ఉత్తరాయణం

ఇంటర్ మార్కులకు వెయిటేజీ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రవేశపరీక్షల్లో ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మరో రకం పరిణామాలకు దారితీయవచ్చు. ఆమధ్య బిహార్‌లో మేడమీద పరీక్ష రాస్తున్న విద్యార్థులకు కొందరు పైప్‌లైన్లపై ఎగబాకి స్లిప్పులు అందించడం కలకలం రేపింది. స్పిప్పులు అందించడం, మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలు అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పరీక్షల్లో కాపీ కొట్టడానికి కొంతమంది విద్యార్థులు అలవాటు పడుతున్నారు. వీరికి విద్యాశాఖ అధికారుల సహకారం కూడా ఉంటోంది. కొన్ని ప్రైవేటు కళాశాలలు ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకునేందుకు అవకతవకలకు పాల్పడుతున్నాయి. పరీక్షలపై తగిన నియంత్రణ లేకపోవడం, అధికారుల అవినీతి ఇందుకు కారణాలు. ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తే ఇన్విజిలేటర్లే విద్యార్థులకు జవాబులు చెప్పి రాయించే పరిస్థితి దాపురించి పరిస్థితి మరింత అధ్వానం అవుతుంది! మాస్ కాపీయింగ్ వంటి అక్రమాలు జరగకుండా పరీక్షల విధానాన్ని సంస్కరించాలి.
- లక్ష్మి, కాకినాడ

శాపమైన శబ్ద కాలుష్యం
కొన్ని ప్రార్ధనా మందిరాలపై ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్ల శబ్దం రైలు ఇంజన్ శబ్దం కన్నా దారుణంగా వుంటున్నది. ఈ శబ్ద కాలుష్యం కారణంగా ముఖ్యంగా చిన్న పిల్లలు, వ్యాధిగ్రస్థులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మైకుల ద్వారా వచ్చే శబ్దకాలుష్యాన్ని అరికట్టే శక్తి ప్రభుత్వాలకు వుందా? మతంతో సంబంధం లేకుండా అన్ని ప్రార్ధనా మందిరాలపై మైకులను తొలగించాలని మనవి. మైకులు లేకుండానే ప్రార్థనలు చేసుకోవచ్చు. భగవంతునిపై నిజమైన భక్తి ఉన్నవారికి ప్రజలను ఇబ్బంది పెట్టే తత్వం పనికిరాదు. బహిరంగంగా మైకుల వినియోగాన్ని అరికట్టి, శబ్దకాలుష్యం నుండి ప్రజలను రక్షించాలి. ఏ దేవుడూ మైకులు పెట్టాలని కోరటం లేదు. ఈ విషయాన్ని గ్రహించి ఆయా మతాలకు చెందినవారే స్వచ్ఛందంగా మైకులను తొలగించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

అర్హులను గుర్తించరా?
కేంద్ర ప్రభుత్వం ఏటా ఇస్తున్న ‘పద్మ’ అవార్డుల్లో అర్హులకు స్థానం దక్కడం లేదన్న విమర్శలు మళ్లీ వినవస్తున్నాయి. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన కొందరికి ఇప్పటికీ అవార్డులు రాకపోవడం గమనార్హం. రాజకీయ కారణాలతో కొందరిని అవార్డులు ముందుగానే వరిస్తున్నాయి. టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నేతలకు ఎలాంటి అవార్డులు ప్రకటించలేదు. ఇలాంటి మహోన్నత వ్యక్తులకు ‘్భరతరత్న’ అవార్డు ఇచ్చినా ఎవరూ ఆక్షేపించరు. అతి చిన్నవయస్సులోనే వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులైన డాక్టర్ పలుకూరు హనుమంతరావు వంటి వైద్యుల సేవలను గుర్తించక పోవడం సరికాదు. బతికుండగా సత్కరించడానికి బదులు కొందరికి మరణానంతరం ‘పద్మ’ అవార్డులను ఇవ్వడంలో అంతరార్థం ఏమిటి? ప్రాంతాలను, సామాజిక వర్గాలను, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పురస్కార గ్రహీతలను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు