ఉత్తరాయణం

ఎన్నికల వేళ తాయిలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆదర్శాలు చెప్పే ప్రధాని మోదీ గుజరాత్ ఎన్నికల సమయంలో తాయిలాలు ప్రకటించడం అభ్యంతరకరం. ఆయన ధోరణి గుజరాత్‌కు ఆయన ప్రధానిలా ఉన్నట్లుంది. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్‌పటేల్ ఓటమికి కూడా అమిత్‌షా బృందాన్ని అనైతిక మార్గాల్లో ప్రోత్సహించడం మోదీ వంటి వారికి తగదు. ప్రధాని మోదీ వ్యవహార శైలి ఓటమికి సూచికగా భావించాల్సి వస్తుంది.
-బి.వి.కె.రావు, హైదరాబాద్
ఇసుక మాఫియాను
అడ్డుకోవాలి
సముద్ర తీరంలోని ఇసుకపై అక్రమార్కుల కన్నుపడింది. పాలకుల, అధికారుల అండదండలతో వీరు ఇసుకను అడ్డగోలుగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. సముద్రం తీరం నుండి 500 మీటర్ల వరకు ఇసుక తవ్వరాదని, అలాగే ఆర్‌జడ్, జిరాయితీ భూముల్లో ఇసుక ఎక్కువగా తవ్వరాదని నిబంధనలు ఉన్నా పట్టించుకున్నవారు లేరు. జిరాయితీ భూముల్లో 15 అడుగుల లోతున ఇసుక తవ్వి తరలిస్తున్నారు. ఆర్.జడ్ భూముల్లో చేపల చెరువులు తవ్వుతున్నారు. నిజానికి ఇసుక తవ్వకం పేరుతో మాఫియా తయారైంది. వీరిని అదుపు చేయడం కష్టమైపోతోంది. కనీసం సముద్ర, నదీ తీరాల్లో వాటి మనుగడను దెబ్బతీసే చర్యలకు అడ్డుకట్ట వేయాలి.
-యర్రమేతు ధర్మరాజు, ధవళేశ్వరం
ప్రమాదాలను నివారించాలి
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రహదారి మలుపుల్లో ప్రమాద చూచిక బోర్డులు లేకపోవడం, నియమనిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణాశాఖ, పోలీసు శాఖ అధికారులు చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలి. వాహన చోదకులు వాహనాలు నడపడంలో నిర్లక్ష్య వైఖరిని విడనాడాలి. బస్సులు, లారీలను క్లీనర్లు నడపడం, పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను ఎక్కించి నడపడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్