ఉత్తరాయణం

ప్రజాస్వామ్యమంటే తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజెపి కార్యక్రమంలో సంజయ్‌దత్ పాల్గొనడాన్ని విమర్శించేవారికి అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలియదనాలి. రాజమాత సింధియా బిజెపిలో ఉండగా ఆమె పుత్రుడు కాంగ్రెస్‌లో లేడా? అనేక కుటుంబాల్లోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండటం చూస్తూనే ఉన్నాం. సంజయ్‌దత్‌ని బిజెపి ఆకర్షించడం జాతి విద్రోహం అంటున్నాడు, కాంగ్రెస్ నేత నిజాముద్దీన్. మరి ఒవైసీ సోదరులను ఈ పెద్దమనిషి విమర్శించడేం. బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్ త్రయం కాంగ్రెస్ పక్షానే్న ఉన్నది కదా. ఒక్క దత్ లేకపోతే కాంగ్రెస్ కొంప అంటుకుంటుందా?
-జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్

ప్లాస్టిక్‌తో అనర్థాలు
ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు, క్యారీబ్యాగుల వల్ల కలిగే అనర్ధాలు అనేకం. ఇవి పర్యావరణాన్ని దెబ్బతీయడమే కాక మానవ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, క్యారీబ్యాగులు పారేసిన తర్వాత అవి ఎన్నటికీ మట్టిలో కలిసిపోవు. మళ్లీ వీటిని కరిగించి కొత్తవి తయారుచేయడం జరుగుతోంది. వీటి తయారీలో ఉపయోగించే రసాయన పదార్థాలవల్ల క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. ప్రతి వస్తువునూ క్యారీబ్యాగులలో పెట్టి ఇవ్వడం మామూలైంది. వీటిని వేసిన వేడి పదార్ధాలలో ఈ ప్లాస్టిక్ కరిగి, ఈ పదార్థాలను తినడం వల్ల త్వరగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. దశాబ్దాలుగా ఈ అనర్థాల గురించి హెచ్చరిస్తున్నా, పరిస్థితిలో మార్పు లేదు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల వాళ్లు వీటి వాడకంపై నిషేధం విధించారు. మన రాష్ట్ర ప్రభుత్వాలూ స్పందించాలి. తక్షణం వీటి వాడకాన్ని నిషేధించాలి. తద్వారా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. ప్రజలంతా స్వచ్ఛందంగా వీటిని వాడకుండా ఉండాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఉత్తరాంధ్రలో నకిలీల హవా
ఉత్తరాంధ్ర జిల్లాలలో నకిలీల హవా కొనసాగుతోంది. ప్రభుత్వ వైద్యం పడకేయడంతో వీధికొక ప్రైవేటు ఆసుపత్రి వెలుస్తోంది. పుస్తకాలు చదివిన కొందరు వైద్యుల అవతారమెత్తుతున్నారు. ప్రజలకు లేనిపోని రోగాలను అంటగట్టి భయపెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నకిలీ మందులు, నకిలీ డాక్టర్లు, దొంగ గర్భస్థ శిశువు నిర్థారణ కేంద్రాలు, సంతాన సాఫల్య కేంద్రాలు, ఆయుర్వేద, ప్రకృతి వైద్యశాలలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మందులు ఇక్కడ యదేచ్ఛగా విక్రయింపబడుతున్నాయి. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడ శాఖలను తెరచి అనుభవంలేని డాక్టర్ల చేత వైద్యసేవలు అందిస్తున్నాయి. ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చివేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

సినిమాల్లో అశ్లీలాలు పట్టవా?
మహిళలు ఆలయాల్లో ప్రవేశానికి కష్టపడి ఫలితం సాధిస్తున్నారు సరే, కానీ వారు ప్లబ్బులో చిందులువేసే నృత్యాలని అడ్డుకోవాలని, సినిమాల్లో స్ర్తిలను అశ్లీలంగా చూపుతున్నారని వాటికి వ్యతిరేకించాలని, పది మంది నాగరికంగా సంచరించే చోట పిల్లలు స్కూళ్లు ఆలయాలు, స్ర్తిలు తిరగాల్సిన మార్కెట్ల దగ్గర బజార్ల దగ్గర బార్లు ఉండాల్సిందేనా? వీటిని అడ్డుకోరా? ఏళ్ళ తరబడి మహిళా హక్కుల్ని కాలరాచి పార్లమెంటులోనే సరైన న్యాయం జరగకపోడాన్ని వీరు అడ్డుకోరా?
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

మద్యం తాగడం హానికరం
మనం సినిమాకి వెళ్తే న్యూస్ రీల్‌లో సిగరెట్టు తాగడం శరీరానికి హానికరం అని చూపిస్తారు. నిజమే.. సిగరెట్ సేవిస్తే సేవించిన వారికి రోగాలు వస్తాయి. మరి దేశం స్వచ్ఛ్భారత్ దిశగా పయనించాలంటే మద్యపాన నిషే ధం దశల వారిగా విధించాలి. ఈ మద్యం సేవనంవల్ల సామాజికంగా జనుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. దేశంలో జరిగే ఉపద్రవాలకు 100% మద్యమే కారణంగా చెప్పవచ్చు. మద్యం మనిషిని నీచుడ్ని చేస్తుంది. ఎదురుగా ఎవరున్నారన్న ఇంకిత జ్ఞానాన్ని నశింపజేస్తుంది. అడ్డూ అదుపు లేకుండా ప్రవర్తించేలా చేస్తుంది. మన టి.ఎస్. పోలీస్ యంత్రాంగం మద్యం త్రాగి వాహనం నడిపే వారిపై డ్రంకన్ టెస్ట్‌లు చేసి జరిమానా విధిస్తోంది. ఇలాగే మద్యం తాగి వీధుల్లో మార్కెట్లో తప్పతాగి పడిపోయే వారిపై మద్యం త్రాగి విచ్చలవిడిగా వారిపై కేసులు నమోదుచేసి కారాగారానికి పంపాలి.
- కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

ఏజెన్సీవాసుల అవస్థలు
మన ఆం.ప్ర.లో కరువు పరిస్థితులు నెలకొనడంతో పేద ప్రజల జీవన విధానం చాలా అస్తవ్యస్తంగా వున్నది. కనీసం త్రాగడానికి మంచినీళ్లు కూడా దొరకడం లేనందున ఏజెన్సీ ప్రాంతం ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కావున ప్రభుత్వంవారు కరువు నివారణ చర్యలు చేబట్టడంతోపాటు పాఠశాలలో ప్రస్తుతం అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రూరల్ ఏజెన్సీ ఏరియాలలోగల బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థి, విద్యార్థినులకు జూన్ నెలలో పాఠశాలలు తెరిచేవరకు కంటి న్యూ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
- మందపల్లి సత్యం, రామచంద్రపురం