ఉత్తరాయణం

నిప్పులాంటి నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశములెన్నయినను- ధరణి వొక్కటే
జీవులెన్నయినను- జీవంబునొక్కడే
వేదములెన్నయినను- వేదసారంబునొక్కటే
భాషలెన్నయినను- భావంబువొక్కటే
కులములెన్నయినను- కూడునొక్కటే
జన్మలెన్నయినను- జీవన గమనము లొక్కటే
మతములెన్నయినను- మార్గంబునొక్కటే
జనని లేనిది- జన్మ లేదు
ధరణి లేనిది- ధాన్యము లేదు
సంపద శాశ్వతము కాదు- సంతానము శాశ్వతము కాదు
ఏమిటో నీ లీల వెంకటేశా?
ఎవరిక తెలియదాయె నీ మహిమ
తిరుమలేశా!
- ఆర్.నాగభూషణము, ఆళ్ళగడ్డ

కఠినంగా వ్యవహరించాలి
అనంతపురంలో దొంగల బెడద తీవ్రంగా ఉంది. అదేమి చిత్రమోకాని, అటు పోలీసులకు, ఇటు ప్రభుత్వానికి దోపిడీల విషయం పట్టడం లేదు. దొంగలను పట్టుకున్న తర్వాత కోర్టుల్లో వారికి శిక్ష పడేవిధంగా చేసిన దాఖలాలు చాలా తక్కువ. పోలీసులే కఠినంగా వ్యవహరించాలి. దొరికిన దొంగలను దొంగతనం నిర్ధారణ అయ్యాక అరబ్ దేశాల్లో విధించే శిక్షలే వెయ్యాలి. భయపడేటట్లు చేస్తే దొంగతనాలు తగ్గుతాయి. పట్టపగలే ఆడపడచుల మెడలోని మంగళ సూత్రాలు, గొలుసులు లాగేస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే ప్రజలకేమాత్రం రక్షణ ఉండదు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం

సెలవుల షెడ్యూలు మార్చాలి
ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా తపాలాశాఖ ప్రకటించే సెలవులు విచిత్రంగా ఉంటాయి. మార్చి 7న మహాశివరాత్రి, ఏప్రిల్ 15న శ్రీరామనవమి, కాగా, ఈ పండుగలకు సెలవులు ప్రకటించనే లేదు. ఈసురోమని తపాలా ఉద్యోగులు విధులు నిర్వర్తించారు. ఈ రెండు రోజులు సెలవులు ఉంటాయని భావించిన ప్రజలు, ఖాతాదార్లు పోస్ట్ఫాసులవైపు కనె్నత్తి చూడలేదు. అన్నింటికి మించి ఏప్రిల్ 20న మహావీర జయంతి సందర్భంగా తపాలాశాఖ సెలవును ప్రకటించింది. మహావీర జయంతిని ఉత్తరభారతంలో పలు ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒకటి, రెండు చోట్ల తప్ప ఆ ఊసే ఉండదు. ఈ నేపథ్యంలో మహావీర జయంతిని సెలవుగా ప్రకటించడం అర్థరహితం. ఈ విషయాన్ని తపాలాశాఖ పరిశీలించాలి. వచ్చే ఏడాదిలోనైనా సెలవుల షెడ్యూలు మార్చాలి.
- వి.కె.రావు, పొందూరు

ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలి
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు 253 ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవహారాలశాఖ ద్వారా 2011, జిఓ.ఎంఎస్.నెం.88ను జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో నేరుగా ఇతర కేటగిరీల్లో శాఖ సిబ్బంది రెగ్యులర్ చేయడానికి ప్రతిపాదనలు పెట్టాలి. స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు సిబ్బందికి వెంటనే డిప్యుటేషన్లు రద్దు చేసి, వారికి రోజువారీ వేతనం చెల్లిస్తున్నారు. మరి వీరిని చాలా దూరం పంపడం సరికాదు. తక్షణమే వారి జీతాలకు బడ్జెట్ కేటాయించాలి. 13వ ఆర్థిక సంఘం నిధులతో నడిచే టైపిస్టు, జానియర్ అసిస్టెంట్ల జీతాలు పెంచాలి. అటెండర్, హెడ్‌క్లర్కు జీతాలు పెంచారు. అదే జిఓ తేదీ నుంచి బడ్జెట్ కేటాయించి జీతాలు ఇవ్వాలి. స్పెషల్ కాంట్రాక్టు న్యాయశాఖ డిప్యుటిషన్ రద్దుకు తెలుగు ప్రభుత్వాలు, హైకోర్టు స్పందించాలి.
- వై.సురేఖ, తిరుపతి

ఐపిఎల్ ఎంతవరకు అవసరం?
ఒకప్పుడు ఆటలను వినోదానికి, విజ్ఞానాభివృద్దికి ఎంతో ఉపయుక్తంగా రూపొందించి, సమాజంలో యువత చెడు నడవడిలో పడకుండా ఉండేవి. మరి క్రికెట్ పోటీలు నేడందుకు పూర్తి భిన్నం. ఇది సోమరుల ఆటగా పేరుపడింది. యూరప్, అమెరికా, చైనా ఇతర ఆసియా ఖండ దేశాల్లో ఈ ఆటలు ఆడరు. అది అట్లా ఉండనిచ్చి మనదేశంలో ఈ క్రీడ నేటి యువతకు ఒక పిచ్చిగామారింది. ఫలితంగా బెట్టింగ్‌లు మొదలయ్యాయి. బడా పారిశ్రామిక వేత్తలు కూటమిగా ఏర్పడి ఆటగాళ్లను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి పోటీలు నిర్వహించడం ఎంతవరకు సబబు? రెండు నెలలపాటు యువత ఈ మత్తులో తేలియాడేలా వుండే ఈ ఆటలను నిషేధించడం అవసరమా? కాదా? అన్నది విజ్ఞులు ఆలోచించాలి.
- గొలుసు శోభనాచలం, గరికపర్రు

మినరల్ వాటర్ ధర తగ్గించాలి
లీటరు మినరల్ వాటర్ బాటిల్ రైల్వే స్టేషన్లలో పదిహేను రూపాయలకు, రైళ్లలో ఇరవై నుంచి ఇరవై అయదు వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. చెన్నైలో పది రూపాయ లకు బయట, రైల్వే స్టేషన్‌లో పదిహేను రూపాయలకు అమ్ముతున్నారు. మన కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మినరల్ వాటర్ లూజుగా లీటరు ఐదు రూపాయలకు ఇస్తున్నారు. ఇటువుంటి సదుపాయం సికిందరాబాద్, హైదరాబాద్, వరంగల్, కాజీపేట, విజయవాడ లాంటి ముఖ్య రైల్వే స్టేషన్లలో కల్పించాలి. దీనివల్ల ప్రయాణికులకు తక్కువ ధరకే పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి వస్తుంది. అసలే వేసవికాలం. ఎండలు మండుతున్నాయ. ఎంత నీరు తాగినా దాహార్తి తీరడం లేదు. ఇళ్లలోకి కూడా ఇరవై లీటర్ల క్యాన్ ఐదు రూపాయలకే సరఫరా చేస్తామన్న వాగ్దానాన్ని నాయకులు మరచారు.
- ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్