ఉత్తరాయణం

స్పెక్ట్రమ్ మిధ్య.. అవినీతి మిధ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖజానాకు లక్ష కోట్ల రూపాయల మేరకు నష్టం కలిగించినట్టు ఋజువైన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులందరూ నిర్దోషులేనని ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం నిరాశాజనకం. ఈ కేసులో నిందితులంతా పలుకుబడి కలవారే. యూపీఏ ప్రభుత్వంలో టెలికాం మంత్రిగా ఉన్న రాజా, కరుణానిధి పుత్రిక కనిమొజి ప్రధాన నిందితులు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు తిరుగులేకుండా నిరూపితమైంది. కేంద్ర విజిలెన్స్ సంఘం ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేసింది. లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు కాగ్ సంస్థ తేల్చింది. తెరవెనుక నగదు లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వెలికితీసింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు ముందుకు నడిచింది. ఇంత పెద్దస్థాయిలో కుంభకోణం జరిగినట్టు నిరూపణ జరిగినా, ఏ ఒక్కరూ దోషులుగా తేలలేదంటే అది ఖచ్చితంగా మరో కుంభకోణమే. కేసులో సమర్ధవంతంగా వాదించాల్సిన ప్రాసిక్యూషన్ రానురాను దిశ లేకుండా తయారైందన్న న్యాయమూర్తి వ్యాఖ్య తీవ్రమైన అభిశంసన. అది మన వ్యవస్థలో లోపాన్ని తెలియజేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగం చేసే చీకటి శక్తులకు పూర్తి భరోసానిచ్చే తీర్పు.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మత రాజకీయాలు సరికాదు
రాజకీయ లబ్దికోసం మతాన్ని వాడుకోవడం ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులకు ఓ అలవాటుగా మారిపోయింది. గతంలో పరోక్షంగా మతాన్ని రాజకీయాల్లో వాడుకునేవారు. ఇప్పుడు నేరుగా మాటల్లో, చేతల్లో మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. హిందువుల ఓట్ల కోసం ఇటు ఏపీలో ఓ నాయకుడు, అటు గుజరాత్‌లో మరో జాతీయ నాయకుడు గుళ్లుగోపురాలు తిరగడంలో మతలబు రాజకీయ ప్రయోజనాలే కదా! ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి. దేవాదాయ శాఖలో అన్య మతస్థులు పని చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం వంటివి అన్య మతస్థులు ఇచ్చే విరాళాలు సేకరించడం వంటివి సహేతుకం కాదు. ఎన్నికల్లో హామీలు, డబ్బు, బహుమానాలు ఇవ్వజూపడం కూడా మోసమే. జనాన్ని నమ్మించడానికి పాదయాత్రలు చేయడం ఇప్పుడు నాయకులకు రోజువారీ కార్యక్రమంగా మారిపోయింది. ఇది కేవలం ఓట్ల కోసం ఆడే నాటకం. ఎన్నికలయిన తరువాత ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏ నాయకుడైనా పాదయాత్రలు చేస్తున్నాడా? హిందువుల ఓట్ల కోరే నాయకులు ఆ మాటమీద ఉంటారాఅంటే నమ్మలేం. హిందువుల తరపున వకాల్తా పుచ్చుకునే పార్టీలను హిందూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని విమర్శించడం ఎందుకు?
-వేదుల సత్యనారాయణ, కాకరపర్రు
విశాఖలో నీటికష్టాలు
విశాఖపట్నంలో ఇటీవలి కాలంలో మున్సిపల్ నల్లాలు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రస్తుతం రోజు విడిచి రోజు కుళాయిల్లో నీటి సరఫరా చేస్తున్నారు. డిసెంబరు నెలలోనే ఇలా ఉంటే మునుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోనీ రెండురోజులకొకసారైనా నీటి సరఫరా ఉంటుందా అంటే గట్టిగా చెప్పలేం. ప్రస్తుతం కరెంట్ కోత లేనప్పటికీ సరఫరాలో హెచ్చుతగ్గులవల్ల సమస్యలు వస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
-పి.ఎస్.రావు, విశాఖపట్నం