ఉత్తరాయణం

పెన్షనర్లకు ఆదాయపన్ను కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షనర్లకు అనుకోని కష్టం వచ్చిపడింది. ప్రతీ సంవత్సరం ఫిబ్రవరిలో వారికి వచ్చే పెన్షన్ నుండి ఆ ఏడాదికి సంబంధించి వారు చెల్లించాల్సిన ఇన్‌కంటాక్స్‌ను మినహాయించేవారు. కానీ ఈసారి డిసెంబర్‌లోనే ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెన్షన్ నుంచి ఏకమొత్తంలో ఆదాయపన్నును కోత విధించారు. అనుకోకుండా ఇలా కోత పెట్టడంతో బడ్జెట్ తారుమారై పెన్షనర్లు ఇబ్బందులపాలయ్యారు. నెలవారీగా చెల్లించాల్సిన వాటికి బకాయి పడవలసి వచ్చింది. నిజానికి ఫిబ్రవరి నాటికి ఎన్‌ఎస్‌ఎస్ బాండ్లు, ఎల్‌ఐసి చెల్లింపులు పూర్తి చేసి మార్చినాటికి ఇన్‌కమ్‌టాక్స్ చెల్లించేందుకు ప్రణాళిక వేసుకోవడం సంవత్సరాల తరబడి వస్తున్న అలవాటు. కానీ ఒక్కసారిగా విధానం మారేసరికి వారికి అసౌకర్యం కలిగింది.. కనీసం ముందస్తు సమాచారం ఇచ్చినా బాగుండేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
-ఈశ్వర్, పొద్దుటూరు
పాత పెన్షన్ విధానమే మేలు
కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం పరిధిలోని లక్షా 80 వల మంది ఉపాధ్యాయ, ఉద్యోగ కార్మికులందరికి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు చేపట్టాలి. కొత్త విధానం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏపీ ఐటి శాఖ మంత్రి లోకేష్‌కు ఈ మేరకు ఏపీ జేఏసీ, రాష్ట్ర రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు తదితరులు ఇచ్చిన వినతిప్రతానికి సానుకూలంగా ప్రభుత్వం స్పందించాలి. పీపుల్స్ ఫస్ట్ నినాదంతో సమస్యలు చెప్పేందుకు ప్రవేశపెట్టిన 1100 విధానంవల్ల మేలు జరుగుతుంది.
-జువ్వాది వెంకటరమణ, విశాఖపట్నం
సామాజిక కార్యకర్తలకు పదవులు?
తెలంగాణలో గత ఏడాది విజయ దశమి సందర్భంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్త జిల్లాల్లో వివిధ కమిటీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించింది. అయితే తెరాసలో ద్వితీయశ్రేణి నేతలు క్షేత్ర స్థాయిలో కష్టపడే నేతలకు ఈ పదవులు దక్కుతాయని ఆశలుపెట్టుకున్నారు. ఇక్కడ ఒక విషయం పరిగణనలోకి తీసుకోవాలి. సామాజికంగా ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమం కోసం పనిచేసేవారికి, ఉద్యోగం, వృత్తిపనుల్లో మునిగితేలేవారికి కాకుండా సమాజవేవకు ప్రాధాన్యం ఇచ్చే కార్యకర్తలు, ప్రతినిధులకు పదవులు కట్టబెట్టాలన్నది శ్రేణులు అభిప్రాయం. జిల్లా మానిటరింగ్, డిఆర్‌డిఎ గవర్నింగ్, జిల్లాస్థాయి సంక్షేమ, వక్ఫ్ ఆస్తుల రక్షణ, జిల్లా ఆహార సలహా మండలి, జిల్లాస్థాయి సాక్షర భారతి కమిటీ చైర్మన్ పదవుల్లో ఒక్కటైనా ఇలాంటి వారికి ఇవ్వాలి.
-జి. సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం