క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 28: పాకిస్తాన్‌తో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన రెండో టి-20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ షహీద్ అఫ్రిదీ చివరి క్షణాల్లో చెలరేగి, ఎనిమిద బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 24 పరుగులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు సాధించింది. జేమ్స్ విన్స్ 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కెప్టెన్ జొస్ బట్లర్ 33, ఓపెనర్ జాసన్ రోయ్ 29 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్లలో అఫ్రిదీ కేవలం 15 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. అన్వర్ అలీ 27 పరుగులిచ్చి రెండు వికెట్లు కూల్చాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ పరుగుల వేటలో తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేయగలిగింది. అహ్మద్ షెజాద్ (28) టాప్ స్కోరర్‌కాగా, రఫతుల్లా మహ్మద్ 23, మహమ్మద్ హఫీజ్ 25, షోయబ్ మాలిక్ 26 చొప్పున పరుగులు చేశారు. చివరిలో అఫ్రిదీ సుడిగాలి బ్యాటింగ్ పాక్ అభిమానుల్లో విజయంపై ఆశలు పెంచింది. అయతే, అతను ఆడం వోగ్స్ బౌలింగ్‌లో లియామ్ ప్లంకెట్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కావడంతో పాక్ విజయావకాశం చేజారింది. చివరిలో అన్వర్ అలీ 3, సొహైల్ తన్వీర్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ప్లంకెట్ 33 పరుగులకు మూడు వికెట్లు కూల్చాడు. వోక్స్, రషీద్ చెరి రెండు వికెట్లు సాధించారు.
ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీనితో చివరిదైన మూడో మ్యాచ్ నామమాత్రంగా మారింది.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 (రోయ్ 29, విన్స్ 38, బట్లర్ 22, అఫ్రిదీ 3/15, అన్వర్ అలీ 2/27).
పాకిస్తాన్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 (అహ్మద్ షెజాద్ 28, రఫతుల్లా మహ్మద్ 23, మహమ్మద్ హఫీజ్ 25, షోయబ్ మాలిక్ 26, అఫ్రిదీ 24, ప్లంకెట్ 3/33, వోక్స్ 2/40, రషీద్ 2/18).