ఉత్తరాయణం

సహకరించనప్పుడు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాలను పది రోజులకు కుదించడాన్ని కాంగ్రెస్ విమర్శించడంలో సహేతుకత లేదు. పార్లమెంటు నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని, అది అహంకార ధోరణి అని సోనియా ఆగ్రహించడంలో అర్ధమే లేదు. చిన్న చిన్న విషయాలకే పార్లమెంటులో రభస సృష్టించి చర్చ జరగకుండా వాయిదాలు వేయించే కాంగ్రెస్ ఇలా విమర్శించడం హాస్యాస్పదం. సమావేశాలను సజావుగా జరిపించడంలో సహకరించని కాంగ్రెస్ ముందు తన ధోరణిని మార్చుకోవలసి ఉంది.
-ఎ.చైతన్య, వాకలపూడి
వర్గీకరణ అవసరం
ఉమ్మడి రిజర్వేషన్ల వలన మాలలే ఎక్కువగా లబ్ధిపొందారు. మాదిగ, రెల్లి, బుడగ జంగాలు, ఉపకులాలవారు దగా అయ్యారు. ఎస్.సిలను ఎబిసిడి వర్గీకరణను అప్పటి ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. దీంతో మాదిగలుసహా ఉపకులాలకు మేలు జరిగింది. దీంతో మాలలు సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. జీఓ 25ను రద్దు చేయాలని ఇప్పుడు మాలలు కోరడం అన్యాయం. అంతోఇంతో ఆయా వర్గాలకు మేలు చేసే ఆ జీవోవల్ల వారికి ఎటువంటి నష్టం ఉండదు. ఎస్‌సి వర్గీకరణపై ఉషామెహ్రా నివేదికను పార్లమెంటులో పెట్టి వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో చంద్రబాబు చొరవ చూపాలి.
-మందపల్లి సత్యం, రామచంద్రాపురం
చట్టాలతోనే సమతుల్యత
హిందువుల జనాభా పెరగడానికి కర్ణాటకలోని ఉడిపిలో విశ్వహిందూపరిషత్ సారథ్యంలో జరిగిన ధర్మసంసద్ చేసిన సూచన కొంత అభ్యంతరకరంగా ఉంది. హిందువులు నలుగురు పిల్లల్ని చొప్పున కనాలని, అప్పుడే వారి సంఖ్య మెజారిటీగా ఉంటుందన్నది ఆ సలహా. నిజానికి ఇద్దరు పిల్లలను మాత్రమే కనాలని ఎవరూ హిందువులను నిర్బంధపెట్టడం లేదు. చిన్న కుటుంబాలతో అభివృద్ధి సాధ్యమన్నది వారి ఆలోచన. మరోవైపు ముస్లింలలో బహుసంతానం వల్ల వారి సంఖ్య పెరుగుతున్నమాట నిజమే. హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలనడం ఎంత తప్పో, ముస్లిములు జనాభా నియంత్రణకు సహకరించకపోవడమూ అంతే తప్పు. సరైన చట్టాలు తీసుకువచ్చి జన సమతుల్యతకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
-కె.శాంప్రకాశరావు, హైదరాబాద్
తెలుగుకు విలువిద్దాం
ఇంటర్మీడియట్‌లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం మంచిదే. కానీ ప్రస్తుతం అమలు చేస్తున్న ఎన్విరాన్‌మెంటల్, హెరిటేజ్ అండ్ కల్చర్ సబ్జెక్టుల్లా మొక్కుబడిగా ఉంటే ప్రయోజనం లేదు. అలా ఉంటే ఇప్పుడున్న గౌరవం కూడా మాతృభాషకు ఉండదు. కేవలం మార్కుల కోసం మొక్కుబడిగా వాటిని విద్యార్థులు అనుసరిస్తారు. తెలుగును అలా చిన్నచూపు చూడకుండా చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
-కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్