ఉత్తరాయణం

పునర్విభజన సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజన చట్టంలో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల శాసనసభలలోని సంఖ్య 225, 153గా పెంచాలని ఉంది. దీనికి రాజ్యాంగ సవరణ చెయ్యాలని కొందరు, అక్కర్లేదని కొందరు అంటున్నారు. శాసనసభ్యుల సంఖ్య పెరిగితే మండళ్లళ్ళలో కూడా, ఆంధ్రలో 50 నుంచి 75కు, తెలంగాణాలో 40 నుంచి 53వరకు పెరుగుతాయి. దీనికి ఎన్నికల సంఘం నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణకు ఒక కమిషనును ఏర్పాటు చేస్తుంది. అది ఆంధ్రా, తెలంగాణాలలోని 44 జిల్లాలలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని చట్టంలో ఉన్నట్లుగా తమ నిర్ణయాన్ని తెలపడానికి కనీసం ఒక సంవత్సరం పట్టవచ్చు. తరువాత నియోజకవర్గంలోని ఓటర్ల జాబితా తయారుకావాలి. ఇవి అన్నీ అవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం కష్టం. ఇవన్నీ 2019లో జరిగే ఎన్నికలలోపు పూర్తిఅవుతాయా అని అనుమానం. సీట్లు పెరుగుతాయని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రతిపక్షంనుంచి సభ్యులను తమ పక్షానికి ఆకర్షిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలంటే ఇరు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్

ఆక్రమణలతో అవస్థలు
జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణలో భాగంగా ఆ రహదారుల వెంబడినున్న అనేక గ్రామాలు, మండల కేంద్రాల్లోనూ ఆ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆయా ప్రాంతాలలో సర్వీసురోడ్లు నిర్మించారు. బాగానే ఉంది. అయితే ఈ సర్వీసురోడ్లను వ్యాపారస్థులు, కార్లు, లారీలు, బండ్లు తదితర వాహనదారులు ఆక్రమిస్తున్నారు. దీనితో ఈ రహదారులు మరింత ఇరుకుగా మారాయి. ఈ రోడ్లపై వెళ్ళే వాహనాలకు తీవ్ర ఇబ్బంది కలిగి, బాగా ట్రాఫిక్‌జామ్ అవుతోంది. పాదచారులూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సందట్లో సడేమియా అంటూ సందు దొరకకున్నా బైకులపై అతివేగంగా దూసుకువచ్చే అండర్ ఏజ్ డ్రైవింగ్‌చేసేవారు, యువకుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారుల వెంటనున్న సర్వీసురోడ్లపై ఆక్రమణలను తొలగించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

బడాబాబులపై కరుణ ఏల?
సామాన్యులకు ఋణాలు ఇచ్చేందుకు అనేక రూల్స్ చూపించి నానా విధాలుగా వేధించే బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీల విషయంలో ఎందుకంత ఉదారంగా ప్రవర్తిస్తాయో అర్ధంకాదు. సామాన్యులు ఇఎంఐలు సకాలంలో చెల్లించకపోతే నోటీసులు జారీచేసి, ఆగమేఘాల మీద ఆస్తులు జప్తుచేస్తారు. అదే పెద్దలు వందల కోట్లలో అప్పులు తీసుకొని ఎగ్గొట్టినా బ్యాంకులకు పట్టదు. సెప్టెంబర్ నాటికి బ్యాడ్ డెబిట్స్ అనబడే మొండి బకాయిలు పదివేల కోట్లుగా ఆర్.బి.ఐ. నిర్ధారించగా అందులో ఆరువేల కోట్లు బ్యాంకులు నాన్ రికవరబుల్ ఋణాలుగా ప్రకటించి రైటాఫ్ చెయ్యడం చూస్తుంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్దలపట్ల ఎంతటి ఉదారవైఖరి ప్రదర్శిస్తున్నాయో అర్ధవౌతోంది. అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారి ఆస్తులు జప్తుచేయడం కూడా ప్రభుత్వాలకు చేతకావడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం