ఉత్తరాయణం

ఐద్వా శ్రీరంగ నీతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తీలనుకొన్ని దేవాలయాల్లోకి రానీయకుండా ఉం డటం వివక్షకు నిదర్శనం అని తెలంగాణ రాష్ట్ర ఐద్వా అధ్యక్షులు కె.ఎన్. ఆశాలత అన్నారు. ఐద్వా కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగం. కమ్యూనిస్టులు ఏలిన, ఏలు తున్న ఏ ఒక్క దేశంలో కూడ మహిళలు ప్రధాన మంత్రి, దేశాధ్యక్షులు, సెక్రెటరీ జనరల్‌గా గాని అవలేదు. మన దేశంలో బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో కమ్యూనిస్టు మహిళ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు. ఎనిమిది కమ్యూనిస్టు పార్టీలున్న మనదేశంలో ఏ ఒక్క పార్టీ జన రల్ సెక్రెటరీ పదవిని మహిళలు చేపట్టలేదు. శాసన సభల్లో 35 శాతం సీట్లు అంటూ శాసనసభల్లో గొంతు చించుకునేవారు, హైందవం స్ర్తీలపై వివక్షత చూపుతున్న దని అభిశంసించేవారు, వారి పార్టీల్లో, ప్రభుత్వాల్లో వివక్ష చూపించడం ఐద్వా వారికి కనిపించదా?
నలుగురు భార్యలుండవచ్చు. తలక్ అని మూడు సార్లు ఉచ్ఛరించి భార్యలకు విడాకులివ్వవచ్చు. మహిళలు ప్రార్థనా స్థలాలకు రాకూడదనే హైందవేతరులు ఐద్వా వారికి కనిపించరా? అసలు నాస్తికత్వాన్ని వరించినవారు దేవాలయాల గురించి వ్యఖ్యానాలెందుకు చేయాలి?
-త్రిపురనేని హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

నిరుపేద హృద్రోగులకు పింఛన్లివ్వాలి
మన ప్రభుత్వం వారు ఎంతో మందికి ఎన్నో రకాల పింఛనులను అందజేస్తున్నారు. మరి చేనేత కార్మికులకైతే యాభై ఏళ్లకే వృద్ధాప్య పింఛను అందిస్తున్నారు. బాగానే ఉంది. అదేవిధంగా గుండె ఆపరేషన్ జరిగి మునుపటి మాదిరిగా పనిచేయలేని స్థితిలో ఉన్న పేదవారికి కూడా వికలాంగ పింఛన్లు అందజేయాలి. అంతేకాదు బాహ్య అంగవైకల్యం మాత్రమే కాకుండా, అంతర్గత అవయవాల వైకల్యం ఉన్న వారికి కూడా పింఛన్లు ప్రకటించాలి. జీవితాంతం మందులు వాడాల్సిన స్థితిలో ఉన్న నిరుపేద లను పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.
- వంగర యతేంద్రబాబు, ఐలవరం

అరకులో సౌకర్యాల లేమి
నిత్యం పర్యాటకులను ఆకర్షించే అరకులో సౌకర్యాల లేమి వెంటాడుతోంది. ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ల లభ్యత ప్రభుత్వాధికారులకే పరిమితం కావడంవలన పర్యాటకులు ప్రైవేటు హోటళ్లపై ఆధారపడవల్సి వస్తోంది. పర్యాటకులను వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వపరంగా సౌకర్యాలు లేనందున ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. రెస్టారెంట్లు, ప్రైవేట్ గైడ్‌ల దోపిడీ గురించి వివరించడం ఎవరితరం కాదు. ఈ ప్రాంతంలో రోడ్లు, ఆసుపత్రి సౌకర్యాలు కూడా దారుణంగా వున్నాయి. గతంలో లక్షలాది మంది మదిని దోచుకున్న మ్యూజియం ప్రాంగణంలో బోటు షికారు, జలపాత సందర్శన మూతపడ్డాయి. ప్రపంచంలో కొన్ని దేశాలు కేవలం పర్యాటకుల పైనే ఆధారపడగా, మన పొరుగు రాష్ట్రాలు పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ వారి మన్ననలను పొందుతున్నాయి. మన పాలకులు కనీసం వారి నుండి చూసైనా నేర్చుకోవాలి!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

ఆహార పదార్థాలు కల్తీమయం
నేడు ఆహార పదార్థాలలో పండ్లు, కూరగాయలు, పాలు మొదలగు ఆహార పదార్థాలలో విచ్చలవిడిగా కల్తీ జరుగుతున్నది. క్రితంలో నమూనాలు సేకరించారు. 100కి 90 శాతం విషతుల్యమని తేలింది. కాని వారిని అందరినీ వదిలివేశారు. ఇది వారికి ఉత్సాహాన్ని ఇచ్చింది. విచ్చలవిడిగా కల్తీ చేస్తున్నారు. కాని ఇంతవరకు శిక్షలు పడిన దాఖలాలు లేవు. 1950 నుండి అనగా 65 సంవత్సరాలనుండి యోగా చేస్తున్నారు. యోగాలో కష్టమైనవి ‘శీర్షాషనము’ మయూరాసనము కష్టమైనవి. అటువంటి వారికి కూడా ఆరోగ్యము చెడిపోయినదంటే యోగాలో దోషమున్నదా? లేక ఆహార పదార్థముల దోషమా? పాఠకులే నిర్ణయించాలి. 75 సంవత్సరముల క్రితము లోనికిపోతే అప్పుడు వైద్యశాలలు లేవు. మైదుకూరు నియోజకవర్గంలో ఒనిపెంట గ్రామంలో వైద్యశాల వుండినది. ఇప్పుడు ప్రతిచోట ప్రజలు అనారోగ్యంలో వున్నారు.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు

శ్రుతిమించుతున్న బుల్లితెర కార్యక్రమాలు
కాలక్షేపంకోసం ఇంటిల్లిపాది కలిసి చూస్తూ ఆనందించే ఒకే ఒక సాధనం ‘బుల్లితెర’ అని చెప్పవచ్చును. కానీ ఈ మధ్య బుల్లితెర ద్వారా ప్రచారం చేసే కార్యక్రమా లు శృతిమించి సంస్కృతి సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నాయి. ఈ కార్యక్రమాలను పిల్లలతో కలిసి చూడాలంటే సిగ్గుపడవల్సి వస్తోంది. ఈ కార్యక్రమాల్లో నటించే నటులు వినియోగించే భాష ద్వంద్వార్ధ పూరితంగా ఉంటున్నది. అదే భాషను పిల్లలు అనుకరించడం మరింత దయనీయం. ఈ కార్యక్రమాలు ప్రజానీకాన్ని తప్పుత్రోవ పట్టించేలా ఉన్నాయి.
- పి.శ్రీనివాసరావు, అలికాం