ఉత్తరాయణం

అసాంఘిక కలాపాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖలో పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే రామకృష్ణాబీచ్, ముడసర్లోవ రిజర్వాయర్, ఋషికొండ, భీమిలి బీచ్‌లు రాత్రి పది గంటల తర్వాత నిఘా కొరవడిన కారణంగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయి. మందు త్రాగడం, చిందులు వేయడం, వ్యభిచారం వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతున్నా యి. ఇక వివిధ పార్కులు ప్రేమపక్షుల విహారాలకు కేంద్రంగా మారాయి. వీరి అనైతిక పనుల వల్ల కుటుంబ సభ్యులతో వచ్చినవారు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది. ఋషికొండ రోడ్‌లో చీకటి పడితే చాలు కార్లలో కూర్చొని మందుబాబులు జల్సా చేస్తున్నారు. పోలీసులు ఈ అసాంఘిక కార్యక్రమాలను నిరోధించాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

భూతాపంతో మనుగడకు ప్రమాదం
భూమి వేడెక్కుతున్నందువల్ల వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు మనుష్యుల మనుగడకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో మార్చి మొదటివారంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితులు చక్కబడాలంటే పౌరులందరూ విధిగా కొన్ని సామాజిక బాధ్యతలను నిర్వర్తించాలి. స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు విరివిగా నాటాలి. ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం నిబంధనను ఖచ్చితంగా అమలుచేయాలి. సోలార్ విద్యుత్‌కు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యుత్, నీరు, కాగితం దుర్వినియోగాన్ని అరికట్టాలి. వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలను అనే్వషించాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి స్వీయ క్రమశిక్షణ పాటించాలి. అప్పుడే మనం భద్రమైన ధరిత్రిని భావితరాలకు అప్పగించగలం.
- గోదూరు అశోక్, కరీంనగర్

హద్దులు దాటుతున్న విమర్శలు
‘దమ్ములుంటే’ పదవికి రాజీనామా చేయాలని ఒకరినొకరు విసుర్లు విసురుకుంటున్నారీమధ్య. అది నోటి దురుసుతనం తప్ప దానివల్ల ప్రజలకు గానీ ఓటర్లకుగా ప్రయోజనం శూన్యం. అదే పదవిలో ఉన్నవారి హుందాతనం లేమికి, అసూయకి నిదర్శనం. తెలంగాణా రాష్ట్రం విడిపోకముందు కెసిఆర్ తమ బృందంతో సహా రాజీనామా చేసి తిరిగి నిలబడి దాదాపు మళ్లీ అదే సీట్లలో ఎన్నికయ్యారు. ఒకసారి ఎన్నికైనవారు రాజీనామా చేసినప్పుడు, వారు మరే ఇతర ఎన్నికలలోనూ నిలబడకుండా (మొదట ఎన్నిక సమయం పూర్తయేవరకూ) చట్టం చేయాలి! అటువంటివి నిషేధించాలి. భారతదేశం, ప్రజలకీ నాయకులకీ జనాభాలోటు లేదు గదా!
- సుబ్రహ్మణ్యం, సింహాచలం

తెగువ వలయు.....
1) మానవత్వము విడనాడి దానవులుగ
ఊచకోతగ చంపెడు నుగ్రవాద
భూతజృంభణ మెక్కుడై ముప్పొనర్చు
నట్టి దుశ్చర్య వణికించె నవని మిగుల
2) నాడు పారిస్సు నందున నేడు మాలి
ఎచట పాదమ్ము మోపునో ఎవరికెరుక
ఇందుగలదందు లేదను సందియమ్ము
లేక నుగ్రవాదమదుండె లెక్కలేక
3) ఏమియెరుసనమాయకులెల్ల మడియ
గుండె కోతకు గురిన మెండుగాను
అంతమొనరింపబొనరే ఆధ్యమగును
జగతియంతయునేకమై సుగతికొరకు
4) ధర్మచింతన నశియించి దైత్యులగుచు
మంచి చెడ్డలు మరచిన మనుజమృగము
లట్లు చలియించి సల్పరే హత్యకాండ
తీవ్రముగ నెంచి తుదముట్ట తెగువవలయు
- కరణం రాజేశ్వరరావు, హిందూపురం

ఎవరు హిట్లర్?
జెఎన్‌యూ విద్యార్థుల అరెస్ట్ సందర్భంగా- మోదీ హిట్లర్ లాగ ప్రవర్తిస్తున్నాడనీ గొంతు నొక్కేవారే దేశ ద్రోహులని రాహుల్ సుద్దులు చెప్పాడు. తరచి చూస్తే ఆ రెండు బిరుదులకు ప్రథమ అర్హురాలు అతని నాయనమ్మ ద్వితీయ అర్హురాలు అతని తల్లి అని అర్ధం అవుతుంది. తనకు పదవీగండం కలగగానే ఇందిర ఎమర్జెన్సీ ప్రకటించి వేల సంఖ్యలో విమర్శకులను జైళ్ళలో కుక్కింది. అందువల్ల ఆ రెండు బిరుదులకు ఆమే ప్రథమ అర్హురాలు. ఇంక సోనియా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తెరవెనక నుంచి సూపర్ ప్రధానిగా దేశాన్ని ఏలింది. కీలుబొమ్మ ప్రధానికి గొంతు లేకుండా చేసింది. అభిప్రాయ భేదాలవల్ల మరణం తర్వాత కూడా పివిని అవమానించి, తనని వ్యతిరేకించేవారి గతి ఇంతే అని చాటింది. అందువల్ల ఇందిర తర్వాత ఆ రెండు బిరుదులకు అర్హత సోనియాదే!
- లక్ష్మీప్రసన్న, పేర్రాజుపేట