ఉత్తరాయణం

తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రసిద్ధ కవి, సీనియర్ పాత్రికేయులు దేవిప్రియ రచించిన ‘గాలిరంగు’ కవితాసంపుటికి ఈ ఏడాదికిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలుగు సాహిత్యానికి దక్కిన గౌరవంగా భావించాలి. సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యే రీతిలో రన్నింగ్ కామెంటరీ రాసిన దేవిప్రియ భావ, అభ్యుదయ కవిత్వంలో అందెవేసిన చేయి. అనువాద సాహిత్యంలో విశేష అనుభవం ఉన్న వెన్నవరం వల్లభరావుకు కూడా అవార్డు రావడం తెలుగువారికి సంతోషం కలిగించిన వార్త
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
వేద పాఠశాలను కొనసాగించాలి
హైదరాబాద్ శివారు ప్రాంతమైన బోడుప్పల్‌లో ఉన్న వేద పాఠశాల నిర్వహణను వివిధ కారణాలతో కొందరు అడ్డుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేదవిద్య ఎందుకు ఉపయోగపడుతుందని కొందరు హేళన చేసినట్లు ప్రాథమికంగా అవగతమవుతోంది. ఒకవైపు ముస్లిం మతానికి చెందిన మదరసాల నిర్వహణకు నిధులు ఇస్తూ ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు హిందువులకు చెందిన వేద పాఠశాలల నిర్వహణకు మాత్రం అడ్డుచెప్పడం బాధాకరం. జాతీయ ధార్మిక విద్యా పరిరక్షణకు ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మఠాధిపతులు ఈ విషయంలో జోక్యం చేసుకుని బోడుప్పల్‌లో వేద పాఠశాల కొనసాగేలా చూడాలి.
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
శిశు విక్రయాలను అడ్డుకోవాలి
నల్గొండ జిల్లాలో ఇప్పటికీ శిశువుల విక్రయాలు కొనసాగుతుండటం ఆందోళన కలిగించే విషయం. నవజాత శిశువులను డబ్బుపై ఆశతో అమ్మేయడం మానవత్వానికి మాయనిమచ్చ. గ్రామీణ ప్రాంతాలలో పేదరికాన్ని ఆసరా చేసుకుని ప్రలోభాలతో పసికందులను విక్రయించడం దారుణం. సరోగసీ తెచ్చిన తంటా ఇది. గిరిజన ప్రాంతాల్లో ఈ జాడ్యం ఎక్కువగా ఉంది. నిరక్షరాస్యత, పేదరికం దీనికి కారణం. ఈ విషయంలో వారిని చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-సి.హెచ్. సాయిరుత్విక్, నల్గొండ
యారాడలో కొరవడిన భద్రత
విశాఖపట్నంలోని తీరప్రాంతమైన యారాడలో పర్యాటకుల రాకపోకలు ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో అక్కడ పోకిరీల బెడద ఎక్కువైంది. వీధి దీపాలు వెలగకపోవడం, పోలీసుల గస్తీ తగినంతగా లేకపోవడంతో వారి ఆగడాలు ఎక్కువయ్యాయి. విచ్చలవిడిగా, అత్యంత వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. యారాడ బీచ్ ప్రాంతంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి గస్తీ ముమ్మరం చేస్తే మేలు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం