ఉత్తరాయణం

దేశ ద్రోహులను కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ దేశ పౌరుడైనా తన మాతృభూమి అన్యాయం, అన్యాక్రాంతం అవుతుంటే చూస్తూ మిన్నకుండేవాడు మా తృగర్భాన జన్మించిన వ్యర్థజన్ముడు. భారత్‌ను గతంలో పాలించిన మహారాజులు దేశద్రోహులకు దేశబహిష్కరణను గాని, మొసళ్ళున్న నదులలో చంపి పడవేసేవారు. దేశద్రోహులుగా ముద్రపడిన వారికి, వీరిని సమర్ధించే వారికి ఏ శిక్షలు వేయాలో సుప్రీంకోర్టువారు ప్రభుత్వానికి సలహాలివ్వాలి. అవసరమైతే భారత శిక్షాస్మృతిలో సవరణలు చేయాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

సరైన నిర్ణయం
యూనివర్సిటీలకు పరిపాలనా సంబంధంగా వైస్ చాన్స్‌లర్ల నియామకంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుగారి ప్రతిపాదన సకాలంలో సరియైనదిగా భావించవచ్చు. యూనివర్సిటీలకు పదవీ విరమణ పొందిన హైకోర్టు జడ్జీలను గాని, సుప్రీం కోర్టు జడ్జీలను గాని నియమించడం సదరు ప్రతిపాదనలో ప్రతిపక్ష పార్టీ నేతను సభ్యునిగా చేర్చటం సముచితమైన నిర్ణయం.
- బి.వి.సుబ్రహ్మణ్యశాస్ర్తీ, బాపట్ల

డివైడర్ల ఎత్తు పెంచండి
65వ నంబర్ జాతీయ రహదారిపై హయత్‌నగర్ నుండి ఆందోళ్ మైసమ్మగుడి సమీపంలో టోల్ రోడ్డువరకు గల పాత ఫోర్‌వేపై ఇటీవల కొత్తగా రోడ్డు వేశారు. బాగానే ఉంది. కానీ రోడ్డు ఎత్తు పెరిగేసరికి మధ్యలో ఉన్న డివైడర్ల ఎత్తు సరిపోక రోడ్డు లెవల్‌కు రావడం, కొన్నిచోట్ల రోడ్డు లెవల్‌కు తక్కువ ఎత్తున డివైడర్లు ఉండటం జరిగింది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఈ డివైడర్లపై నుంచే రోడ్డు దాటుతున్నారు. కొన్నిచోట్ల రోడ్డు దాటడానికి వీలుగా డివైడర్లను త్రవ్వడం గమనార్హం. పై కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై వేగంగా వెళ్తున్న భారీ వాహనాలకు హఠాత్తుగా ఈ టూవీలర్లు అడ్డురావడం ప్రమాదాలకు దారి తీస్తుంది. అధికారులు ఇకనైనా స్పందించి డివైడర్ల ఎత్తూ వెడల్పు పెంచి మధ్యలో మొక్కలు నాటించాలి. దీనివల్ల ప్రమాదా లను నివారించవచ్చు.
- సరికొండ శ్రీనివాసరావు, హైద్రాబాద్

బాలలకు ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53వేల అంగన్‌వాడీ కేంద్రాలను పూర్వ ప్రాథమిక పాఠశాలలుగా (ప్రీ స్కూళ్ళు)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆమోదయోగ్యంగా వుంది. ఇదో విప్లవాత్మక చర్య. సరియైన పర్యవేక్షణ, తనిఖీలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ తూతూ మంత్రంగా సాగుతున్నాయి. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంవల్ల బాలలకు మంచి ప్రయోజనం సమకూరుతుంది. చదువు, సంధ్య అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు కానె్వంట్లకు హెచ్చు ఫీజులు చెల్లించి వెళ్లాల్సిన అవసరం ఉండదు. బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరుగుతుంది. సర్కారీ విద్యావ్యవస్థ బలోపేతమవుతుంది. అయితే ప్రీ స్కూలు కార్యకలాపాలు సక్రమంగా జరుగుతున్నది లేనిదీ పర్యవేక్షించడానికి ఐసిడిఎస్ అధికార్లతో పాటు ఎంఇవో, సిఆర్‌పి, గ్రామ కార్యదర్శులు, వి.ఆర్.వోలకు అధికారాలివ్వాలి. సరైన నిర్వహణ జరుగుతున్నదీ లేనిదీ దీనివల్ల చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి
కేంద్రం ఇచ్చిన నిధులను కేంద్రంవిగానే చెప్పాలి. అలా కాకుండా తమ రాష్ట్ర నిధులుగా ప్రజలలో నమ్మకం కలిగించడం మంచిది పద్ధతి కాదు. పొత్తు అంటే సరిసమానం. 50 సీట్లు వుంటే చెరిసగం విభజించుకోవాలి. ఇక్కడ శక్తిసామర్థ్యాలు సమానం. ఒక నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగం జరుగుతూ వుంటే పొత్తు అని చూస్తూ ఉండగలమా? దుర్వినియోగానికి శిక్ష అనుభవించి తీరాలి. పొత్తు అని దుర్వినియోగం జరిగినప్పుడు చర్యలు తప్పనిసరిగా వుండాలి. రూ.2500 కోట్ల వ్యయంతో అమలు పరుస్తున్న నీరు-చెట్టు పథకాన్ని తన పథకంగా చెప్పుకోవడంఎంతవరకు సమంజసం?
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు

విశాఖలో యాచకుల బెడద
స్మార్ట్ సిటీగా రూపాంతరం చెందుతున్న విశాఖలో యాచకుల బెడద ఎక్కువైంది. అపార్ట్‌మెంట్లలోకి చొర బడుతున్నారు. రద్దీగా ఉన్న కూడళ్లలో పాదచారులకు, వాహ న చోదకులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఈ గ్రూపులో హిజ్రాలు కూడా చేరారు. వీరిని పోలీసులు నియంత్రించాలి.
- సి. ప్రతాప్, విశాఖపట్టణం