ఉత్తరాయణం

మొక్కయ వంగనిది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనివర్సిటీలు సరస్వతీ నిలయాలు. అవి చాలా పవిత్రంగా వుండాలి. అక్కడ రాజకీయాలుండకూడదు. ఉగ్రవాదుల్ని సమర్ధించే వారిని వెంటనే కటకటాల వెనక్కి పంపించాలి. వాళ్ళని సమర్ధించిన వారిని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి. మొక్కయి వంగనిది మానై వంగునా అనే సామెత గుర్తుందిగా. ఇంకా ఇంకా ఆలస్యం చేస్తే మత ఘర్షణలుగా చేసేసి రాష్టప్రతి పాలనంటూ అసలే కేంద్రానికి రాష్ట్రానికి సయోధ్య లేని ఈ సమయంలో చదువుకున్న మూర్ఖులు గొడవలు సృష్టించి దేశాన్ని కల్లోల పరచడం క్షమించరాని నేరం. వెంటనే కలుపుమొక్కల్ని ఏరి పారేయండి. దేశంలో ఉగ్రవాదులు ప్రవేశించారనే వార్తలు వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని (తెలిసి) క్షమించరాదు. కఠిన చర్యలు తీసుకోవడం తక్షణ కర్త వ్యం. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు..
- ఎం.దుర్గ్భావాని, నేలకొండపల్లి

ప్రజాప్రతినిధులకు జీతాలా?
ఒకటిన్నర లక్షల నెల జీతాలను రెట్టింపు పైన అంటే మూడున్నర లక్షల రూపాయలకు పాలక, ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక త్రాటిపై నిలచి పెంచేసుకున్నాయి. మాజీలకు అరవై ఐదువేల రూపాయలు పెన్షనుగా నిర్ణయం తీసుకున్నారు. వీరందరికి వైద్య, ప్రయాణ, ఇతర సదుపాయాలన్నీ ఉచితం. వీరికి ఇ.పి.ఎస్-95 పెన్షనర్లు గుర్తుకురారా. వీరి పెన్షన్లు వెయ్యి లోపే. జీవితాంతం ఎదుగూ బొదుగూ లేని పెన్షన్ను గత పదేళ్ళుగా పొందుతున్నవారు ఎన్ని విన్నపాలు చేసుకున్నా, ఆందోళనలు చేసినా చీమకుట్టని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హృదయమున్నదా? మార్చి పదిహేడవ తేదీన హైద్రాబాదులో కేంద్ర మంత్రి దత్తాత్రేయగారికి విన్నవించుకోవడం జరిగింది. వారిని కలసి వేడుకోవడం ఇది ఎన్నోసారో. రేపు ఏప్రిల్ 25నుండి 29వరకు ఢిల్లీలో ధర్నా చేయాలని కేంద్ర ప్రభుత్వ ఇ.పి.ఎస్-95 పెన్షనర్లు నిశ్చయించుకున్నారు. అన్నివిధాలా అన్యాయమైపోయిన ఈ జాతివారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ప్రాభవాన్ని కోల్పోయన శాసనసభ
అత్యంత గౌరవనీయమైన శాసనసభ పూర్వపు గౌరవాన్ని కోల్పోయింది. పార్టీలు మార్చిన సినీ నటి రోజా సస్పెన్షన్ విషయంలో ప్రభుత్వం మరియు ప్రతిపక్షాలు సహనం కోల్పోయి ప్రజల సమస్యలను గాలికి వదలి ఒకరినొకరు గౌరవ హీనంగా విమర్శించుకొంటున్నారు. రోజా సమస్య ప్రజలది కాదు. మరెన్నో ప్రజాసమస్యలు వున్నాయి. అవి శాసనసభలో చర్చించి, మార్పులు చేర్పులు వుంటే ప్రభుత్వానికి సలహా యిచ్చి ప్రజలకు చేరువకావటం ప్రజాప్రతినిధుల కర్తవ్యం. కాని అవి పక్కనపెట్టి పనికిమాలిన సమస్యలతో శాసనసభ పరువు తీస్తున్నారు ఈ ప్రజాప్రతినిధులు. వీరిలో చాలామందిని ప్రజాప్రతినిధులనడం చాలా పొరపాటు. తాము మొదట వున్న పార్టీలువీడి తమ స్వార్థానికి తావున్న పార్టీలకు చేరినవారే ఎక్కువ. వారికి ఆశయాలు, ఆదర్శాలు లేవు. పార్టీయే వారి ఆశయం. అవినీతి రాజకీయమే వారి ఆదర్శం. అలాంటి వారిని రాజకీయాలనుండి వెలివేయాలి. అందుకు వీలుగా చట్టం తీసుకురావాలి. ఆనాడు ఈ రకమైన అలజడులు పోతాయి. అందుకు ప్రజలు ముందుకు రావాలి. అలాంటి ప్రజలను ముందుకు తీసుకుని పోగల నాయకులు కావాలి. వారిలో సేవా భావం త్యాగం వుట్టిపడాలి. వారు మన మొదటి రెండవ తరం నాయకులను గుర్తుకు తేవాలి. అందుకొరకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దానికి పత్రికలు, వాటికి సంబంధించిన చానల్సు సహకరించాలి. ఆనాడే ఈ పీడ అవకాశవాద రాజకీయ నాయకులు పోతాయి. ఎన్నడు రానున్నదో ఈ అవకాశం.
- డి.పి.రామచంద్రరావు, కనుమూరు

అద్వైత ధర్మమే శ్రేయస్కరం
అద్వైత ధర్మంతో విద్యార్థిని విద్యార్థులలో అపారమైన విజ్ఞాన సంపద సమకూరి, ప్రతిభా పాటవాలు అభివృద్ధి చెందుతాయని ప్రపంచ వ్యాప్తంగా మేధావులు గుర్తించారు. వారిలో దాగివున్న నైపుణ్యం బహిర్గతమై, సమస్యలను అధిగమించే సామర్ధ్యం రెట్టింపవుతుందని అధ్యయన నివేదికలు తెలియజేస్తున్నాయి. ర్యాంకులు, మార్కు ల సాధనగా సాగుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను చంపేసి, రోబోలుగా తయారు చేస్తున్న మన విద్యావిధానంలో అద్వైత ధర్మంపై ప్రత్యేక బోధన సాగడం అత్యంతావశ్యకం. విద్యార్థుల పరిపూర్ణ వికాసానికి కెజి నుండి ఆర్షధర్మంపై ప్రత్యేక బోధన సాగడం అత్యంతావశ్యకం. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణేతిహాసాల నుండి ధర్మం, మానవ వికాసం, మానవత్వ విలువలు, సమాజ సేవ, ఆధ్యాత్మికత లాంటి అంశాలుపై సులువుగా అర్థమయ్యేలా కథల ద్వారా విద్యార్థులకు బోధించాలి. ఆర్ష, అద్వైత ధర్మాలే మానవ సమాజానికి ఆలంబన కాగలవనేవి నిర్వివాదాంశం. చిన్నప్పటినుంచే పిల్లల్లో నైతిక, ఆధ్యాత్మిక భావనలను పాదుగొల్పడం ద్వారా రాబోయే భావి తరాల్లో ఉత్తమ పౌరులు రూపొందుతారు.
- సి. ప్రతాప్, శ్రీకాకుళం