ఉత్తరాయణం

కలుషితమవుతున్న సముద్ర జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాదేది కలుషితానికి అనర్హం అనిపిస్తోంది. సముద్ర జలాలు కలుషితం కావటం గమనిస్తే ఏ సినిమా షూటింగో జరిగితే సినిమా సిబ్బంది ఆఘమేఘాల మీద షూటింగ్ పరిసరాలు శుభ్రం చేసే పనిలో భాగంగా సముద్రపు పరిసర ప్రాంతాలు, బీచ్‌లు వారి షూటింగ్ నిమిత్తం శుభ్రం చేస్తారు. కానీ మరెవ్వరు సముద్ర ప్రాంతాలు కలుషితం కాకుండా చర్యలు చేపట్టడం కనుచూపు మేరలో సాధ్యంకాదు అనడం అతిశయోక్తికాదు. సముద్ర జలాలు కలుషితమే కాకుండా మిగిలిన ప్రదేశాల్లో మితిమీరి భూగర్భజలం తోడేస్తుంటే ఆ జలాల్ని భర్తీచేస్తూ సముద్ర జలాలు ప్రవేశిస్తున్నాయి. ఈ విషయం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదు. ప్రభుత్వం మేలుకొని వ్యర్థ పదార్థాలను సముద్రంలోకి వెళ్ళకుండా సముద్రంలోని ఇసుకని కట్టడాల నిర్మాణానికి వాడకుండా, భూగర్భ జలాల్ని మితిమీరి వినియోగం చేయకుండా నీటిని పొదుపుగా వాడే చర్యలు, అనవసరమైన కట్టడాలు నిర్మించకుండా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో సముద్రాలు విపరీతంగా కలుషితం అయి తద్వారా ప్రజాప్రయోజనాలు కాకుండా పోయి తర్వాత తరాలకి పూర్వం తాబేళ్ళు అనేవి ఉండేవి అవి ఈ విధంగా ఉంటాయి అని పాఠాల్లో మాత్రమే ప్రస్తుతం డైనోసార్లను చూపే విధంగా చూపాల్సి వస్తుందని ప్రభుత్వానికి వినయంగా మనవి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

నైతిక విలువలు నేర్పాలి
ఒకప్పుడు చిన్న పిల్లలకు బాల సాహిత్యంతో అనుబంధం ఉండేది. ఆనాడు చందమామ, బాలజ్యోతి, చిన్న బొమ్మరిల్లు మినీ నవలలను పిల్లలు విపరీతంగా చదివేవారు. ఇక ఇంట్లో అమ్మమ్మలో, నాయనమ్మలో, తాతయ్యలో ఓపికగా కథలు చెప్పేవారు. ఇలా ఆనాటి పిల్లలకు కథాశ్రవణం, పఠనం విస్తారంగా జరిగినందున నైతిక విలువలు పెంపొందేవి. మానసిక వికాసం పెంపొందేది. రానురాను పరిస్థితులు మారిపోయాయి. టి.విలు, మొబైల్స్, కంప్యూటర్ గేమ్స్‌కు బానిసలై పిల్లలు తమ విలువైన బాల్యాన్ని వృధా చేసుకుంటున్నారు. తోటి బాలలతో అనుబంధం లేదు. ఇది వారి నైతిక ఎదుగుదలకు గొడ్డలి పెట్టు. ఇక పెద్దలు టి.వి. డైలీ సీరియల్స్‌కు ఫెవికాల్‌లా అతుక్కుపోయి వారి వినోదంలో వారు ఉన్నారు. ఎవరికివారే యమునా తీరే అనట్లుంది ఈనాటి కుటుంబ సంబంధాలు. ఈ పరిస్థితి మారాలి. పిల్లలకు బాల సాహిత్యాన్ని బాగా చదివించాలి. పెద్దలు పిల్లలకు నీతి సాహస గాథలు బాగా చెప్పాలి. ఇవి పిల్లల్లో సత్ప్రవర్తనను కలిగిస్తాయి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

రుణాల మంజూరులో రాజకీయం
ఎన్నో ఆశలతో ఎంతో పోరాడి అందరు ఆరాటంతో మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచుకున్నాం. కాని ఉద్యమ కాలంలో పోరాటానికి వ్యతిరేకంగా వున్నవారు పదవులకోసం నియోజకవర్గ అభివృద్ధి కొరకు అంటూ తెరాసాలో చేరి ప్రభుత్వ పథకాలను లబ్దిదారులకు చేరకుండా వారి వారి బినామీలకే అందేలా చేస్తున్నారు. ఈమధ్య ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ వర్గాలకు సబ్సిడీ రుణాలకు లబ్దిదారుల ఎంపిక బాధ్యతను రాజకీయ ప్రజాప్రతినిధులకు అప్పగించగా ఇష్టానుసారంగా వారి వారి బినామీలకు లేదా పైరవీ పేరుతో డబ్బు ఇచ్చిన వారికి మంజూరు చేయించుకున్నారు. ఇంతకుముందు బ్యాంక్ అధికారులకు లబ్దిదారుల ఎన్నికకు అధికారం వుంటే ఎవరు లబ్దిదారులు, ఎవరు మళ్లీ లోన్ కట్ట కలుగుతారు అని పరిశీలించి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేవారు. అందువల్ల ప్రజాప్రతినిధులకున్న ఈ అధికారాన్ని తప్పిం చాలి. బ్యాంక్ అధికారులకు మండల అధికారులకు అధికారం ఇచ్చి సరైన లబ్దిదారులకు సబ్సిడీ రుణాలు అందేటట్లు చూడాలి.
- అర్వపల్లి ఉపేందర్ ముదిరాజ్, కేసముద్రం

కారుణ్య నియామకాలు వద్దు
ప్రస్తుత సమాజంలో కారుణ్య నియామకాలు జరపడం మంచిది కాదు. ఒకప్పుడు ఆచరణ యోగ్యమేకాని, ప్రస్తుతం మంచిది కాదు. కారుణ్య నియామకాలను వెం టనే రద్దు చేయాలి. ఒకవేళ ఉద్యోగి సగం సర్వీసులోనే మరణిస్తే అప్పుడు కారుణ్య నియామకం చేపట్టవచ్చు. అంతేకాని పూర్తి స్థాయి సర్వీసులో ఇవ్వకూడదు. ఉద్యోగి సర్వీసు చివరిలో మరణించినా కూడా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం సమంజసంగా లేదు.
- బమెర్ల కవిత, అనంతపురం