తెలంగాణ

జల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష ధోరణి : ఉత్తమ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: జల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తొందని, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పేందుకే వాస్తవ జలదృశ్యం ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.అసెంబ్లీ సాక్షిగా సీఎం అనేక అబద్దాలను వాస్తవాలుగా చెప్పారని, వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పేందుకు వాస్తవ జలదృశ్యం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై తెరాస వివక్ష చూపుతోందని ఆరోపించారు. దిగ్విజయ్‌సింగ్‌, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, శ్రవణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.