జాతీయ వార్తలు

వర్సిటీల్లో అశాంతి బిజెపి పుణ్యమే: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కేంద్రంలో బిజెపి సర్కారు అవలంబిస్తున్న విధానాల వల్లనే దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో అశాంతి, అభద్రత చోటుచేసుకున్నాయని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, జెఎన్‌యులో పరిణామాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. దేశద్రోహి అయిన అఫ్జల్‌గురును తమ పార్టీ సమర్ధించదని, కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న పిడిపితో బిజెపి అంటకాగడం దారుణమన్నారు. తెలంగాణలో ఇకపై ఏ ఎన్నికలు జరిగినా స్థానిక కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.