ఉత్తరాయణం

అవినీతిపరులకు హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశువుల దాణా కుంభకోణంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు దోషులని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అవినీతిపరులకు ఒక హెచ్చరికవంటిది. నీతినిజాయితీలకు ఇంకా స్థానం ఉందన్న భరోసా ఇచ్చే నిర్ణయం ఇది. అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగే నాయకులు, అధికారులకు ఇది శరాఘాతమే. పశువుల దాణా కొనుగోలు కోసం పేద రైతులకు నిధులు మంజూరు చేసినట్లు దేవ్‌గఢ్ ట్రెజరీ నుంచి లక్షలాది రూపాయలు బినామీ పేర్లతో విడుదల చేయించిన కేసులో వీరంతా దోషులు. ఈ కుంభకోణంలో నిందితులుగా పేర్కొనబడినవారిలో నలుగురైదుగురు మినహా మిగతావారంతా దోషులేనని తేలిపోయింది. ఇక శిక్ష ఒక్కటే ఖరారు కావలసి ఉంది. బిహార్‌లో రాజకీయంగా బలంగా ఉన్న లాలూప్రసాద్ యాదవ్ పార్టీకి ఈ తీర్పు ఆందోళనకు గురిచేసింది. కొన్ని రాజకీయ పక్షాలు దీనికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నాయి. ఏమైనప్పటికీ పశువుల దాణా కుంభకోణంలో ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిలుపై బయటకి వచ్చిన లాలూ ఇప్పుడు మళ్లీ ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. అవినీతికి అలవాటుపడినవారికి, అన్యాయమైన మార్గంలో సంపాదనపై ఆశలుపెట్టుకున్నవారికి ఇలాంటి తీర్పులు కాస్తంత అదుపులో ఉంచుతాయి. నిజాయితీ పరులకు విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ విషయంలో సీబీఐ కోర్టు సరైన విధంగానే న్యాయం చెప్పింది. ఇది స్ఫూర్తిదాయక తీర్పు.
-బుగ్గన మధుసూదన్ రెడ్డి, కర్నూలు
తెలుగు చదివితేనే ఉద్యోగం
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమై ఆర్భాటంగా ముగిశాయి. ఐదు రోజుల ఉత్సవం సందర్భంగా భాగ్యనగరం మెరిసిపోయింది. అయితే తెలుగు పండితులు, సాహితీవేత్తలు తమతమ ప్రతిభాపాటవాలను ఎరుక పరిచడానికే ఈ వేదికను ఉపయోగించుకున్నారన్న భావన కలిగింది. తెలుగును బతికించుకోవడానికి వారు చక్కని సూచనలు చేసే ప్రయత్నం ఈ మహాసభల్లో వెల్లడి కాకపోవడం బాధాకరం. ప్రపంచ మహాసభలు అద్భుతంగా జరగడం అభినందనీయమే. ప్రజల్లో మాతృభాషను కాపాడుకోవాలన్న స్పృహ కలిగించడంలో ఈ సభలు సఫలీకృతమైనాయనే చెప్పాలి. అయితే మునుముందు మాతృభాషను కాపాడుకునేందుకు, తెలుగు భాషను ఉపయోగంలోకి తీసుకురావడంలోను ప్రభుత్వం వెంటనే చేయవలసిన చర్యలు చాలానే ఉన్నాయి. తెలుగు భాష అమలులో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమూ ఉంది. కార్యాలయాల పేర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ కార్యాలయాలలో దస్త్రాలు తెలుగులోనే కచ్చితంగా ఉండేట్లు చూడాలి. ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే తెలుగు తప్పనిసరి అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. ప్రైవేటు విద్యాసంస్థలను తెలుగుభాష అమలులో తప్పనిసరిగా భాగస్వాములను చేయాలి.
-కాయల నాగేంద్ర, హైదరాబాద్