ఉత్తరాయణం

చక్కటి విశే్లషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 23న ఎంవిఆర్ శాస్ర్తిగారు తన ‘ఉన్నమాట’లో మత సంప్రదాయాలపై చక్కగా విశే్లషించారు. కోర్టులు విపరీతంగా స్పందిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. అయతే ప్రభుత్వాధికార్లు ఇందుకు తక్కువ తినలేదు. అయన వాళ్లకు ఆకుల్లోను, కానివాళ్లకు కంచాల్లోను అన్న అన్న నానుడిని కచ్చితంగా నిజం చేస్తున్నారు. ఉదాహరణగా నేను విజయనగరంలో ఉన్న రోజుల్లో, మూడు లాంతర్ల దగ్గరినుంచి, అశోకా టాకీసు వరకు రోడ్డు వెడల్పు చేసే సమయంలో పైడితల్లి అమ్మవారి గుడి అడ్డు వచ్చింది. అడ్డుగా ఉన్న వరకు ఆలయాన్ని తొలగించారు. అప్పుడు కోట వద్ద ఢంకేషావలీ బాబా సమాధి రోడ్డుకు, ట్రాఫిక్‌కు అడ్డు వచ్చినా దాన్ని ముట్టుకోలేదు. హిందువులంటే అధికార్లకు చులకన భా వమే. ముస్లింలలో ఉండే సంఘటితత్వం హిందు వులలో ఉంటే, ఈ మతానికి ఎదురే ఉండేది కాదు. ఇప్పటికీ ఢంకేషావలీ బాబా సమాధి ట్రాఫిక్‌కు అడ్డంగానే ఉంది. కోర్టులకు కూడా హిందువులంటే చులకన భావమే. హిందువులు సంఘటితం కావాలి. ప్రతి విషయంలోనూ హిందువులంటే వివక్ష చూపడమేంటో అర్థంకాదు. మెజారిటీ వర్గాలకు విశ్వాసాలుండవా?
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం

విగ్రహాల రాజకీయం
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో రెండు అంబేద్కర్ విగ్రహాలు, మరో రెండు జ్యోతిరావు పూలే విగ్రహాలు, జగ్జీవన్ రామ్ విగ్రహం ఒకటి ప్రతిష్ఠించి ఉన్నాయ. కొద్దికాలం క్రితం జాతీయ రహదారి నాలుగు మార్గాలుగా విస్తరించినపుడు దారి మధ్యలో ఉన్న అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను తొలగించి, ఆ పక్కనే వాటిని తిరిగి ప్రతిష్ఠించారు. కానీ రాజకీయాలే జీవనంగా సాగే కొందరు కలిసి మళ్లీ ఏప్రిల్ 12న ఆ విగ్రహాలకే పునః ఆవిష్కరణ కార్యక్రమం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. విగ్రహాల ఆవిష్కరణ చేయవలసిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఢిల్లీ వెళ్లినందున రాలేకపోవడంతో వాయదా పడింది.
ఎమ్మార్పీఎస్ వారు మహనీయుల విగ్రహావిష్కరణ లను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటు న్నారని ఆరోపిస్తూ, అందుకు నిరసనగా టి.ఎమ్మార్పీఎస్ వారు వూరేగింపు తీసి మందకృష్ణ మాదిగ దిష్టి బొమ్మను దహనం చేస్తుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకొని దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయ.
ఇంతకు ముందే ప్రతిష్ఠించిన విగ్రహాలను పునః ప్రతిష్టించబూనుకోవడం హాస్యాస్పదం, ఒక ప్రహసనం. కొంతమంది వ్యక్తులు తమ స్వార్థ రాజకీయాల కోసం వర్గాలుగా ఏర్పడి పోటాపోటీలుగా మహనీయుల విగ్రహాలను అనేకంగా ప్రతిష్ఠిస్త్తున్నారు. వీరికి పురపాలక సంఘం అనుమతి కూడా అక్కరలేదు. విగ్రహం ప్రతిష్ఠించిన గద్దెపై కొండవీటి చాంతాడంత వారి పేర్ల జాబితా గల శిలాఫలకం ఉంటుంది. మిర్యాలగూడెంలో ఒకే బజారులో రెండు అంబేద్కర్ విగ్రహాలున్నాయ. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పల్లెలో అంబేద్కర్ విగ్రహం ఉన్నదనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. విగ్రహా లను ప్రతిష్ఠించడమే కాని వాటిని మంచి స్థితిలో ఉంచా లన్న అంశమే ఎవరికీ పట్టదు. అట్టి విగ్రహాలకే ప్రకటన కాగితాలను అంటించడం, తోరణాలను కట్టడం చేసి మహనీయులను అవమానించడం జరుగుతున్నది. ఇది చాలా బాధాకరం, సిగ్గుపడాల్సిన విషయం. విగ్రహాలు ప్రతిష్ఠించడం కేవలం ప్రచారం కోసమేనా? వారిని గౌవించడానికి కాదా? మహాపురుషుల విగ్రహాలను ప్రతిష్ఠించడంలోని ఉద్దేశం వారి ఆశయాలకు అనుగుణం గా ప్రజలు నడచుకోవాలని. కాని వాటిని ఎవరూ ఆచ రించడం లేదు. ఆచరించినప్పుడే సార్థకత.
- బి. సత్య ప్రకాశ్, సూర్యాపేట

లాకర్లలో భద్రత ఎంత?
మనం ఎంతో జాగ్రత్తగా, భద్రంగా జీవితం సాగాలని బంగారం లాంటి విలువైన వస్తువులను వీలున్నంత వరకు బ్యాంకు లాకర్లలో పెట్టుకుంటాం. పిల్లల పెళ్లిళ్లకు, అవసరం కలుగుతాయని ఆశతో దాచుకుంటాం. నెల్లూరు దగ్గరలోని ఒక బ్యాంకు అసిస్టెంటు మేనేజరుపై ఒక అభియోగం వచ్చింది. బంగారం నగలు తీసి రోల్డుగోల్డు నగలు పెట్టారన్నది ఆ అభియోగం. అది నిజమో, కాదో దేవుడికే తెలియాలి. కాని ప్రతి బ్యాంకు వారు లాకర్లలో దాచుకునే యజమానికి అదనపు తాళం కప్ప వేసుకునే విధంగా సదుపాయం కలిగించాలి. ఇది అమలు చేస్తే, లాకర్ యజమానులకు ఏవిధమైన ఆందోళన ఉండదు.
- ఆందవరపు నగేశ్, పలాస

పోలీసులపై చర్య తీసుకోవాలి
జమ్మూ, కాశ్మీర్ ప్రదేశంలో విద్యార్థులు పడే కష్టాలు చూస్తుంటే గుండె చెదిరిపోతుంది. ఈనాటికి ‘్భరత్ మాతాకీ జై’ అనే వారిని విచ్చలవిడిగా పోలీసువారే కొట్ట డం ఆశ్చర్యం. విచారణ జరిపి ముందుగా పోలీసులపై చర్య తీసుకోవాలి. అక్కడ శాంతి లేదు. గనుక సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని శాశ్వతంగా అక్కడ ఉంచాలి.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు