, వరంగల్
సహకరించని కాంగ్రెస్
ఎన్డీఏలో ప్రతి ఒక్కరూ మమ్మల్ని రెచ్చగొట్టినా మేము ప్రభుత్వానికి సహకరించాం. మాకు రాజకీయాలకంటే దేశ ప్రయోజనాలే ముఖ్యం అత్యుత్తమంగా పనిచేశాం. కరుణించాం. చాలా బిల్లులు పాస్ అవడానికి కారణం మేమే అంటూ సొంత జబ్బలు చరుచుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. ఓహో! ఆహా!! మరి గత సభ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా? నేషనల్ హెరాల్డ్ కేసు లాంటి కుటుంబ సమస్యకు పార్లమెంటును స్తంభింపజేయడం దేశ ప్రయోజనమా? అది రాజకీయం కాదా? ఈసారి ప్రతిపక్షాలు కొన్ని స్వతంత్ర వైఖరి చూపి కాంగ్రెస్‌ని దూరంగా పెట్టడంవల్లనే బిల్లులు పాస్ అయ్యాయి. ఇందులో కాంగ్రెస్ కరుణ ఏముంది? సహకారం ఏముంది?
- గునే్నశ్, వాకాడు