ఉత్తరాయణం

అన్నదాతను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జాతీయ నేర గణాంకాల నివేదిక’ తాజా సమాచారం ప్రకారం గత సంవత్సరం రైతు ఆత్మహత్యలు అంతకుముందుకన్నా నలభై రెండు శాతం మేరకు పెరిగాయి. ఒక్క సంవత్సరంలోనే 12,602 మంది అన్నదాతలు, రైతుకూలీలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంటే- సగటున గంటకు ఒకటి చొప్పున రైతు ప్రాణం గాలిలో కలసిపోవడం ఆందోళనకరం. వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు అయిన మనదేశంలో రైతుల దీనస్థితికి పాలకుల విధానాలే కారణం. ఆత్మహత్యలకు పాల్పడేవారిలో అధికులు అప్పులు చెల్లించలేక అదీ ప్రైవేట్ రుణదాతల కన్నా, ప్రభుత్వ బ్యాంకుల నుండి అప్పు తీసుకున్నవారే ఎక్కువ ఉన్నట్టు నివేదిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇప్పుడైనా ప్రభుత్వం తమ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రానున్న బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు, రాయితీల రూపంలో సింహభాగం నిధులు దక్కాలి. అన్నదాత అవసరానికి సాయం అందేలా భరోసా ఉండాలి. దిగుమతులపై పన్ను రాయితీలు ఇవ్వడానికి ఉదారంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, ఇకపై దేశీయంగా దిగుబడులు పెంచడానికి ఆ ఉదారతని చూపించాలి. ఆధునిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకురావడమే కాక, మార్కెట్ అనుసంధానంలో మంచి ధర రైతుకి అందించడంలో ప్రభుత్వం క్రియాశీలక పాత్ర వహించాలి. అన్నదాత ఆత్మహత్య చేసుకొనే పరిస్థితిలో ఉన్నాడంటే ఆహార భద్రత ప్రమాదంలో ఉన్నట్టే. దేశ సంక్షేమం జారుడుమెట్లమీద వున్నట్టే. స్థూల జాతీయోత్పత్తి తగ్గుతున్న వేళ, ఆ భారం రైతుమీద మరింత పడే అవకాశముంది. ఈ ప్రమాద ఘంటికల్ని గుర్తించి తగు పరిష్కారం చూడాల్సిన బాధ్యత ప్రధానిపై వుంది.

-డా డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మరణించాక అవార్డులా?
వివిధ రంగాల్లో నిష్ణాతులు, మేధావులకు వారు జీవించి ఉన్న సమయంలోనే ఉన్నత పురస్కారాలు అందజేయడం ఉత్తమం. బతికి ఉండగా అవార్డులు అందుకుంటే పురస్కార గ్రహీతలకు కూడా సంతృప్తి కలుగుతుంది. మరణించిన తరువాత ప్రకటించే అవార్డులను వారు చూడలేరు కదా! చనిపోయిన ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలన్న డిమాండ్ మన దేశంలో ఇటీవల బలంగా వినిపిస్తోంది. దివంగత నేతలు పి.వి.నరసింహారావుకు, ఎన్టీఆర్‌కు, జయలలితకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సంబంధిత రాష్ట్రాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం వీరు ఇలా డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన, మరణించిన వారికి అవార్డులివ్వడం దేశాన్ని గౌవించుకోవడం లాంటిది.

-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ప్రాంతీయ భాషకు పట్టం
ఒక రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల వారు ఉన్నా రాష్టభ్రాష ఒకటిగానే వుండాలి. కులం ఏదైనా, మతం ఏదైనా రాష్టభ్రాషలో వ్యత్యాసం ఉండరాదు. ప్రతి వ్యక్తి రాష్టభ్రాషను విధిగా నేర్చుకోవాలి. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నవారు ఏ ప్రాంతానికి చెందినా సరే తమిళం తప్పక నేర్చుకోవాల్సిందే. ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా రాష్టభ్రాష విషయమై కచ్చితంగా అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ తెలుగు రాష్ట్రాలు. రాష్టభ్రాషగా ఈ రెండు రాష్ట్రాలలోను తెలుగు మాత్రమే వుండాలి. దాని తర్వాతనే ఇతర భాషలు. సంబంధిత రాష్ట్రంలోని ప్రధాన భాషనే మాతృభాషగా భావించి తీరాలి. మనది ఇప్పుడు బ్రిటీషు ప్రభుత్వం కాదు. ఆంగ్లభాషపై వ్యామోహంతో దేశాన్ని ఇంగ్లీషు దేశంగా చూడాలని భావించటం తప్పు. ప్రాంతీయ భాషలకు మనుగడ ఉండాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం