ఉత్తరాయణం

ప్రమాదాలు మానవ తప్పిదాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య పలుచోట్ల ఘోర బస్సు ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు పోయాయి. వాహనాల అమిత వేగం, డ్రైవర్లు కంట్రోల్ తప్పడం, కునుకు తీయడం, ఓవర్‌టేక్ చేయాలన్న ఆతృత, డ్రైవ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడడం వంటివి ఈ ప్రమాదాలకు కారణాలుగా కనిపిస్తాయి. ఈ ప్రమాదాలన్నీ చాలావరకూ కోరితెచ్చుకున్నవలే. కన్నవారికి, బంధువులకు విషాదాన్ని మిగిలిస్తున్నాయి. ప్రభుత్వాలను అదేపనిగా తప్పు పట్టవలసిన పని లేదు. నష్టపరిహరం పరిష్కారం కాదు. గతంలో గంటకు అరవై, డెబ్భై కిలోమీటర్ల వేగానికి పరిమితి విధించేలా పరికరాలను అమర్చేవారు. ఇప్పుడు ఆ నిబంధనలను తీసేశారా? లేక వాహన యజమానులే లోపాయికారిగా తీయించేశారా? హైదరాబాద్‌లో ఇటీవల సిటీబస్సు డ్రైవర్లు ఒకరిద్దరికి నడుపుతుండగా గుండెనొప్పి వస్తే ప్రమాదాన్ని గ్రహించి బస్సును ఓ పక్కకు తీసుకెళ్లి ఆపి స్టీరింగ్‌మీదనే వాలిపోయారు. ప్రయాణీకులంతా క్షేమంగా ఉన్నారు. ఇదీ అప్రమత్తత అంటే.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

వామపక్షాల ద్వంద్వ వైఖరి
తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి కానుకలుగా బంగారు నగలను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమర్పించడంపై వామపక్ష పార్టీలు కువిమర్శలకు దిగడం హాస్యాస్పదం. దేవుడిని తాము విశ్వసించమని చెప్పే వామపక్షాల నేతలకు ఆలయాల గురించి ఆసక్తి ఎందుకు? ప్రభుత్వ నిధులతో మైనారిటీలకు పెళ్లిళ్లు చేయించడం, హజ్ యాత్రకు, జెరూసలెంకు వెళ్లేవారికి సబ్సిడీలు ఇవ్వడంపై కమ్యూనిస్టు నాయకులు నోరు మెదపరేమి? ఇదేం లౌకిక వాదం? వామపక్షాలు ఇకనైనా ద్వంద్వ ప్రమాణాలకు స్వస్తి పలకాలి.
-వేదుల జనార్దనరావు, వంకావారిగూడెం

ఆడలేక మద్దెల ఓడు..
ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ప్రజల మద్దతు పొందలేక, ఓడిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)పై అనుమానాలు వ్యక్తం చేయటం బిఎస్‌పి అధినేత్రి మాయావతికే చెల్లింది. ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లుంది ఆమె ధోరణి. ప్రజలు పూర్తిగా భాజపాకు మద్దతు పలికారు. ప్రయోజనం లేని, అర్థం లేని అనుమానాలు లేవనెత్తటం సరైనది కాదు. ప్రజల నిర్ణయాన్ని, తీర్పును వినమ్రతతో స్వీకరించాలే గానీ, అర్థం లేని అనుమానాలకు తావివ్వరాదు. ఒకే రాజకీయ పార్టీకి ఓట్లు పడేట్లు ‘ఇవిఎం’లలో ఏర్పాట్లు చేశారని మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోను గౌరవించి తీరాలని గ్రహిస్తే మంచిది. ఇది ప్రతి రాజకీయ పార్టీకి శ్రేయస్కరమని గుర్తించాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురము

హిందూ ధర్మంపై ప్రచారం చేయాలి
ప్రతి హిందూ దేవాలయానికి హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ ఉండాలి. ఈ కమిటీలో హిందూ ధర్మశాస్త్రాలు తెలిసిన వారు ఉండాలి. వారానికి ఒకసారైనా ప్రతి ఇంటికీ వెళ్లి హిందూ ధర్మంపై ప్రచారం చేయాలి. రాజకీయ నాయకులు ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకోవడం మానాలి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విధిగా రోజూ సరస్వతీ పూజ, హయగ్రీవ పూజ వంటివి నిర్వహించాలి. మతం మార్పిడి మాఫియాలను కనిపెట్టి కఠినంగా శిక్షించాలి.
-వి.శశిధర్, విశాఖపట్నం

ఆ మేధావులు ఏమంటారు?
ఇటీవల భాజపా ఎంపి ఒకరు దేశంలో ముస్లింల జనాభా పెరుగుతూ హిందూ జనాభా తగ్గుతున్నదని ఆందోళన చెందగానే విపక్ష నేతలు మైనారిటీలై ప్రేమ ఒలకబోస్తూ వివాదాన్ని రగిలించారు. కానీ, ఈ మధ్యనే విదేశీ సంస్థ ‘వ్యూ’ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇండోనేసియా, పాకిస్తాన్ తర్వాత ముస్లిం జనాభా భారత్‌లోనే ఎక్కువ అని తేలింది. 2050 నాటికి మస్లింలు ఎక్కువగా వున్న దేశం భారత్ అవుతుంది. ఈ శతాబ్దం అంతమయ్యే సరికి అంటే 2100 సంవత్సరంలో క్రైస్తవుల్ని రెండో స్థానానికి నెట్టేసి ముస్లింలే అత్యధిక సంఖ్యలో వుంటారు. మరి.. మైనారిటీల ఓట్ల కోసం పరితపించే నేతలు ఈ వాస్తవాలను చూసి ఏమంటారు?
-సోనాలి, కాకినాడ