ఉత్తరాయణం

నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలోని కొల్లంలోని పుట్టింగల్ దేవాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం ఆకస్మిక విపత్తు కాదు. మానవ తప్పిదాల వల్లనే ఇంత ఘోర విలయం జరిగింది. ఆలయానికి సమీపంలో నున్న పంకజాక్షి అనే వృద్ధురాలు నాలుగు సంవత్సరాలుగా ఆలయంలో బాణ సంచా కాల్చడాన్ని నిషేధించాలని పోరాడుతోంది. అధికార్ల చుట్టూ తిరుగుతోంది. కేవలం ఆమె ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే జిల్లా కలెక్టర్ ఈ బాణసంచా పేలుళ్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారట. కానీ పోలీసులు పట్టించుకోలేదు. ఫలితంగా బాణసంచాను కాలుస్తున్న సందర్భంగా జరిగిన ఘోర ప్రమాదంలో అనేక మంది అసువులు కోల్పోయారు. ప్రభుత్వం స్పందించి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి.
- యామా జనార్థన్, సూర్యాపేట

స్ర్తిలకు నిషేధం లేదు
హిందువులకు సంబంధించిన ఏ విషయాన్నైనా స్వీకరించవచ్చును. తమకు తోచిన రీతిలో న్యాయం చెప్పవచ్చును అని ఉన్నత న్యాయస్థానాలు భావించడం సమర్థనీయం కాదు. హిందువుల ప్రతి ఆచారం వెనుక ఒక శాస్ర్తియత, ఆధ్యాత్మిక గాఢత ఉంటాయి. శని శింగనాపూర్‌లో స్ర్తిల ప్రవేశం ఏనాడు నిషేధింపబడలేదు. మూల విరాట్టును తాకడం నిషేధించబడింది. ఎక్కడైనా ఏ ఊళ్ళోనైనా శని విగ్రహాన్ని, ఆంజనేయుని విగ్రహాన్ని స్ర్తిలు తాకకూడదు. అది స్ర్తిల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విధించబడిన నిషేధం. విషయం అర్థంకాని వారికి చెప్పి ప్రయోజనం లేదు. మహమ్మదీయ స్ర్తిలు ఖురాను ఇంట్లో చదవవచ్చు. మసీదులో నమాజు చేయడానికి అర్హురాండ్రు కా దు. ఈ విషయంపై పిల్ వేస్తే హైకోర్టు వారు స్వీకరిస్తారా?
-వరిగొండ కాంతారావు, హనుమకొండ

బాధితులు హిందువులే
తెలంగాణలో మారణహోమం సృష్టించిన అంజుమన్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ వ్యవస్థాపకుడు ఖాసిం రజ్వీ గురించి ఆరోజుల్లో తెలియని తెలంగాణ వారుండరు. హైద్రాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో కలిసిన తరువాత, ఖాసిం రజ్వీ పాకిస్తాన్ పారిపోయాడు. ఆ తర్వాత ఆ పార్టీ పేరులో రెండు పదాలు మార్చుకొని రాజకీయ పార్టీగా మారింది. ముస్లింలు ఎన్ని మారణహోమాలు చేసినా కాం గ్రెస్ నాయకులు మాట్లాడరు.అటువంటి కాంగ్రెస్‌కు హిందువులు ఓటు చేయడం అన్ని తప్పులకంటే పెద్ద తప్పు.
- యశ్వంతరావు శేషగిరిరావు, ధవళేశ్వరం

ప్రయాణికులకు వేధింపులు
ఈమధ్యకాలంలో రైలు ప్రయాణంలో ‘కొజ్జా’ల ఆగడాలు విపరీతంగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి ఇవి శృతిమించుతున్నాయి. రైలులో ప్రయాణించే యువకులను ఎన్నో రకాలుగా పీడిస్తున్నారు. పది రూపాయలనుంచి ఆపై మొత్తం ఇచ్చే వరకు వదలరు. దీనికి తోడు దుర్భాషాలాడటం! వీరి చేష్టలకు భయపడి, వీరు కనిపించగానే యువకులు రైలు దిగి వెళ్లిపోతున్నారు. కావున రైల్వే అధికార్లు కొజ్జాల ఆగడాలను అరికట్టి, రైలు ప్రయాణికులను భద్రత కల్పించాలి. ప్రయాణికులు సుఖంగా, ప్రశాంతంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి.
- అర్వపల్లి ఉపేందర్ ముదిరాజ్, కేసముద్రం

కలచివేసిన దుర్ఘటన
నిర్లక్ష్యం, మానవతప్పిదం, కేరళలోని కొల్లాం వద్ద గల పుట్టంగల్ దేవాలయంలో టపాసులు పేలి ఘోర అగ్నిప్రమాదం సంభవించి అనేక మంది మరణించారు. ఇది దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ కలచివేసిన దుర్ఘటన. ఎన్ని లక్షలు పరిహారం చెల్లించినా అర్థాంతరంగా హరించుకుపోయినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా! ఇటువంటి సంఘటనలు కనువిప్పు కలిగించకపోవడం విచారకరం.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్

డిజిటలైజేషన్ తిప్పలు
కొత్త సాఫ్ట్‌వేర్‌లోకి మారుతున్నామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రతి నెలా యిచ్చే వడ్డీ తగ్గించి డిపాజిట్ మెచూర్ అయ్యేలోగా కాని, చివర్లో కాని డిఫరెన్స్ కలుపుతాం అంటున్నది. మరి ఉద్యోగులకు అదే విధంగా జీతంలో కోతపెట్టి రిటైరయ్యేలోగా కలుస్తుందంటే ఒప్పుకుంటారా? పోస్టల్ శాఖ యింకా ఏడాకులు ఎక్కువ చదివినట్లు కన్పిస్తున్నది. మాన్యుయల్ రికార్డులన్నీ ఆన్‌లైన్ చేస్తున్నాం అని గొప్పగా పబ్లిసిటీ యిచ్చింది. సరియైన ట్రయినింగ్ లేక బ్రాంచీ పోస్ట్‌మాస్టర్లు కుస్తీలు పడుతు న్నారు. పుస్తకంలో వున్నది ఒక అవౌంటు. సిస్టంలో వున్న ది మరో అవౌంటు. నెలలు గడుస్తున్నా రెక్టిఫై కావడం లే దు. ఎందుకొచ్చిన డిజిటలైజేషన్..
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ