ఉత్తరాయణం

‘ఇస్రో’కి అభివందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోటీలో రష్యాని మించిన ‘ఇస్రో’కి మనసార అభివందనం
సాటిలేని ప్రతిభ చక్కగా చూపిన ‘ఇస్రో’కి అభివందనం
శాటిలైటులు పంపి మార్గదర్శకత చూపు ‘ఇస్రో’కి అభివందనం
మేటి అయిన పనులు చాకచక్యముగ చేయు ‘ఇస్రో’కి అభివందనం
ఏటికోరీతిన నూత్న మార్గంబు చూపెడి ‘ఇస్రో’కి అభివందనం
నేటి విద్యార్థులకు శాస్త్ర ప్రేరణనిచ్చు ‘ఇస్రో’కి అభివందనం
కోటి ఆశల దివ్వెగా, కొండంత అండగా నిలిచిన ‘ఇస్రో’కి అభివందనం
పటిమున్న దేశమని చాటిచెప్పిన సంస్థకి అభివందనం
ధాటిగా శ్రమించే శాస్తవ్రేత్తలున్నట్టి ‘ఇస్రో’కి అభివందనం
సూటియయిన లక్ష్యసాధన చేయు ‘ఇస్రో’ బృందానికి అభివందనం
- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు

బడ్జెట్‌లో విస్మరించినా..
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా రైల్వే పద్దులతో కలిపి వార్షిక బడ్జెట్‌ను నెల రోజుల ముందుగా మోదీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టడం హర్షణీయం. అయితే, కొన్ని కీలక సమస్యలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోయినా, మార్పులు-చేర్పులకు అవకాశం ఉంది గనుక ప్రభుత్వం వాటిని సానుభూతితో పరిశీలించాలి. పార్లమెంటులో అన్ని పక్షాలూ బడ్జెట్‌పై చర్చించే సందర్భంగా ప్రజలకు కొన్ని వెసులుబాట్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. అరవై ఏళ్లు పైబడిన వారికి 4 లక్షలు, ఎనభై ఏళ్లు పైబడిన వారికి 6 లక్షల వార్షికాదాయంపై పన్ను రద్దు చేయాలి. వెయ్యి రూపాయల లోపు పెన్షన్ వస్తున్న ఇపిఎస్-95 కేటగిరీ వారికి నెలకు కనీస పెన్షన్‌గా 5వేలు చెల్లించాలి. అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసి రిటైరైన వారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలి. ఇపిఎస్-95 ఉద్యోగులు అమ్ముకున్న కమ్యూటెడ్ పెన్షన్‌ను 15 ఏళ్ల తర్వాత తిరిగి పెన్షన్‌లో కలపాలి. ఇక, రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం బీబీనగర్- నడికుడి- గుంటూరు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్, విద్యుదీకరణ పనులను చేపట్టాలి. విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి లేదా వాల్తేరు డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో విలీనం చేయాలి. బడ్జెట్‌లో ప్రతిపాదించకపోయనప్పటికీ పెన్షనర్లు, రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలిగించేలా కేంద్రం ఈ చర్యలను తీసుకోవలసి ఉంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ఇవేం సీరియళ్లు..?
ఏ ఛానల్‌లో సీరియల్ చూసినా
ఏమున్నది చెప్పడానికి?
సీరియళ్లు సమస్తం కష్టాలూ, కన్నీళ్లే
కుట్రలు, కుత్సితాలు, హత్యలు, హాహాకారాలు..
పచ్చని సంసారంలో నిప్పులు పోసే ఆడవిలన్లు ..
తల్లీకూతుళ్ల మధ్య వైరం, అత్తాకోడళ్ల మధ్య వైరం
ఆలుమగల మధ్య ద్వేషం, అన్నాచెల్లెళ్ల మధ్య యుద్ధం
ఒకరిని చంపేందుకు పలురకాల యత్నాలు,
గర్భవతులపై విషప్రయోగాలు
తీయని మాటలతో తీసే గోతులు
కలియుగంలో ప్రత్యక్ష నరకం
డైలీ సీరియళ్ల వీక్షణం
ఎక్కడ మొదలైందీ, ఎటు పోతోందీ
ఎక్కడ ముగిసేదీ రచయితలకే తెలియదు
ఇకనైనా సీరియళ్ల తీరు మారదా?
సమాజం గురించి పట్టదా?
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం