ఉత్తరాయణం

పేదలకు మాత్రమే రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులం కోసం పోరాడే రాజకీయ వేత్తలను, ప్రజలు సమాజం నుండే కాక, రాజకీయాలనుంచి కూడా వెలివేయాలి. తమ కులానికే ప్రభుత్వ ఫలాలు అందాలని కోరడం నీచాతినీచమైన సంస్కృతి. మిగతా కులాలను పట్టించుకోకుండా కేవలం తమ కులమే బాగుపడాలని కోరేవాళ్లు అత్యంత స్వార్థపరులు. మిగతా కులాల బాగోగులు వీరికి పట్టవు. బీదలు అన్నికులాల్లో ఉన్నారు. రిజర్వేషన్లు ఇవ్వదలిస్తే అన్ని కులాల్లోని పేదలకు ఇవ్వండి. ప్రతి కులపెద్ద తన కులం గురించి నిరాహార దీక్ష చేసుకుంటూ వెళితే ఏమవుతుంది? అందువల్ల రిజర్వేషన్లు కేవలం అన్నికులాల్లోని పేదలకు మాత్రమే వర్తింపజేయాలి.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

గాడిలో పడని పాలన
నవ్యాంధ్రలో నూతన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావస్తున్నా పాలన గాట్లో పడలేదు. ప్రజలకోసం ప్రపంచ స్థాయి రాజధాని మాట తర్వాత. ముందు కనీస సౌకర్యాలు, భద్రత లోపించాయి. వాహనాలు విపరీతంగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలి. సింగపూర్‌లో మాదిరిగా వ్యక్తిగత వాహనాలకు పన్ను విధించాలి. పట్టణాల్లో పార్కింగ్ సదుపాయాలు లేని కళ్యాణ మంటపాలు, నిబంధనలను అతిక్రమించి నిర్మించే అడ్డగోలు అపార్టుమెంట్లతో ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక మున్సిపల్ అధికారులు, సిబ్బంది తరచూ వార్డుల్లో పర్యటించి వీటిని నియంత్రించాలి. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఉద్యోగుల కొరత రాజ్యమేలుతోంది. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలి. కొన్ని విభాగాల్లో పనిలేని సిబ్బంది కూడా ఉన్నారు. అటువంటి వారిని సిబ్బంది కొరత ఉన్న విభాగాలకు తరలించాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట

బోగీలు పెంచాలి
వేసవి సెలవుల్లో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ కంపార్ట్‌మెంట్లు సరిపోను లేక, ఆ బోగీల్లో గాలి కూడా దూరనంతంగా జనంతో కిటకిటలాడుతూ ఊపిరాడని పరిస్థితి. తమ స్టేషన్ సమీపించినా దిగడానికి కదలలేని స్థితి. అత్యవసర పరిస్థితుల్లో ఆ ఇబ్బంది వర్ణనాతీతం. దీంతో చాలామంది జనరల్ టికెట్ కొన్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలు ఆక్రమిస్తున్నారు. అంత రద్దీలో టిసి కూడా దూరే అవకాశం లేనందున టికెట్ కొనకుండా ప్రయాణించే ప్రయాణికులు ఎంతమందో చెప్పడం కష్టం. అందుకే వేసవి సెలవుల్లో, పండుగ వేళల్లో ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు జనరల్, రిజర్వేషన్ బోగీలను ఏర్పాటు చేయాలి. రిజర్వేషన్ బోగీలలో జనరల్ ప్రయాణికులు ప్రయాణించకుండా జాగ్రత్త వహించాలి.
- సరికొండ శ్రీనివాస రాజు, మిర్యాలగూడ

కాపులు సంపన్నులు కాదు
కాపులు సంపన్నులేమీ కాదు. గోదావరి జిల్లాల్లో ప్రతి కులస్థుడికి తిండికి కరువుండదు. సర్ ఆర్దర్ కాటన్ పెట్టిన భిక్ష అది. అంతమాత్రాన కాపులంతా సంపన్నులనడం దారుణం. ఈ జిల్లాల్లో ఓనాడు దాదాపు ప్రతి గ్రామపెద్ద మునసబు కాపుకులస్థుడుండిన మాట వాస్తవం. నేడు చూడండి, మాజీ గ్రామ మునసబు కటుంబ వారసులను..వారు మెకానిక్కులు, ఆటో డ్రైవర్లు, తాపీ పనివారుగా ఉన్నారు. బతికి చెడిన కులం కాపులు. రత్నాచల్‌కు నిప్పు పెట్టింది కాపు ఉద్యమకారులని ఎలా అనగలరు? జనాభాలో 38 శాతం ఉన్న కాపులు రాజకీయాధికారం లేని జాతిగా మిగిలిపోయారు.
- జవ్వాది ప్రసూన, పెనుగొండ

బావులను శుభ్రం చేయాలి
ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో అనాదిగా ఉండి ప్రస్తుతం వాడుకలో లేనట్టి బొక్కెనతో నీళ్లు తోడుకునే బావులకు మరమ్మతులు చేసి, శుభ్రం చేయాలి. ఈ మధ్య బోరు బావుల వలన, మంచినీటి పథకాల వల్ల ఆ బావులు పాడైపోయాయి. అటువంటి బావుల్లో ఉన్న నీరంతా తోడివేసి శుభ్రం చేయాలి. అప్పుడే సామాన్య ప్రజలు ఆ బావులను వాడుకోగలుగుతారు. ఉచితంగా బొక్కెన, తాడు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంటే, భూగర్భ జలసంపదం పెరుగుతుంది. విద్యు త్ ఆదా అవుతుంది. అంతేకాదు నీటి వృధా కూడా అరికట్టవచ్చు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయక బావుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయ.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ