ఉత్తరాయణం

ఉద్యోగుల్లో నిజాయతీ అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలతో మమేకమై, అహర్నిశలు వారి సంక్షేమంకోసమే కృషిచేయాలని, చేతిలో వున్న అధికారం, పాలనా వ్యవస్థలతో నిజాయితీ, నిబద్ధతలతో కృషిచేసే నవభారత ఆవిష్కారం సాధ్యమని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వాధికారులను ఉద్దేశించి ప్రసంగించడం ముదావహం. ప్రధాని చేసిన దిశానిర్దేశం అందరికీ అనుసరణీయం. ఉద్యోగ ప్రస్థానంలో తొలి పదేళ్లు చాలా కీలకం. శరీరాన్ని బ్యాక్టీరియా దాడి చేసినప్పుడు తట్టుకునేందుకు రోగ నిరోధక శక్తిని వృద్ధిచేసుకునే విధంగా ప్రభుత్వోద్యోగులు అవినీతి, ఆశ్రీత పక్షపాతం వంటి శక్తులు దాడిచేసేటప్పుడు వాటికి ప్రలోభపడకుండా నీతి, నిజాయితీ, నిబద్ధతలనే ఆయుధాల ద్వారా శక్తి సంపాదించుకోవాలి. ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని సమైక్య పర్చేందుకు కృషిచేయాలి. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు, సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వోద్యోగులకు వారి ఉద్యోగ ప్రస్థానం ఒక చక్కని అవకాశం. తాము ఖర్చుపెట్టే ప్రతీపైసా, ప్రజల స్వేదబిందువుల నుండి పన్నుల రూపంలో వచ్చిందన్న స్పృహ ప్రతీ ఉద్యోగి అలవరచుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

గోపూజా దినంగా కృష్ణాష్టమి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఇకనుంచి గోపూజా దినోత్సవంగా నిర్వహించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీచేయడం శుభపరిణామం. ప్రతి ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో గోపూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయా ఆలయ కార్యనిర్వహణాధికారులను ఆదేశించడం సంతోషంగా ఉంది. అయితే దేవాదాయశాఖ పరిధిలో లేని ఆలయాల్లో సయితం వీటిని నిర్వహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, ధార్మిక సంస్థలు చొరవ తీసుకోవాలి. గోవధ నిషేధ చట్టాన్ని సైతం ఉల్లంఘిస్తూ కొన్ని అసాంఘిక శక్తులు స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడంవల్ల సమాజంలో కొంతయినా మార్పువస్తుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

నిష్క్రియాపరత్వం ప్రమాదకరం
అన్నీ మోదీయే చూసుకుంటారు లెమ్మని కేంద్ర మంత్రులు, కార్యకర్తలు చేతులు ముడుచుకొని తమకేమీ పట్టనట్టు మిన్నకుండటం ప్రజలు గమనిస్తూనే వున్నారు. ఈ నిష్క్రియా పరత్వంవల్లనే దిల్లీ, బీహార్ ఎన్నికల్లో భాజపాకు ఘోర పరాభవం కలిగింది. విపక్షాలు మోదీని లక్ష్యంగా చేసుకొని చెలరేగి పోతూంటే వెంకయ్య, జైట్లీ తప్ప మిగిలిన వారెవరూ మోదీపై ఆరోపణల్ని దీటుగా తిప్పికొట్టడం లేదు. కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి కార్యోన్ముఖుల్ని చేయకపోతే కాంగ్రెస్‌కి పట్టిన గతే భాజపాకు పడుతుంది. ప్రాంతీయ పార్టీలు ఒకే వ్యక్తి కనుసన్నల్లో పనిచేస్తాయి. జాతీయ పార్టీలు అలా ఉండరాదు.
- శుభ, కాకినాడ

నేతలకు పింఛను అవసరమా?
బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ప్రభుత్వోద్యోగులకు, పింఛనులకే చెల్లించవలసి వస్తున్నందున అక్టోబర్ 2004 తర్వాత కొలువుల్లో చేరిన ఉద్యోగులకు కంట్రిబ్యూటరీ పింఛను పథకం ప్రవేశపెట్టారు. ప్రజాప్రతినిధులుగా ఐదేళ్లు పనిచేసిన వారికి నెలకు ముప్ఫైవేలు పైబడి పింఛను చెల్లించేందుకు చట్టం చేశారు. ముప్ఫై ఏళ్లు పనిచేసిన ప్రభుత్వోద్యోగికి పదివేలు పింఛను చెల్లిస్తుండగా కోట్లాది రూపాయలు ఎన్నికలలో ఖర్చుపెట్టగలిగి, విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్న వారికి ఈ పింఛను అవసరమా? అమాత్యులు గ్రహించాలి. అయితే ఈ పిం ఛను అవసరమున్నది నూటికో, కోటికో ఒక్కరికి అటువంటి వారికి అందించే విధంగా వారి స్థిరచర ఆస్తులను అంచనా వేసి చెల్లించటంతోపాటు ప్రభుత్వోద్యోగులకు చెల్లిస్తున్నట్లు ప్రజాప్రతినిధులకు వారి వేతనం నుండి మినహాయించి కంట్రిబ్యూటరీ పింఛను పథకం వర్తింపచేసినట్లైతే ఖజానాపై ఎంతో భారం తగ్గగలదు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం