ఉత్తరాయణం

ఉత్తరాంధ్రలో విషజ్వరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దోమలవల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తున్నాయి. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం దీనికి కారణం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విషజ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇక్కడి 50 పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వం ఆ తరువాత ఆ ఊసెత్తలేదు. ఉద్దానంలో వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. స్పందించే వారు కనిపించడం లేదు. ఆ మధ్య ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై కదలిక వచ్చింది. జిల్లాలో పలుచోట్ల డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చెప్పినంత విస్తృతంగా వాటిని ఏర్పాటు చేయలేదు. ఇక ఉద్దానానికి మంచినీటిని అందించే ఉద్దానం నీటి పథకం నిత్యం మరమ్మతులతో ఉందాలేదా అన్నట్లు పనిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి.
-రఫీ, శ్రీకాకుళం